హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యలు.. క్షమాపణలు చెబుతూ వీడియో

దండోరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతున్న సినీనటుడు శివాజీ

ఫొటో సోర్స్, ScreenGrab

    • రచయిత, అల్లు సూరిబాబు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా నటుడు శివాజీ సినిమా హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

శివాజీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కార్యక్రమంలో యాంకర్ డ్రెస్ సెన్స్ బాగుందంటూ కితాబు ఇచ్చిన ఆయన, తర్వాత తన ప్రసంగం ముగింపులో హీరోయిన్ల వస్త్రధారణపై మాట్లాడారు.

అందులో రెండుచోట్ల అభ్యంతరకరమైన పదాలు వాడటంపై సినిమా రంగానికి చెందినవారే కాకుండా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి.

మహిళలకు బేషరతుగా శివాజీ క్షమాపణలు చెప్పాలని డిమాండు చేస్తున్నారు.

సినీరంగానికే చెందిన నందిని రెడ్డి, సుప్రియ యార్లగడ్డ, మంచు లక్ష్మీప్రసన్న, స్వప్న దత్, ఝాన్సీలు శివాజీ వ్యాఖ్యలపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు లేఖ రాశారు.

‘వాయిస్ ఆఫ్ ద ఉమెన్’ పేరిట వారు రాసిన లేఖలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్న 100 మందికి పైగా మహిళల తరఫున తాము ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు, శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది.

ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరుకాావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది.

మరోవైపు శివాజీకి మద్దతుగానూ కొందరు నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో శివాజీ మంగళవారం సాయంత్రం స్పందించారు.

మహిళలకు క్షమాపణలు చెబుతూ ‘ఎక్స్’ వేదికగా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

కొంతమంది హీరోయిన్ల వస్త్రధారణకు సంబంధించి నాలుగు మంచి మాటలు చెప్పే ప్రయత్నంలో రెండు అన్‌పార్లమెంటరీ పదాలు దొర్లాయని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సినీనటుడు శివాజీ

ఫొటో సోర్స్, ScreenGrab

శివాజీ ఏమన్నారంటే...

సినిమా ఈవెంట్‌లో నటుడు శివాజీ తన ప్రసంగంలో భాగంగా, హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేశారు.

''అమ్మాయిలు హీరోయిన్‌లు, ఏ దుస్తులు పడితే అవి వేసుకొనిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా. ఏమీ అనుకోవద్దు హీరోయిన్లు అందరూ. మీరనుకున్నా నాకు పోయేదేమీ లేదు. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే... **** కనపడేదాంట్లో ఏమీ ఉండదు ’ అంటూ అనుచిత పదాలు ఉపయోగించారు.

(శివాజీ ఉపయోగించిన పదాలను ‘బీబీసీ తెలుగు’ ఇక్కడ రాయడం లేదు)

''స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ, మా అమ్మ, చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనబడుతూ ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, అలాగే సౌందర్య కానీ. ఈ జనరేషన్‌లో రష్మిక, ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీరంతా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి వెంటనే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. దానికి ఒక హద్దు ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు. ప్రపంచ వేదికల మీద అయినాసరే చీర కట్టుకున్నవాళ్లకే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయి'' అని అన్నారు.

Chinmayi tweet on Sivaji comments

ఫొటో సోర్స్, X.com/ChinmayiSripada

‘ఆయన ధోవతీ ఎందుకు కట్టుకోలేదు’: సింగర్ చిన్మయి

శివాజీ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి తీవ్రంగా స్పందించారు. శివాజీ స్పీచ్ తాలూకా వీడియో క్లిప్పింగ్‌ జోడిస్తూ, తన అభ్యంతరమేమిటో 'ఎక్స్'లో పోస్టు చేశారు.

''తెలుగు నటుడు శివాజీ బూతు పదాలను ఉపయోగిస్తూ హీరోయిన్లకు అనవసరమైన సలహా ఇచ్చారు. కవర్ చేసుకోవడానికి శారీస్ ధరించాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు'' అని రాశారు.

(చిన్మయి తన ట్వీట్‌లో శివాజీ వాడిన పదాలను మళ్లీ వాడడంతో ఆమె వ్యాఖ్యల్లోనూ వాటిని ‘బీబీసీ తెలుగు’ తొలగించి రాసింది)

''అలాంటి పదాల్ని ఎక్కువగా పోకిరీలు ఉపయోగిస్తారు. ఆయన ఓ అద్భుతమైన సినిమాలో విలన్‌గా నటించారు. అలా పోకిరీలకు హీరో అయిపోయారు. ఇక్కడ అభ్యంతరమేమింటంటే, పబ్లిక్‌గా ఇలాంటి పదాలు వాడటం. ఆయనేమో జీన్స్, హూడీ వేసుకున్నారు. మరి ఆయన చెప్పినదాన్నిబట్టి చూస్తే ధోవతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలిగా. ఒకవేళ ఆయనకు పెళ్లయి ఉంటే బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి. అసలు మహిళలని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది'' అని చిన్మయి రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా స్పందిస్తూ, ''ఆ మనిషి పూర్తి పేరు నాకు తెలియదు. అందుకే ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. శివాజీ, నీవు ఎవరైనా కానీ, నీలాంటి అసభ్యకరమైన, నీచమైన వ్యక్తిని మీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తుంటే, వెళ్లి వాళ్లకు నీ నీతిసూత్రాలు చెప్పు. అంతేకానీ, ఈ సమాజంలో ఉన్న ఇతర మహిళల మీద గానీ, సినిమా పరిశ్రమలో ఉన్నవారి మీద కానీ వద్దు. నీ అభిప్రాయాలు నీ దగ్గరే ఉంచుకో, అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచు...'' అని 'ఎక్స్'లో పోస్టు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

శివాజీ పేరు నేరుగా ప్రస్తావించకుండా మరికొంతమంది సినిమా ప్రముఖులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు.

నటుడు మంచు మనోజ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

''ఒక నాగరిక సమాజం మహిళల హక్కులను కాపాడుతుంది, అంతేకాని వారి ఇష్టాయిష్టాలను శాసించదు'' అంటూ 'ఎక్స్'లో ఒక లేఖను పోస్టు చేశారు.

శివాజీ పేరు ప్రస్తావించకుండా, ఆయన తరఫున మహిళలకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

మరోవైపు శివాజీ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు అదే వేదికపై ఉన్న నటుడు నవదీప్ కూడా దీనిపై స్పందించారు.

''నిన్న స్టేజీ మీద మాట్లాడిన మాటలు చాలా అసభ్యంగా ఉన్నాయి. అక్కడ వాడిన పదజాలంతో, వ్యక్తపరిచిన అభిప్రాయంతో నేను ఏమాత్రం ఏకీభవించడం లేదు'' అని 'ఎక్స్'లో పోస్టు చేశారు.

అయితే, ఆయన కూడా సందర్భాన్ని, శివాజీ పేరును ప్రస్తావించకుండానే ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.

Anasuya

ఫొటో సోర్స్, facebook/AnasuyaBharadwaj

ప్రముఖ యాంకర్, నటి అనసూయ శివాజీ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ 'ఇది మా శరీరం. మీది కాదు' అంటూ 'ఫేస్‌బుక్'లో పోస్టు పెట్టారు.

మరోవైపు, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడికి నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీ లక్ష్మి లేఖ రాశారు.

లేదంటే శివాజీపై న్యాయపోరాటం చేస్తామని వారు తమ లేఖలో స్పష్టం చేశారు.

మరోపక్క శివాజీ వ్యాఖ్యలకు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

రజిత గవ్వల అనే యూజర్ తాను శివాజీని సమర్థిస్తున్నట్లు చెప్పారు.

శివాజీ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని, అయితే ఆయన ఉపయోగించిన మాటలు సరిగ్గా లేవని హేమ వనపల్లి అనే మరో యూజర్ కామెంట్ చేశారు.

నటుడు శివాజీ

ఫొటో సోర్స్, ScreenGrab

శివాజీ క్షమాపణలు...

‘‘హీరోయిన్లు ఈ మధ్యకాలంలో ఇబ్బందిపడ్డ నేపథ్యంలో దండోరా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాలుగు మంచి మాటలు చెబుతూనే, రెండు అన్‌పార్లమెంటరీ పదాలను నేను వాడాల్సి వచ్చింది. కచ్చితంగా ఎవ్వరికైనా వారి మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందర్నీ ఉద్దేశించి కాదు, హీరోయిన్లు బయటకు వెళ్లినప్పుడు బట్టలు సరిగా ఉంటే ఇబ్బంది ఉండదమ్మా అని చెప్పే ఉద్దేశం తప్ప, ఎవ్వర్నీ కించపరచాలని కాదు. ఏమైనాప్పటికీ, క్షమాపణలు చెబుతున్నాను’’ అని పేర్కొంటూ శివాజీ ‘ఎక్స్’ లో వీడియో పోస్టు చేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)