మీ పిల్లల ఆధార్‌ అప్‌డేట్ చేశారా? చేయకపోతే డీయాక్టివేట్ కావొచ్చు

aadhar

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కమలాదేవి నల్లపనేని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అయిదేళ్లు దాటి 15ఏళ్ల లోపు వయసున్న పిల్లలున్న తల్లిదండ్రులకు ఇటీవల భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)నుంచి ఓ మెసేజ్ వచ్చింది.

మీ పిల్లల ఆధార్‌కు బయోమెట్రిక్ డేటా అప్‌డేట్ చేయాలన్నది దాని సారాంశం.

దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లోనూ మొబైల్ నంబర్లకు బయోమెట్రిక్ అప్‌డేట్ గురించి ఎస్ఎంఎస్ సందేశాలు పంపుతున్నట్టు యూఐడీఏఐ తెలిపింది.

అసలు ఈ మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ అంటే ఏంటి? ఏ వయసున్న పిల్లల ఆధార్‌ కార్డులు అప్‌డేట్ చేయాలి?

అలా చేసేందుకు ఏమేం డాక్యుమెంట్లు సమర్పించాలి?

అప్‌డేట్ చేసేందుకు గడువు ఎప్పటి వరకు ఉంది?

అసలు అప్‌డేట్ చేయకపోతే ఏమవుతుంది?

ఒకవేళ పిల్లల ఆధార్ డీయాక్టివేట్ అయితే ఏం చేయాలి? యూఐడీఏఐ నిబంధనలు ఏం చెప్తున్నాయి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

ఐదేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే.. వారికి ఐదేళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా రీ రిజిస్ట్రేషన్ చేయించాలి.

దీన్ని మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్(ఎంబీయూ)అని పిలుస్తున్నారు.

ఇది ఫస్ట్ బయోమెట్రిక్ అప్‌డేట్. ఈ అప్‌డేట్ సమయంలో పూర్తి బయో డేటా సమర్పించాలి.

ఈ సమయంలో పిల్లలకు సంబంధించి అందించే వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. ఓ రకంగా ఇది కొత్త రిజిస్ట్రేషన్ లాంటిదే. కానీ పిల్లల ఆధార్ నంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదు.

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరని యూఐడీఏఐ చెప్తోంది. ఆధార్ రెగ్యులేషన్స్, 2016లో ఈ విషయం తెలిపింది.

aadhar

ఫొటో సోర్స్, aadhar/facebook

ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకిచ్చే ఆధార్ కార్డును బాల ఆధార్ అంటారు.

ఆ ఆధార్‌లో చిన్నారుల ఫోటో, పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వివరాలు మాత్రమే ఉంటాయి.

బాల ఆధార్ జారీ సమయంలో పిల్లల వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలు సేకరించరు.

bala aadhar

ఫొటో సోర్స్, aadhar/facebook

ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరని, పిల్లల ఆధార్ డీయాక్టివేషన్ కాకుండా ఉండడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‌డేట్ చేసుకోవాలని తాను పంపిస్తున్న మెసేజ్‌‌లలో యూఐడీఏఐ సూచించింది.

ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

ఫొటో సోర్స్, uidai.gov.in

ఫొటో క్యాప్షన్, ఏడేళ్లలోపు పిల్లల ఆధార్ ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

మనముండే ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్‌ లేదా ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయకపోతే వారి ఆధార్ నెంబరు డీయాక్టివేట్ అవుతుంది.

అయిదేళ్లు దాటిన చిన్నారుల ఆధార్ అప్‌డేట్ రెండేళ్లలోపు చేయాలి.

అంటే వారికి ఏడేళ్లు నిండేలోపు ఇది పూర్తిచేయాలి.

లేదంటే ఆధార్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం ఆ చిన్నారి ఆధార్ నంబర్ డీయాక్టివేట్ అవుతుంది.

అయితే 2016లో ఇలాంటి నిబంధన ఉన్నప్పటికీ ఏడేళ్లు నిండిన తర్వాత కూడా బయోమెట్రిక్ అప్‌డేట్ జరగని చిన్నారుల ఆధార్‌ను యూఐడీఏఐ డీ యాక్టివేట్ చేయలేదు.

అయితే డీయాక్టివేషన్‌ను నివారించడానికి వీలుగా సమీప ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‌డేట్ చేసుకోవాలని కోరుతూ తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు మెసేజ్‌లు పంపింది.

అయిదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ తీసుకునేటప్పుడు రిజిస్టర్ చేసిన తల్లి, తండ్రి లేదా గార్డియన్ మొబైల్ నంబర్‌కు ఈ మెసేజ్‌లు పంపింది.

ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏడేళ్లు దాటిన పిల్లల ఆధార్ అప్‌డేట్ కోసం రూ.100 చెల్లించాలి
ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

ఏడేళ్లలోపు చిన్నారుల ఆధార్ అప్‌డేట్ ఉచితంగా చేసుకోవచ్చని, ఆ తర్వాత వయసున్నపిల్లల ఆధార్ అప్‌డేట్ చేయాలంటే అప్పటి పరిస్థితులను బట్టి రుసుమును నిర్ణయిస్తుందని, ఆధార్ రెగ్యులేషన్స్‌లో తెలిపింది.

తాజాగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్‌లో ఏడేళ్లు దాటిన పిల్లల ఆధార్ అప్‌డేట్ చేయడానికి వంద రూపాయలు ధర నిర్ణయించింది.

ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

ఆధార్ నియమాల ప్రకారం బయోమెట్రిక్ అప్‌డేట్ చేయకపోయినప్పటికీ దాన్ని తొలగించకూడదు.

డీయాక్టివేట్ మాత్రమే అవుతుంది. బయెమెట్రిక్ అప్‌డేట్ అయిన తర్వాత తిరిగి యాక్టివేట్ అవుతుంది.

ఆధార్ పోర్టల్‌లో నంబరు కొట్టి పిల్లల ఆధార్ యాక్టివేట్‌గా ఉందా, డీయాక్టివేట్‌ అయిందా అన్నది తెలుసుకోవచ్చు.

ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

పిల్లలకు తొలిసారి ఆధార్ తీసుకుంటున్నప్పుడు బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు అవసరమవుతుంది.

ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ తీసుకునేటప్పుడు వారిని ఆధార్ సెంటర్లకు తీసుకురావాల్సిన పనిలేదు. కానీ బయోమెట్రిక్ అప్పుడు పిల్లలు తప్పనిసరిగా ఉండాలి.

వారి వేలిముద్రలు, ఐరిస్, ఫొటోతో అప్‌డేట్ చేసుకోవాలి.

ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయి.
ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

స్కూల్ అడ్మిషన్లు, ప్రవేశపరీక్షలకు దరఖాస్తు, స్కాలర్‌షిప్పులు, డీబీటీ పథకాల సేవలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి.

అందుకే నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.

ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్, చిన్నారులు

పిల్లల ఆధార్‌ను ఐదేళ్ల వయసు తర్వాత ఓసారి అప్‌డేట్ చేసినట్టే 15 ఏళ్ల వయసు తర్వాత మరోసారి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

15 నుంచి 17ఏళ్ల లోపువారు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

వేలిముద్రలు, ఐరిస్, ఫోటోను 15 ఏళ్ల తర్వాత మరోసారి అప్‌డేట్ చేసుకోవాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)