అంతరించిపోయిన ఈ నక్క ఒకప్పుడు మనిషికి బెస్ట్ ఫ్రెండా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, ఎన్విరాన్‌మెంట్ కరెస్పాండెంట్
కుక్కలు మన బెస్ట్ ఫ్రెండ్‌గా మారడానికి చాలా కాలం ముందు, అంతరించిపోయిన దక్షిణ అమెరికా జాతి నక్కలు మనుషుల పెంపుడు జంతువులుగా ఉండి ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
దక్షిణ అమెరికాలోని ప్రాచీన మానవ సముదాయాల్లో మనుషుల సమాధుల పక్కన నక్కలను పాతిపెట్టినట్లు పురావస్తుశాఖ అధ్యయనంలో తేలింది.
అర్జెంటీనాలోని పెటగోనియాలో 1500 ఏళ్ల కిందటి మానవ సమాధి పక్కన నక్కను పాతి ఉంచడాన్ని చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురయ్యారు.
నక్కను అత్యంత విలువైన భాగస్వామిగా లేదా పెంపుడు జంతువుగా ఉన్నట్లు చెప్పేందుకు ఇదొక ఆధారంగా భావించొచ్చని అన్నారు.
ప్రాచీన కాలంలో వేటగాళ్లకు పక్కన కూర్చుని నక్కలు కూడా ఆహారం తినేవని డీఎన్ఏ పరిశీలనల్లో తేలింది. మానవ క్యాంపుల్లో జంతువులు కూడా భాగమయ్యాయని తెలిసింది.
సుమారు దశాబ్దం క్రితం అర్జెంటీనాలోని మరో ప్రాంతంలో కూడా పురాతన సమాధుల్లో నక్క లాంటి జీవుల అవశేషాలను గుర్తించారు.
‘‘వేటగాళ్లతో ఈ నక్కలు బలమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నాయని తేలడం చాలా అరుదైన విషయం’’ అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఓఫెలీ లెబ్రాసర్ అన్నారు.
అర్జెంటీనాలోని కెనడా సెకాలో శ్మశానంలో నక్కను గుర్తించారు. ఇది ఒకప్పుడు వేటగాళ్ల బృందంతో కలిసి జీవించేదని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Francisco Prevosti
అర్జెంటీనా, పెరూ ప్రాంతంలోని పురాతన మానవ శ్మశాన వాటికల్లో గుర్తించిన అడవి నక్కల దంతాలు, ఈ జంతువుకు మనుషులతో చెప్పుకోదగ్గ రీతిలో అనుబంధం ఉండేదని సూచిస్తున్నాయి.
కానీ, మనిషి సమాధి పక్కనే నక్కకు చెందిన పూర్తి అస్థిపంజరం గుర్తించడం ప్రపంచవ్యాప్తంగా పురావస్తుశాఖ రికార్డుల్లో అత్యంత అరుదు.
ఈ నక్క శాస్త్రీయ నామం డ్యూసియాన్ అవుస్. దీని బరువు 10 కిలోల నుంచి 15 కిలోల వరకు ఉండేది. 500 ఏళ్ల క్రితమే ఈ జాతి నక్క అంతరించిపోయింది. వందేళ్ల తర్వాత పెటగోనియాలో పెంపుడు కుక్కలు పుట్టుకొచ్చాయి.
అర్జెంటీనాలోని మెన్డోజాలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎవాల్యుషన్ డాక్టర్ సింథియా అబ్బోనా సహకారంతో ఈ పరిశోధన చేపట్టారు. రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ఇది ప్రచురితమైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి:
- స్వతంత్ర వార్తాసంస్థగా ‘కలెక్టివ్ న్యూస్‌రూమ్’ ప్రారంభం
- హైదరాబాద్‌కు కూడా భవిష్యత్తులో బెంగళూరులాగా నీటి కష్టాలు తప్పవా?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
- గాజా - ఈద్: ‘మా నుంచి పండుగ సంతోషాన్ని లాగేసుకున్నారు’.. అనాథలైన చిన్నారుల ఆవేదన
- ప్రిసిల్లా హెన్రీ: హాలీవుడ్ సినిమాను తలపించే ఓ 'సెక్స్' సామ్రాజ్యాధినేత్రి కథ
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














