పైలట్ తప్పిదం.. గడ్డ కట్టిన నదిపై దిగిన విమానం

ఫొటో సోర్స్, EAST SIBERIAN TRANSPORT PROSECUTOR'S OFFICE
- రచయిత, పౌల్ కిర్‌బై
- హోదా, బీబీసీ న్యూస్
గడ్డ కట్టిన నదిపై 34 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని పైలట్ పొరపాటున దించేశారు .
ఈ సంఘటన రష్యా తూర్పు ప్రాంతంలో జరిగింది.
సోవియట్ కాలం నాటి అంటోనోవ్ యాన్ 24 విమానం గురువారం ఉదయం గడ్డకట్టిన కోలిమా నదిపై దిగింది.
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
జైర్యాంకా విమానాశ్రయ రన్‌వేకు దూరంగా ఈ విమానం ల్యాండ్ అయింది.
ప్రాథమిక విచారణలో పైలట్ తప్పిదమే దీనికి కారణమని స్థానిక ప్రాసిక్యూటర్లు చెప్పారు.
విమానంలో 30 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.

ఫొటో సోర్స్, EAST SIBERIAN TRANSPORT PROSECUTOR'S OFFICE
రష్యా ఫార్‌ఈస్ట్ ప్రాంతంలోని సఖా రిపబ్లిక్ రాజధాని యాకుత్స్క్ నుంచి పీ1217 విమానం గురువారం ఉదయం బయల్దేరింది.
ఈ విమానం ఈశాన్య భాగంలో 1,100 కిలోమీటర్ల దూరంలోగల జైర్యాంకాకు చేరుకుంది. దాని తరువాత యాకుత్స్క్‌కు తిరిగి వచ్చేటప్పుడు స్రెడ్నెకోలిమ్స్క్ లోని చిన్న పట్టణానికి వెళ్ళాల్సి ఉంది.
తూర్పు సైబీరియాలోని గడ్డకట్టిన కోలిమా నది మధ్య భాగంలో ఈ విమానం దిగినట్టుగా ఓ పాసింజర్ తీసిన వీడియోలో కనినిస్తోంది.
సహజంగా ఏటా ఈ సమయంలో జైర్యాంకాలో మైనస్ 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి.
అయితే ఈ విమానం దిగిన చోట దిగువన ఇసుక ఉందని స్థానిక ప్రాసిక్యూటర్లు చెప్పారు.
గడ్డ కట్టిన నదిపై ఏర్పడిన చక్రాల గుర్తులు, విమానం పూర్తిగా ఆగిపోవడానికి ఎంత సమయం పట్టిందో సూచిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
- నీళ్లలో మీ మలం తేలుతుందా? అది చెప్పే ఆరోగ్య రహస్యాలు ఇవీ!
- కొత్త మహా సముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- ‘మా ఆయనకు తీరిక లేదు, నేను వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'
- అటల్ బిహారీ వాజపేయి: ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు?
- ఆంధ్రప్రదేశ్: విదేశీ పందెం కోళ్లను విమానాల్లో దించుతున్నారు, ఏ దేశపు కోడికి డిమాండ్ బాగా ఉందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














