మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్

హర్నాజ్ సంధు

ఫొటో సోర్స్, Getty Images

మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత యువతి హర్నాజ్ సంధు కైవసం చేసుకున్నారు.

ఇజ్రాయెల్‌లోని ఇల్లియాట్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో హర్నాజ్ విజేతగా నిలిచారు.

మాజీ మిస్ యూనివర్స్ ఆండ్రియా మెజా (మెక్సికో), హర్నాజ్‌కు కిరీటాన్ని అలంకరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

2000వ సంవత్సరంలో భారత్ నుంచి లారాదత్తా 'మిస్ యూనివర్స్'గా ఎంపికయ్యారు.

21 ఏళ్ల తర్వాత ఆ టైటిల్‌ను పంజాబ్ యువతి హర్నాజ్ సంధు గెలుచుకున్నారు.

ఈ టైటిల్‌ను గెలుచుకున్న అనంతరం హర్నాజ్ ఉద్వేగానికి లోనయ్యారు.

''నాకు మార్గదర్శకంగా, మద్దతుగా నిలిచిన నా తల్లిదండ్రులకు, దేవుడికి, మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు నేను కృతజ్ఞురాలిగా ఉంటా. నా కోసం ప్రార్థించిన వారందరికీ నా ప్రేమపూర్వక ధన్యవాదాలు. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రతిష్టాత్మక 'మిస్ యూనివర్స్' కిరీటాన్ని భారత్‌కు తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది'' అని హర్నాజ్ అన్నారు.

హర్నాజ్ సంధు

ఫొటో సోర్స్, Reuters

హర్నాజ్ గురించి...

పంజాబ్‌కు చెందిన హర్నాజ్ మోడలింగ్‌తో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేస్తున్నారు.

17 ఏళ్ల వయస్సు నుంచే ఆమె అందాల పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె 'మిస్ దివా- 2021' టైటిల్‌ను గెలుచుకున్నారు.

2019లో 'ఫెమీనా మిస్ ఇండియా పంజాబ్' టైటిల్‌ను అందుకున్నారు. ఆ ఏడాది మిస్ ఇండియా పోటీల్లో టాప్-12లో చోటు దక్కించుకున్నారు.

అందాల పోటీల్లో పాల్గొనడమే కాకుండా, ఆమె ఇప్పటివరకు రెండు పంజాబీ చిత్రాల్లో నటించారు.

వీడియో క్యాప్షన్, 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం

చివరి రౌండ్‌లో అడిగిన ప్రశ్నకు హర్నాజ్ సమాధానమేంటి?

తుది రౌండ్‌లో హర్నాజ్ సింగ్‌తో పాటు పరాగ్వేకు చెందిన నదియా ఫెరీరియా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా మస్వానే టాప్-3లో నిలిచారు.

ఈ రోజుల్లో నెలకొన్న ఒత్తిడిని ఎదుర్కోవడానికి నేటి తరం అమ్మాయిలకు ఎలాంటి సలహా ఇస్తారు? అని నిర్వాహకులు టాప్-3 పోటీదారులను అడిగారు.

దానికి సమాధానంగా హర్నాజ్ ''తమపై తమకు నమ్మకం లేకపోవడమే ఈ తరం యువత ఎదుర్కొంటోన్న అతిపెద్ద ఒత్తిడి. మనం అందరికన్నా భిన్నమైన వ్యక్తులమని గ్రహించడం మనల్ని మరింత అందంగా మార్చుతుంది. మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం ఆపేయాలి. ప్రపంచంలో జరుగుతోన్న ముఖ్యమైన సంఘటనల గురించి మాట్లాడండి. మీ జీవితానికి మీరే నాయకులు కాబట్టి మీ గురించి మీరే మాట్లాడండి. మీ సమస్యల గురించి గొంతెత్తండి. నన్ను నేను నమ్మాను. అందుకే ఈరోజు ఇక్కడ నిలబడ్డాను'' అని ఆమె సమాధానమిచ్చారు.

వీడియో క్యాప్షన్, మిస్ యూనివర్స్: హర్నాజ్ సంధును గెలింపించిన జవాబు ఇదే..

ఆ సమాధానం ఆమెను విజేతగా నిలిపింది.

అంతకుముందు టాప్-5 రౌండ్‌లో వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రశ్నను నిర్వాహకులు అడిగారు.

చాలా మంది ప్రజలు, వాతావరణ మార్పులు ఒక బూటకం అని నమ్ముతారు. ఈ అంశంలో వారిని ఏ విధంగా ఒప్పిస్తారు? అని అడిగారు.

''ప్రకృతికి వాటిల్లుతున్న నష్టాన్ని చూసినప్పుడు నా హృదయం తరుక్కుపోతుంది. ఇదంతా మన నిర్లక్ష్యపూరిత వైఖరి వల్లే సంభవిస్తోంది. మన ముందున్న సమయం చాలా తక్కువ. ప్రకృతిని కాపాడటానికి చేయాల్సిన పనులు చాలా ఎక్కువగా ఉన్నాయని నేను నమ్ముతున్నా. మన ప్రతీ చర్య ప్రకృతిని కాపాడొచ్చు లేదా వినాశనానికి గురిచేయొచ్చు. బాధ పడటం, మరమ్మతు చేయడం కంటే ప్రమాదాన్ని నివారించడం, రక్షించడం ఉత్తమం. మిత్రులారా... ఈరోజు నేను దీని గురించి మిమ్మల్ని ఒప్పించాలనుకుంటున్నాను, ఇందుకోసం నేను ప్రయత్నిస్తున్నా'' అని ఆమె సమాధానం చెప్పారు.

హర్నాజ్ సంధు

ఫొటో సోర్స్, Getty Images

హర్నాజ్ కంటే ముందు కేవలం ఇద్దరు భారతీయులు మాత్రమే 'మిస్ యూనివర్స్' కిరీటాన్ని అందుకున్నారు. 1994లో తొలుత సుస్మితాసేన్ ఈ టైటిల్‌ను గెలుచుకోగా, 2000లో లారా దత్తాకు ఈ అందాల కిరీటం లభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)