88ఏళ్ల వయసులో బొమ్మలు చేసి విదేశాలకు పంపిస్తున్న బామ్మ

వీడియో క్యాప్షన్, 88ఏళ్ల వయసులోను చలాకీగా పనిచేస్తూ స్పూర్తిగా నిలుస్తున్న బామ్మ

సాధారణంగా మహిళలకు 80 ఏళ్లుదాటితే మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు.

కానీ గుజరాత్‌లోన అహ్మదాబాద్‌కి చెందిన బామ్మ 88ఏళ్ల వయసులో సైతం ఆటబొమ్మలు, ఇతర హస్తకళా అలంకరణ వస్తువులు తయారు చేస్తారు.

వాటినిభారత్‌లో అమ్మడమే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

‘‘నాకు 88 ఏళ్లు. నేను దాదాపు యాభయ్యేళ్లుగా హస్తకళా వస్తువుల వ్యాపారంలో ఉన్నాను. మొదట్లో నేను ఫ్లోర్ మ్యాట్లు, చీరలతో మ్యాట్లు తయారు చేసేదాన్ని. నేను పాత చీరలతో మొబైల్ కవర్స్, పర్సులు, జేబురుమాళ్లు కూడా తయారు చేస్తాను. గత కొన్నేళ్లుగా నాకు వేర్వేరు దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. వివిధ రకాల పక్షి

బొమ్మల ఆర్డర్లు వస్తున్నాయి. కస్టమర్లు నాకు పక్షుల శాంపిల్ ఫొటోలు పంపిస్తారు. వాటిని చూసి నేను బొమ్మలు తయారు చేస్తాను. ఇప్పటికి నేను ౧౦ దేశాలకు 75 పక్షల బొమ్మలు ఎగుమతి చేశాను.’’ అని ఆమె చెప్పారు.

పాత బట్టలను ఉపయోగిస్తూ బొమ్మలు, ఇతర హస్తకళా వస్తువులు తయారు చేస్తారు పద్మ బా.

‘‘నేను బెడ్‌షీట్లు తయారు చేస్తాను. ముందుగా ముడి సరకు సేకరిస్తాను ఆ తర్వాత డిజైన్ నిర్ణయించుకుంటాను. ఒక బెడ్ షీట్ తయారు చేయడానికి మూడు నెలలు పడుతుంది. Best from the Waste అనే దానికి ఇదో గొప్ప ఉదాహరణ. ప్లాస్టిక్ సిమెంట్ బస్తా నుంచి నేను ఈ బ్యాగ్ తయారు చేశాను. ఈ పర్సు ఎక్కడో పడి ఉండగా నా కంటపడింది. దానికి బయటి నుంచి డిజైన్ అల్లాను. ఒక కొత్త పర్సు తయారైంది.

దప్పికతో ఉన్న కాకి కథ అందరికీ తెలుసు. నేను ఒక కాకిని తయారు చేసి, ఈ మట్టి కూజాను తెచ్చాను. అలా దీనికో డిఫరెంట్ లుక్ వచ్చింది.

నా దేవత కోసం నేను వులెన్ క్లోత్స్ తయారు చేస్తుంటాను. ఇది చలి కాలం కోసం. వాడేసిన బట్టలు, దారాల నుంచి నేను ఒక బ్లౌజ్ తయారు చేశాను. ఏ చీరనైనా ఇలా బ్లౌజ్‌గా అల్లుకోవచ్చు.’’ అని బామ్మ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)