స్వతంత్ర వార్తాసంస్థగా ‘కలెక్టివ్ న్యూస్‌రూమ్’ ప్రారంభం

ఫొటో సోర్స్, Collective news room
దేశంలో అత్యంత విశ్వసనీయమైన, సృజనాత్మకమైన, సాహసోపేతమైన జర్నలిజం కోసం పూర్తిగా భారతీయులే స్థాపించిన ‘కలెక్టివ్ న్యూస్‌రూమ్’ అనే స్వతంత్ర వార్తాసంస్థ తన కార్యక్రమాలను ప్రారంభించింది.
ఇండియా నుంచి ఈ సంస్థ పబ్లిష్ చేసే వార్తలు, కథనాలు, కార్యక్రమాలకు మొదటి క్లైంట్- బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ).
బీబీసీతోపాటు భారతదేశం, అంతర్జాతీయంగా ఇతర దేశాల్లోని వార్తాసంస్థలకు కూడా తన కంటెంట్ అందించేందుకు కలెక్టివ్ న్యూస్‌రూమ్ సిద్ధంగా ఉంది.
భారతీయులకు పరిశోధనాత్మక, ప్రభావవంతమైన జర్నలిజాన్ని అందించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కోసం కథనాలను అందించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
వార్తలు అందించే విషయంలో ప్రమాణాలు, ఎడిటోరియల్ అంశాల విషయంలో కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రతిష్ఠాత్మకంగా వ్యవహరిస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్‌కు నాణ్యమైన కంటెంట్ అందిస్తుంది.

ఫొటో సోర్స్, COLLECTIVE NEWSROOM
ప్రజలకు వాస్తవాలను చెప్పడమే లక్ష్యం: సీఈవో రూపా ఝా
“అపార అనుభవం ఉన్న సిబ్బంది, విశ్వసనీయత, సృజనాత్మకత, సాహసోపేతమైన జర్నలిజాన్ని అందించాలన్న స్పష్టమైన లక్ష్యంతో కలెక్టివ్ న్యూస్‌రూమ్ ఏర్పడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది” అని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) రూపా ఝా చెప్పారు.
“ప్రజలకు వాస్తవాలను తెలియజేయడంతోపాటు ప్రజా ప్రయోజనాల కోసం పని చెయ్యడం, వివిధ వర్గాల గొంతు వినిపించడమే లక్ష్యంగా కలెక్టివ్ న్యూస్‌రూమ్ పనిచేస్తుందని ఆడియన్స్ త్వరలోనే తెలుసుకుంటారు” అని ఆమె వివరించారు.
సీఈవో రూపా ఝాకు తోడుగా ముఖేష్ శర్మ, సంజోయ్ మజుందార్, సారా హసన్ సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారు. వీరికి మీడియా రంగంలో విస్తృతమైన అనుభవం ఉంది.
కలెక్టివ్ న్యూస్‌రూమ్ తొలి క్లైంట్ బీబీసీ. బీబీసీ తమ భాషా సేవల్లో అతిపెద్దదైన బీబీసీ హిందీ కోసం కంటెంట్‌ను సిద్ధం చేసేందుకు కాంట్రాక్టును కలెక్టివ్ న్యూస్‌రూమ్‌కు అప్పగించింది. మునుపటి ఏడాదితో పోలిస్తే, 2023లో అన్ని ప్లాట్‌ఫామ్‌లపై కలిపి బీబీసీ హిందీ వీక్లీ రీచ్ 27 శాతం పెరిగింది.
బీబీసీ న్యూస్ హిందీతోపాటు బీబీసీ న్యూస్ మరాఠీ, బీబీసీ న్యూస్ తెలుగు, బీబీసీ న్యూస్ గుజరాతీ, బీబీసీ న్యూస్ పంజాబీ, బీబీసీ న్యూస్ తమిళ్ కోసం కూడా కంటెంట్ సిద్ధంచేసి, పబ్లిష్ చేసే బాధ్యతలను కలెక్టివ్ న్యూస్‌రూమ్‌కు బీబీసీ అప్పగించింది. భారత ఆడియన్స్ కోసం ఇంగ్లిష్‌లో డిజిటల్, యూట్యూబ్ సేవలకు కూడా కలెక్టివ్ న్యూస్‌రూమ్ కంటెంట్‌ను సిద్ధం చేస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి:
- సంపూర్ణ సూర్యగ్రహణం: ఆ 4 నిమిషాలు నాసాకు ఎందుకంత కీలకం?
- దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడ?
- జకాత్: ముస్లింల దగ్గర ఉండే డబ్బు, బంగారంలో ఎంత దానం చేయాలని ఇస్లాం చెబుతోంది?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆస్తమా: ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో ఇబ్బందికి కొత్త కారణాన్ని గుర్తించిన పరిశోధకులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














