ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, ఫైనల్లో భారత్ ఓటమి

పాట్ కమిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది.

ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

ఆరంభంలో త్వరగానే వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు, తర్వాత మ్యాచ్‌పై పట్టును నిలుపుకోలేకపోయారు.

దీంతో ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసి గెలిచింది.

ట్రావిస్ హెడ్ 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మార్నస్ లబ్‌షేన్ (110 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు.

మ్యాక్స్‌వెల్ (2) విన్నింగ్ షాట్ కొట్టాడు.

భారత బౌలర్లలో బుమ్రా 2, షమీ 1, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు భారత్ 50 ఓవర్లలో 240 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66) పరుగులు చేశారు.

టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

వీడియో క్యాప్షన్, మ్యాచ్ తర్వాత గ్రౌండ్ బయట పరిస్థితి ఎలా ఉంది?

ట్రావిస్ హెడ్ అర్ధసెంచరీ, 25 ఓవర్లకు ఆస్ట్రేలియా: 135/3

20:04 ( IST)

ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అర్ధసెంచరీ చేశాడు.

అతను 58 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 50 పరుగులు చేశాడు.

బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

స్మిత్ అవుట్

19:02 (IST)

బుమ్రా మరో వికెట్‌ పడగొట్టాడు.

ఈసారి బుమ్రా బంతికి వికెట్ల ముందు స్టీవ్ స్మిత్ (4) దొరికిపోయాడు.

దీంతో ఆస్ట్రేలియా 47 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.

మిచెల్ మార్ష్ వికెట్ తీసిన బుమ్రా

18:50 (IST)

ఆస్ట్రేలియా అయిదు ఓవర్లలోపే రెండు వికెట్లను కోల్పోయింది.

జట్టు స్కోరు 41 వద్ద మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడు. మార్ష్ 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ సహాయంతో 15 పరుగులు చేశాడు. ఈ వికెట్ బుమ్రాకు దక్కింది.

షమీ

ఫొటో సోర్స్, Getty Images

18: 20 (IST)

241 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.

ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టులో టాప్ స్కోరర్ అయిన వార్నర్ అవుట్ అయ్యాడు.

తాను వేసిన రెండో బంతికే షమీ, వార్నర్ (7)ను పెవిలియన్ పంపాడు.

షమీ

ఫొటో సోర్స్, Getty Images

రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

18:02 (IST)

ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది.

చివర్లో కుల్దీప్ యాదవ్ 18 బంతుల్లో 10 పరుగులు, మొహమ్మద్ సిరాజ్ 8 బంతుల్లో ఒక ఫోర్‌తో అజేయంగా 9 పరుగులు చేశాడు.

భారత్ ఇన్నింగ్స్‌లో 12 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో లభించాయి.

ప్రత్యర్థి బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. జోష్ హాజెల్‌వుడ్, పాట్ కమిన్స్ చెరో 2 వికెట్లు, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలా ఓ వికెట్ తీశారు.

ఫైనల్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

17:45 (IST)

భారత్ 9వ వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 18 పరుగులు చేసి 47.3 ఓవర్ల దగ్గర అవుట్ అయ్యారు.

షమీ

ఫొటో సోర్స్, Getty Images

45 ఓవర్లకు భారత్ స్కోరు 215/8.

17:33 (IST)

రాహుల్ తర్వాత క్రీజులోకి వచ్చిన షమీ (6), బుమ్రా (1) అవుటయ్యారు.

షమీ ఒక ఫోర్ కొట్టాడు.

క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 14; 1 ఫోర్) ఉన్నాడు.

రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

17:10 (IST)

మిచెల్ స్టార్క్ అద్భుత బంతితో క్రీజులో కుదురుకున్న కేఎల్ రాహుల్‌ను అవుట్ చేశాడు.

స్టార్క్ వేసిన బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ ఇంగ్లిస్ చేతుల్లో పడింది.

దీంతో రాహుల్ ఇన్నింగ్స్ ముగిసింది.

రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులు చేశాడు. కేవలం ఒక ఫోర్ బాదాడు. దీంతో 203 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది.

కేఎల్ రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

అయిదో వికెట్ కోల్పోయిన భారత్, జడేజా అవుట్

16:40 (IST)

భారత్ మరో వికెట్ కోల్పోయింది. హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు.

జడేజా 22 బంతుల్లో 9 పరుగులు చేశాడు.

178 పరుగుల వద్ద భారత్ 5వ వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.

కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ

16:37 (IST)

క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ చేశాడు.

86 బంతుల్లో అతను 50 పరుగులు పూర్తిచేశాడు. తన ఇన్నింగ్స్‌లో ఎక్కువగా సింగిల్స్‌కు ప్రాధాన్యమిచ్చిన రాహుల్ ఒకే ఒక ఫోర్ కొట్టాడు.

30 ఓవర్లలో భారత్ స్కోర్ 152/4

16:20 (IST)

30 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 152/4.

క్రీజులో కేఎల్ రాహుల్ (71 బంతుల్లో 39), రవీంద్ర జడేజా (5 బంతుల్లో 1) ఉన్నారు.

వరల్డ్ కప్ స్కోర్
కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

వరల్డ్ కప్ ఫైనల్: కోహ్లీ అవుట్

16:10 (IST)

ఈ సీజన్ వరల్డ్ కప్‌లో తొమ్మిదిసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసిన కోహ్లీ అనూహ్యంగా అవుటయ్యాడు.

కమిన్స్ బౌలింగ్‌లో కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 148 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో 56 బంతుల్లో 4 ఫోర్లతో కోహ్లీ అర్ధసెంచరీ చేశాడు.

కోహ్లీ కెరీర్‌లో ఓవరాల్‌గా ఇది 72వ అర్ధసెంచరీ.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

చివరగా 10వ ఓవర్లో బౌండరీ కొట్టిన భారత్

20 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 115/3. క్రీజులో విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 39; 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (37 బంతుల్లో 19) ఉన్నారు.

భారత్ చివరగా 10వ ఓవర్ ఆఖరు బంతికి బౌండరీ సాధించింది.

మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో శ్రేయర్ అయ్యర్ ఫోర్ కొట్టిన తర్వాత మరో 10 ఓవర్లు బౌండరీ లేకుండానే భారత్ ఇన్నింగ్స్ నడిచింది.

నిలకడగా భారత్ బ్యాటింగ్

15:35 (IST)

భారత బ్యాటర్లు కోహ్లీ (42 బంతుల్లో 39 పరుగులు), కేఎల్ రాహుల్ (37 బంతుల్లో 19 పరుగులు)‌లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.

20 ఓవర్లలో భారత్ స్కోరు 115/3.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్స్ స్కోరు
ఫొటో క్యాప్షన్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్స్ స్కోరు

16 ఓవర్లకు భారత్ స్కోరు 101/3

15:15 (IST)

మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ బ్యాటర్లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు.

క్రీజులో విరాట్ కోహ్లీ (33 బంతుల్లో 34 పరుగులు), కేఎల్ రాహుల్ (22 బంతుల్లో 10 పరుగులు) ఉన్నారు.

ఇదే టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పుడు కోహ్లీ, రాహుల్ జోడీ జట్టును ఆదుకుంది.

కోహ్లీ 85 పరుగులు, రాహుల్ అజేయంగా 97 పరుగులు చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఔట్

గిల్, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

14:50 (IST)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్సర్లు) 47 పరుగులు చేసి, ఔటయ్యాడు. మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌కు క్యాచ్ ఇచ్చాడు రోహిత్.

అనంతరం వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా వెంటనే ఔటయ్యాడు. 3 బంతుల్లో 4 పరుగులు చేసిన అయ్యర్, కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

క్రీజులో విరాట్ కోహ్లీ (24), కేఎల్ రాహుల్ ఆడుతున్నారు.

ప్రస్తుత భారత్ స్కోరు 10.2 ఓవర్లలో 81 పరుగులు.

శుభ్‌మన్ గిల్ ఔట్

14:22 (IST)

బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, నాలుగో ఓవర్లనే తొలి వికెట్ కోల్పోయింది.

శుభ్‌మాన్ గిల్ 7 బంతుల్లో 4 పరుగులు చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు.

రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)