బీబీసీకి వందేళ్లు: బీబీసీ సృష్టికర్త ఎవరు? ఈ సంస్థకు పునాదులు వేసింది ఎవరు?
18 అక్టోబర్ 2022న బీబీసీ 100వ పుట్టినరోజు జరుపుకుంది.
మొదట్లో కేవలం నలుగురు ఉద్యోగులతో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ అనే పేరుతో ప్రారంభమైన సంస్థ నేడు 42 భాషల్లోకి విస్తరించింది.
అయితే, వాయుతరంగాల ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచేందుకు ఒక సంస్థను స్థాపించాలనే ఆలోచనకు స్ఫూర్తిగా నిలిచింది - 1922లో దక్షిణ ఇంగ్లండ్‌లో ప్రయోగాత్మకంగా మొదలైన ఒక రేడియో ప్రసార కార్యక్రమం. అలనాటి బీబీసీ రేడియో ప్రసారకుల విశేషాలేంటో డేవిడ్ సిలిటో అందిస్తున్న కథనంలో చూద్దాం.
ఆర్థర్ బరోస్.. బీబీసీ అనే ఐడియాకు ఈయనే సృష్టికర్త.
1922లో బీబీసీ ప్రసారం చేసిన మొట్టమొదటి గొంతు ఈయనదే.
అయితే, వాయు తరంగాలతో వినోదాన్ని పంచాలని ముందుగా ఆలోచించింది మాత్రం పీటర్ ఎకర్‌స్లీ.
ఈయన బ్రిటిష్ యూనియన్ ఆఫ్ ఫాసిస్ట్స్‌తో చేసిన చెలిమి వల్ల చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్ యుద్ధ సన్నాహాల్లో భాగం కావడం ద్వారా ఆ చెడ్డపేరును కొంత పోగొట్టుకున్నారు.
1922లో ఆయన బ్రిటన్‌లో తొలి రెగ్యులర్ రేడియో ప్రోగ్రాం రూపొందించారు. దానికి లభించిన ప్రజాదరణే బీబీసీ ఏర్పాటుకు ప్రేరణ అయ్యింది.
ప్రతి మంగళవారం పీటర్ ఎకర్‌స్లీ ఇందులోంచే ప్రసారాలు చేసేవారు.
'అప్పట్లో షో ప్రారంభం కావడానికి ముందు అందరూ కలిసి పబ్‌కు వెళ్లేవారు' అని చెమ్స్‌ఫర్డ్ మ్యూజియంకు చెందిన సారా హార్వే చెప్పారు.
''అంటే మద్యం సేవించిన తర్వాతే ప్రసారాలు చేసేవాళ్లన్నమాట.''
అప్పటి బీబీసీ అనగానే మనకు బో టైలు, డిన్నర్ సూట్లు మనసులో మెదులుతాయి. ఇది కాస్త అరాచకంగానే ఉండేదన్న మాట.
వందేళ్లు గడచినా, బీబీసీకి పునాదులు వేసిన ఆ ఇద్దరి గొంతుల ప్రతిధ్వనులను మీరు ఇప్పటికీ వినొచ్చు.
ఇవి కూడా చదవండి:
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- రోజర్ బిన్నీ: ప్రపంచంలోనే సుసంపన్న క్రికెట్ బోర్డు అధ్యక్షుడు గురించి మనకు ఏం తెలుసు?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
- జయలలిత సర్జరీని ఎవరు, ఎందుకు అడ్డుకున్నారు? ఆర్ముగస్వామి నివేదికలో సరికొత్త అనుమానాలు
- దగ్గు మందు మరణాలు: భారత్‌లో తయారవుతున్న ఔషధాలు సురక్షితమైనవి కావా?
- పవన్ కల్యాణ్; 'ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా'- 'ఒక్కసారి కాదు వందసార్లు అంటా' -వైసీపీ మంత్రి అంబటి రాంబాబు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



