200 ఏళ్ల నాటి ‘రాబిన్ హుడ్’ చెట్టు నరికివేత, యువకుడి అరెస్టు

ఫొటో సోర్స్, IAN SPROAT
బ్రిటన్‌లో ప్రసిద్ధి చెందిన 200 ఏళ్ల నాటి చెట్టును నరికివేసిన కేసులో 16 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.
నార్తంబర్‌ల్యాండ్‌లోని హాడ్రియన్స్ వాల్ పక్కన సైకామోర్ గ్యాప్ వద్ద ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ మహా వృక్షాన్ని రాత్రి పూట నరికివేశారు.
రాబిన్ హుడ్ ట్రీగా గుర్తింపు పొందిన ఈ వృక్షాన్ని"కావాలనే నరికేసినట్లు” నార్తంబర్‌ల్యాండ్ నేషనల్ పార్క్ అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి నేరపూరిత విధ్వంసం అభియోగం కింద ఓ కుర్రాడిని అరెస్టు చేసినట్లు నార్తంబ్రియా పోలీసులు తెలిపారు.
ఆ కుర్రాడు తమ అదుపులో ఉన్నాడని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి చెప్పారు.

“ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రదేశం. దీన్ని కోల్పోవడం షాకింగ్‌గా ఉంది. స్థానికులతో పాటు చుట్టు పక్కల ఉన్న వారిలోనూ బాధ, ఆగ్రహం పెరుగుతున్నాయి’’ అని సూపరింటెండెంట్ కెవిన్ వారింగ్ చెప్పారు.
దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, PA MEDIA
‘నా గుండె ముక్కలైంది’
హెక్సామ్ ప్రాంతంలో ఈ చెట్టు ప్రకృతి సిద్దంగా పెరిగింది. ఈ చెట్టు కింద కెవిన్ కాస్నర్ నటించిన ‘రాబిన్ హుడ్: ప్రిన్స్ ఆఫ్ థీవ్స్’లో కొన్ని దృశ్యాలు చిత్రీకరించారు.
2016లో ఉడ్‌ల్యాండ్ ట్రస్ట్ నిర్వహించిన పోటీలో ఈ చెట్టు ట్రీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది .
చెట్టును నరికివేయడంపై స్థానికులు అనేక మంది ఉద్వేగానికి లోనయ్యారు. ఈశాన్య ప్రాంతానికి చిహ్నాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెట్టు కూలిపోవడాన్ని చూసిన ఫోటోగ్రాఫర్ ఇయాన్ స్ప్రోట్ “నా గుండె ముక్కలైంది” అని అన్నారు.
హెక్సామ్ ఎంపీ గై ఓపెర్‌మాన్ అయితే "మనసంతా ఆవేదనతో నిండిపోయింది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS
సైకామోర్‌లో "దాదాపు 200 సంవత్సరాలుగా ప్రకృతిలో భాగమైన, ఐకానిక్ ఫీచర్"గా ప్రకటించిన చెట్టుని కోల్పోవడం విషాదకరమే కాకుండా దిగ్బ్రాంతిని కలిగించిందని నేషనల్ ట్రస్ట్ ప్రకటించింది.
లివర్‌పూల్‌లో నివసిస్తున్న అలిసన్ హాకిన్స్ గురువారం ఉదయం సుప్రసిద్ధ రోమన్ గోడ పక్కనే వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ దృశ్యాన్ని చూశారు.
చెట్టును నరికివేసినట్లు నేషనల్ పార్క్ రేంజర్ చెప్పినప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- మహిళ దేహాన్ని నోట కరుచుకుని కనిపించిన 13 అడుగుల భారీ అలిగేటర్
- ఒసిరిస్ రెక్స్: ప్రమాదకరమైన బెన్నూ ఆస్టరాయిడ్ శాంపిళ్లతో నాసా వ్యోమనౌక భూమిపై ఎలా దిగింది?
- అణుబాంబుల ఆనవాళ్లు వెతుకుతుంటే కొత్త జీవులు బయటపడ్డాయి, ఎలాగంటే...
- పాకిస్తాన్ సైన్యం నుంచి తప్పించుకొని కాలి నడకన భారత్ చేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కథ..
- టార్గెట్ కిల్లింగ్స్ మీద అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














