మిస్ యూనివర్స్ పోటీలు: ‘టాటూల తనిఖీ పేరుతో మగవాళ్ల ముందు దుస్తులు విప్పించారు’

ఫొటో సోర్స్, Miss Universe Indonesia
మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పాల్గొన్న పలువురు పోటీదారులు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఇండోనేసియా ఫ్రాంచైజీ ‘పీటీ క్యాపెల్లా స్వస్తికా కార్య’తో మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ (ఎంయూవో) సంబంధాలు తెంచుకుంది.
జకార్తాలో మిస్ యూనివర్స్ కిరీట ధారణ వేడుకకు కొన్ని రోజుల ముందు వారు ఈ ఆరోపణలు చేశారు.
పోటీదారుల ఆరోపణలపై జకార్తా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా ఎడిషన్ పోటీల్లో అసలు ఊహించని విధంగా శరీరంపై టాటూలు, గాయాల తాలూకూ మచ్చలు, కొవ్వు తనిఖీల పేరిట దుస్తులు విప్పాలని మిస్ యూనివర్స్ ఇండోనేషియా ఫైనలిస్టులను అడిగారని ఆ మహిళలు చెప్పారు. శరీరం పైభాగంలో దుస్తుల్లేకుండా తమను ఫోటోలు తీశారని కూడా కొందరు వెల్లడించారు.
‘‘నా హక్కుల ఉల్లంఘన జరిగినట్లుగా అనిపించింది’’ అని మిస్ యూనివర్స్ ఇండోనేషియా పోటీదారుల్లో ఒకరు స్థానిక మీడియాతో చెప్పారు.
‘‘మానసికంగా ఇది నాపై ప్రభావం చూపింది. నిద్ర కూడా పట్టలేదు’’ అని ఆమె అన్నారు.
‘‘తలుపులు దగ్గరగా వేసిన గదిలోనే మమ్మల్ని తనిఖీ చేశారు. కానీ, ఆ గదిలో కొందరు పురుషులు కూడా ఉన్నారు. ఆ గది తలుపులు కూడా పూర్తిగా మూసేయలేదు. బయట నుంచి చూసేవారికి లోపల జరిగేదంతా కనిపిస్తుంది’’ అని ఒక ఫిర్యాదుదారు చెప్పారు.
బ్రాండ్ ప్రమాణాలకు, నైతికతకు, అంచనాలకు తగినట్లుగా ఇండోనేసియా ఫ్రాంచైజీ వ్యవహరించలేదని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ తెలిపింది.
ఈ ఏడాది మలేసియాలో జరిగే అందాల పోటీలను కూడా పీటీ క్యాపెల్లా స్వస్తికా కార్య కంపెనీయే నిర్వహించనున్న నేపథ్యంలో వాటిని రద్దు చేస్తున్నట్లు ఎంయూవో ప్రకటించింది.
ఎంయూవో అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
విధానాలను పునః పరిశీలిస్తున్నాం: ఎంయూవో
లైంగిక వేధింపులపై ఫిర్యాదు ఇచ్చి ధైర్యం ప్రదర్శించిన మహిళలను మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ప్రశంసించింది. మహిళలకు సురక్షిత వాతావరణాన్ని అందించడమే తమ తొలి ప్రాధాన్యమని చెప్పింది.
ఇలాంటి ఘటనలను నివారించడానికి తమ విధానాలను పునః పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా తాము నిర్వహించే అందాల పోటీల్లో పాల్గొనడానికి ఎలాంటి శరీర కొలతలు అవసరం లేదని స్పష్టం చేసింది.
‘‘మిస్ యూనివర్స్ ఇండోనేసియా ఫ్రాంచైజీలో జరిగిన ఘటనల ప్రకారం చూస్తే, మా బ్రాండ్ ప్రమాణాలు, నైతిక విలువలు, అంచనాలకు అనుగుణంగా ఇండోనేసియా ఫ్రాంచైజీ వ్యవహరించలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది’’ అని శనివారం రాత్రి ఎంయూవో ఒక పోస్ట్‌లో చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
మిస్ యూనివర్స్ పోటీలకు ఆగ్నేయాాసియాలో ఆదరణ అధికం
ఈ ఏడాది మిస్ యూనివర్స్ 73వ ఎడిషన్ పోటీలు జరుగుతున్నాయి.
నిర్వాహకులు మామూలుగా పోటీదారుల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) గురించి అడుగుతుంటారని, ఇలా నగ్నంగా తనిఖీలు చేయరని మాజీ మిస్ ఇండోనేసియా మరియా హర్ఫాంటి చెప్పారు.
ఆగ్నేయాసియా(సౌత్ ఈస్ట్ ఏసియా)లో మిస్ యూనివర్స్ పోటీలకు ఆదరణ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లో వీటికి ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఈ పోటీల విజేతలు సెలెబ్రిటీలుగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లుగా మారతారు.
మిస్ యూనివర్స్ పోటీల్లో వివాహిత మహిళలు, ట్రాన్స్‌విమెన్, ఒంటరి తల్లులు పోటీపడేందుకు అనుమతించి దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా బ్రాండ్‌ను పునరుద్ధరించాలని ఎంయూవో యజమాని ఆనీ జాక్రజుటాటిప్ కోరారు.
ఆనీ జాక్రజుటాటిప్ ఒక థాయ్ ట్రాన్స్‌విమెన్, మీడియా మొగల్.
ఇండోనేసియా ఫ్రాంచైజీ ‘పీటీ క్యాపెల్లా స్వస్తికా కార్య’ డైరెక్టర్ పాపీ క్యాపెల్లా ఈ ఆరోపణల గురించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు.
2023 మిస్ యూనివర్స్ పోటీల నిర్వహణలో భాగమైన వారెవరికీ, శరీర తనిఖీల పేరుతో హింస, లైంగిక వేధింపులకు పాల్పడేందుకు అనుమతి ఇవ్వలేదని పాపీ అన్నారు.
ఏ రకమైన హింస, లైంగిక వేధింపులకైనా తాను వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు.
ఎల్ సాల్వెడార్ వేదికగా నవంబర్ నెలలో జరిగే 2023 మిస్ యూనివర్స్ ఫైనల్స్ పోటీలకు అర్హత సాధించిన ఇండోనేసియా పోటీదారు ఫాబియానె నికోల్ గ్రోనెవెల్డ్ తమ మద్దతుతో ఫైనల్లో పోటీ పడుతుందని ఎంయూవో చెప్పింది. ఫైనల్స్‌లో 90 మంది పోటీపడనున్నారు.
ఇవి కూడా చదవండి:
- మహారాష్ట్ర: ఠాణే ఆస్పత్రిలో ఒకే రాత్రి 17 మంది మృతి... అసలేం జరిగింది?
- మిలా: ‘‘సవతి తండ్రి కంటే ముందు నుంచే ఒక అంకుల్ ఏళ్లపాటు లైంగికంగా వేధించాడు’’
- హస్తప్రయోగ ఘటనలు బహిరంగ ప్రదేశాల్లో పెరుగుతున్నాయి... మహిళలు ఎలా ఫిర్యాదు చేయాలి?
- కామసూత్ర గ్రంథంలో లైంగిక భంగిమల గురించే రాశారా... అందులో ఇంకా ఏముంది?
- పాలియామరీ: ఆయనకు ఇద్దరు లైంగిక భాగస్వాములు, ఆమెకూ ఇద్దరు.. ఈ ముగ్గురూ కలిసే ఉంటారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














