టీ20 వరల్డ్ కప్: భారత్ ఇలా చేసి ఉండకపోతే గెలిచేది కాదు

టి20 వరల్డ్ కప్ ఫైనల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌కు ఐసీసీ టైటిల్ కరవు తీరింది. టీ20 వరల్డ్ కప్ రూపంలో 11 ఏళ్ల తర్వాత భారత్ ఓ ఐసీసీ టైటిల్‌ను, 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను అందుకుంది.

శనివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌ కప్ ఫైనల్లో సంతోషం, బాధ, ఉత్కంఠ కలిగించే ఎన్నో చిరస్మరణీయ క్షణాలు ఉన్నాయి.

మ్యాచ్‌లో ఒక దశలో క్లాసెన్, మిల్లర్ క్రీజులో ఉన్నప్పుడు ఇక భారత్ మరో గుండె కోతను (ఫైనల్ ఫెయిల్యూర్‌) ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని అందరూ భయపడ్డారు.

కానీ, ప్రమాదకరంగా మారిన క్లాసెన్‌ను హార్దిక్ అవుట్ చేసిన క్షణం, తీవ్ర ఒత్తిడిలో బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్, బుమ్రా చివరి ఓవర్లలో చేసిన అద్భుత బౌలింగ్, విరాట్ కోహ్లీ- అక్షర్ పటేల్‌ ఇన్నింగ్స్ వంటివి భారత్‌ను మళ్లీ విశ్వవిజేతగా నిలిపాయి.

మ్యాచ్‌లో భయపెట్టించిన, మ్యాజిక్ సృష్టించిన మూమెంట్స్ గురించి చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
అక్షర్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

భయపెట్టించిన అక్షర్ పటేల్ ఓవర్‌

ఛేదనలో దక్షిణాఫ్రికా వెనక్కి తగ్గలేదు. అయిదు నుంచి పద్నాలుగో ఓవర్ మధ్య సఫారీలు కనీసం ఓవర్‌కు ఒక బౌండరీ బాదారు.

భారత్ బ్యాటింగ్ చేసినప్పటిలా కాకుండా పరిస్థితులు మారాయి. బంతి చక్కగా బ్యాట్‌పైకి వస్తుండటంతో హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ సులభంగా పరుగులు రాబట్టారు. 14వ ఓవర్ ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా విజయ సమీకరణం 36 బంతుల్లో 54 పరుగులుగా ఉంది.

అప్పుడే 15వ ఓవర్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌కు దిగాడు. క్లాసెన్ వరుసగా రెండు సిక్సర్లు, మరో రెండు ఫోర్లు బాదడంతో 24 పరుగులు వచ్చాయి.

దీంతో విజయ సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారిపోయింది. అంటే ఒక్కో బాల్‌కు ఒక్కో పరుగు చేస్తే సరిపోతుంది. అప్పటికే క్రీజులో చెలరేగి ఆడుతున్న క్లాసెన్, మిల్లర్ ఉండటంతో మ్యాచ్ పూర్తిగా దక్షిణాఫ్రికా వైపు మొగ్గినట్లు కనిపించింది.

బుమ్రా ఏమైనా చేద్దామన్నా కూడా అప్పటికే ఆలస్యమైపోయింది. కానీ, అతడు వదల్లేదు.

బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

బుమ్రా ఏం చేశాడంటే?

తననొక అద్భుత బౌలర్ అని, వరల్డ్ క్లాస్ బౌలర్ అని ఎందుకు పిలుస్తారో బుమ్రా ఇక్కడ రుజువు చేశాడు.

16వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చిన బుమ్రా అప్పటివరకు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన, టీ20ల్లో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా పేరున్న క్లాసెన్‌ను నిలువరించాడు.

ఈ ఓవర్‌లో మూడు డాట్ బాల్స్ రావడంతో పాటు మిల్లర్, క్లాసెన్ కలిసి కేవలం 4 పరుగులే చేశారు. దీంతో ఆట భారత్ వైపు మొగ్గలేదు. కానీ, సఫారీలపై కాస్త ఒత్తిడి పెరిగింది. భారత్‌లో మళ్లీ ఆశలు చిగురించాయి.

18వ ఓవర్‌లో మళ్లీ బంతిని అందుకున్న బుమ్రా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అప్పటికి దక్షిణాఫ్రికాకు 18 బంతుల్లో 22 పరుగులు కావాలి. కానీ, బుమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. జాన్సన్‌ను అవుట్ చేశాడు.

ఇలా తన చివరి రెండు ఓవర్లలో బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి దక్షిణాఫ్రికాను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. బుమ్రా ఇలా పరుగుల్ని నియంత్రించకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో!

17వ ఓవర్‌లో భారత్‌కు లభించిన పెద్ద ఉపశమనం గురించి ఇప్పుడు చూద్దాం.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 1
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Instagram ముగిసింది, 1

టి20 వరల్డ్ కప్ ఫైనల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్లాసెన్ అవుట్ తర్వాత భారత జట్టు సంబరాలు

మైదానం పైకప్పుపై పడ్డ బాల్

మ్యాచ్ జరుగుతున్నకొద్దీ టీమిండియాను బాగా భయపెట్టిన క్రికెటర్ క్లాసెన్. అందివచ్చిన బంతిని బలంగా బాదుతూ టీమిండియా బౌలర్లు చేష్టలుడిగిపోయేలా చేశాడు క్లాసెన్.

తన ఇన్నింగ్స్‌లో అయిదు భారీ సిక్సర్లు బాదాడు. ఒకటైతే వెళ్లి ఏకంగా మైదానం పైకప్పుపై పడింది. మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ కలిసి కొట్టింది మూడు సిక్సర్లే.

అతను క్రీజులో ఉంటే మ్యాచ్ పోయినట్లేనని సగటు అభిమాని అనుకున్న దశలో స్లోయర్ బంతితో పాండ్యా అతన్ని బోల్తా కొట్టించాడు.

ప్రమాదకరంగా మారిన క్లాసెన్‌ను 17వ ఓవర్ తొలి బంతికి హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. ఇది భారత్‌కు లభించిన ఒక పెద్ద ఉపశమనం. ఆ వికెట్ పడటంతో భారత్ మళ్లీ ఊపిరి పీల్చుకుంది. క్లాసెన్‌ను పాండ్యా అవుట్ చేయకపోతే మ్యాచ్ భారత్ చేజారిపోయేదే!

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 2
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Instagram ముగిసింది, 2

సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

సూర్యకుమార్ అద్భుత క్యాచ్

ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా 16 పరుగులు చేయాలి.

అప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని హార్దిక్ పాండ్యాకు అందించాడు.

పాండ్యా వేసిన తొలి బంతికే మిల్లర్ లాంగాఫ్ దిశగా సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించాడు.

వైడ్ లాంగాఫ్ నుంచి వేగంగా పరిగెత్తుతూ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టుకున్నాడు.

కానీ, నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ దాటబోతుండగా చేతిలోని బంతిని గాల్లోకి ఎగరేశాడు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 3
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Instagram ముగిసింది, 3

మైదానంలోకి తిరిగి వచ్చి బంతిని విజయవంతంగా అందుకోవడంతో ఆ క్షణం అభిమానుల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. భారత్ విజయం అంచుల్లో నిలిచింది. ఈ క్యాచ్ మ్యాచ్ గమనాన్ని మార్చిందని కచ్చితంగా చెప్పొచ్చు.

సూర్య క్యాచ్‌తోపాటు ఆఖరి ఓవర్‌లో ఒత్తిడిని ఎదుర్కొంటూ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన విధానం జట్టును గెలిపించింది. ఆఖరు బంతికి రబడను పాండ్యా అవుట్ చేశాడు.

పాండ్యా తన చివరి రెండు ఓవర్లలో మూడు కీలక వికెట్లు తీసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ యాంకర్ ఇన్నింగ్స్

వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా ఓపెనర్‌గా ముందుండి నడిపించిన రోహిత్, కీలక ఫైనల్ మ్యాచ్‌లో 9 పరుగులకే అవుటయ్యాడు. రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. ఎన్నో అంచనాలున్న సూర్యకుమార్ యాదవ్ (3) నిరాశపరిచాడు.

ఇంకో వికెట్ పడితే భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయేదే. కానీ, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌కు మూల స్తంభంలా నిలిచాడు.

ఫైనల్‌కు ముందు అన్ని మ్యాచ్‌ల్లో కలిపి 75 పరుగులే చేసిన కోహ్లీ, ఫైనల్లో 76 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.

ఓ ఎండ్‌లో కోహ్లీ పాతుకుపోవడంతో మరో ఎండ్‌లో అక్షర్ పటేల్, శివమ్ దుబే ఒత్తిడి లేకుండా ఆడగలిగాడు. అక్షర్‌తో నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 72 పరుగులు, శివమ్ దుబేతో 33 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 4
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Instagram ముగిసింది, 4

ఈ మ్యాచ్‌లో కోహ్లీ విచిత్రమైన ఇన్నింగ్స్ ఆడాడు.

తాను ఎదుర్కొన్న తొలి 5 బంతుల్లో చకాచకా 14 పరుగులు చేశాడు. సూర్యకుమార్ వికెట్ పడే సమయానికి 16 బంతుల్లో 22 పరుగులు సాధించాడు.

వికెట్లు పడుతుండటంతో నెమ్మదించిన కోహ్లీ 43 బంతుల్లో 36 పరుగులే చేశాడు.

అతను అర్ధసెంచరీ చేయడానికి 48 బంతులు తీసుకున్నాడు.

అర్ధసెంచరీ తర్వాత ఎదుర్కొన్న 11 బంతుల్లో 26 పరుగులతో ధాటి కనబరిచాడు.

కోహ్లీ యాంకర్ ఇన్నింగ్స్‌తో ఒక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు (176) చేసిన జట్టుగా భారత్ నిలిచింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)