ఈ వృద్ధ టీచర్‌ను మహిళా కానిస్టేబుళ్లు ఎందుకు కొట్టారు, అసలేం జరిగింది?

వృద్ధుడిని కొట్టిన మహిళా కానిస్టేబుళ్లు
    • రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిహార్‌లోని కైమూర్‌లో ఇద్దరు మహిళా హోం గార్డులు 58 ఏళ్ల ఉపాధ్యాయుడిని రోడ్డుపైనే కొట్టిన వీడియో వెలుగులోకి వచ్చింది.

ఈ సంఘటన బయటికి వచ్చిన తర్వాత ఈ మహిళా హోం గార్డులపై పోలీసు డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకుంది. ఈ ఇద్దర్ని మూడు నెలల పాటు సర్వీసుల నుంచి సస్పెండ్ చేసింది.

ఈ సంఘటన కైమూర్ జిల్లాలోని భబువా ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది.

ఇద్దరు హోం గార్డులను మూడు నెలల పాటు సర్వీసుల నుంచి సస్పెండ్ చేసినట్టు కైమూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు లలిత్ మోహన్ శర్మ చెప్పారు.

వృద్ధుడిని కొడుతున్న వీడియో వైరల్ అయిన తర్వాత విచారణలో భాగంగా తక్షణమే ఆ ఇద్దరు హోం గార్డులను సర్వీసుల నుంచి తొలగించినట్లు కైమూర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల్లో తెలిసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

వృద్ధుడిని కొట్టిన మహిళా కానిస్టేబుళ్లు

ఫొటో సోర్స్, ABHINAV KUMAR

బాధిత ఉపాధ్యాయుడు ఏం చెబుతున్నారు?

బాధితుడి పేరు నావల్ కిశోర్ పాండే. ఒక ప్రైవేట్ స్కూల్‌లో తాను ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నట్లు 58 ఏళ్ల నావల్ కిశోర్ తెలిపారు.

శుక్రవారం స్కూల్‌కి సెలవు కావడంతో జయప్రకాశ్ చౌక్ నుంచి తిరిగి వస్తున్నట్టు తెలిపారు. ఆ సమయంలో రోడ్డుపై చాలా ట్రాఫిక్ ఉందని, తన సైకిల్‌తో రోడ్డును క్రాస్ చేయబోయినట్లు చెప్పారు.

ఆ సమయంలో ఒక మహిళా హోం గార్డు ఆయనకు ఏదో చెప్పారు. కానీ, ఆయన దాన్ని వినిపించుకోకుండా ముందుకు వెళ్లబోయారు.

దీంతో ఉపాధ్యాయుడి సైకిల్‌ని ముందు నుంచి ఒక మహిళా హోం గార్డు, వెనుక నుంచి మరో హోం గార్డు పట్టుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఆయన్ని కొడుతూ.. తిట్టడం ప్రారంభించారు.

ఆ సమయంలో మీరేం చెప్పారు, ఎందుకు కొడుతున్నారో చెప్పాలంటూ వేడుకుంటున్నా వదలకుండా కొడుతూనే ఉన్నారని కిశోర్ పాండే చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

‘‘జయప్రకాశ్ చౌక్ చాలా రద్దీగా ఉంది. నేను నా రెండు చేతులతో సైకిల్‌ని పట్టుకున్నాను. నా చేతిపై కర్రతో కొట్టారు. నేను వారిని పట్టించుకోలేదు. ఏం మాట్లాడకుండానే ముందుకు కదిలాను. ఒకరు వెనుకాల నుంచి వచ్చిన నా సైకిల్ పట్టుకున్నారు. ఒకరు ముందు, మరొకరు వెనుకాలకి వచ్చి కొట్టడం ప్రారంభించారు. కానీ, వారిని నేనేమీ అనలేదు’’ అని నావల్ కిశోర్ తెలిపారు.

ఈ విషయంలో నావల్ కిశోర్ వారిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

‘‘దీని తర్వాత చాలా మంది అక్కడికి చేరుకున్నారు. నన్ను వదిలిపెట్టాలని వారు మహిళా హోం గార్డులను కోరారు. నేను 20 కర్రలను సైకిల్‌పై మోసుకుని వెళ్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కొట్టడంతో నాకు చాలా నొప్పిగా అనిపించింది. అందుకే నేను ఇంటికి వచ్చేశాను’’ అని నావల్ కిశోర్ చెప్పారు.

మహిళా హోం గార్డులను వారి ఉద్యోగం నుంచి తొలగించాలని నావల్ కిశోర్ కోరారు. తనకు దెబ్బలు తగలడం మాత్రమే కాదని, తన పరువు కూడా పోయిందన్నారు.

పోలీసులు ఏం చెప్పారు?

‘‘ఇది చూసిన తర్వాత, పోలీసుల పరువు తీసేసినట్టు అనిపించింది. పోలీసుల నుంచి ఇలాంటి రకమైన చర్యలను నేనసలు ఊహించలేదు’’ అని కైమూర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు లలిత్ మోహన్ శర్మ అన్నారు.

ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశించినట్టు భబువా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బీబీసీకి తెలిపారు.

24 గంటల్లో విచారణ నివేదిక అందిందని, ఆ తర్వాత ఆ ఇద్దరు హోం గార్డులపై వేటు వేసినట్టు చెప్పారు.

రోడ్డు నుంచి త్వరగా తప్పుకోవాలని నావల్ కిశోర్‌ను కోరగా, ఆయన తమల్ని స్థానిక భాషలో అభ్యంతరకర పదాలతో తిట్టినట్టు ఒక మహిళా హోం గార్డు చెప్పారు. ఆ తర్వాతనే మరో మహిళా హోం గార్డు ఆయన్ని కొట్టడం ప్రారంభించిందన్నారు.

కారణం ఏదైనప్పటికీ, అది తప్పని, అందుకే తాము చర్యలు తీసుకున్నట్టు లలిత్ మోహన్ శర్మ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

ఇది చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)