అవతార్ -3: మొదటి రెండు పార్ట్‌లను మరిపించిందా? ఈ ‘విజువల్ వండర్’ ఎలా ఉంది?

ఫొటో సోర్స్, X/officialavatar
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
అవతార్ గురించి, దర్శకుడు జేమ్స్ కామెరాన్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఇప్పుడు అవతార్ -3 ఫైర్ అండ్ యాష్ వచ్చింది.
ఇదొక విజువల్ వండర్ అయితే, మొదటి రెండు భాగాల్ని మరిపించిందా? లేదా? చూద్దాం.
కథ ఏమంటే పార్ట్-2 ముగిసిన చోట నుంచే పార్ట్ -3 ప్రారంభం అవుతుంది. హీరో జేక్ మీద కల్నల్ పగ తీర్చుకోవాలని అనుకుంటాడు.
తెగలన్నింటినీ హీరో కలుపుతాడు. అయితే, అగ్ని తెగ వీరికి వ్యతిరేకంగా వుంటుంది. యాంత్రిక శక్తులకి, ప్రకృతి శక్తులకి మధ్య జరిగే యుద్ధంలో గెలుపు ఎవరిది?
సింఫుల్‌గా ఇంతే. కానీ, కళ్ల ముందు వేరే ప్రపంచం ఉంటుంది.
ఆ విషయంలో దర్శకుడు సూపర్ సక్సెస్. అయితే, నిడివి 3.17 గంటలు చాలా కష్టంగా ఉంటుంది.
సంఘటనలు కొత్తవి జరగకపోగా, అవే రిపీట్ అవుతుంటాయి. దాంతో ఆల్రెడీ చూసేసిన సినిమాలా అనిపిస్తుంది.

అగ్ని తెగ అనే కొత్త పాయింట్ తీసుకున్నా, దాని మీద కథ నడవదు. రొటీన్‌గానే వెళుతుంది.
పండోరాలో నివసించే స్పైడర్‌ని వెనక్కి పంపాలని హీరో అనుకుంటాడు.
ఎందుకంటే స్పైడర్ భూమికి సంబంధించిన మనిషి. కథ ఇక్కడ టేకాఫ్ తీసుకోవడం బాగుంది.
అతన్ని రక్షించడానికి జరిగే యాక్షన్ సన్నివేశాలు థ్రిల్ కలిగిస్తాయి.
కథా కథనం వేగం లేకుండా నెమ్మదించడంతో ప్రేక్షకుల ముందు ఎన్ని అద్భుత దృశ్యాలున్నా, ఫోన్ చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు.
ఎమోషనల్ డెప్త్ మిస్ కావడం ప్రధాన లోపం. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఎంజాయ్ చేస్తారు.
పాయక్‌నా అనే తిమింగలాల గుంపు హీరోకి సాయం చేయడం , చివర్లో సొర చేపలు విలన్లపై యుద్ధం ప్రకటించడం థ్రిల్లింగ్‌గా వున్నాయి.

ఫొటో సోర్స్, X/officialavatar
మనుషులు దురాశతో, తెలివితేటలతో గ్రహాలు దాటి అక్కడున్న అమాయక ప్రజల్ని ఊచకోత కోస్తారు.
ఇది మితిమీరితే ప్రకృతే వాళ్ల మీద పగబడుతుంది.
ఈ తాత్వికతతో ప్రారంభమైన అవతార్ సిరీస్ ప్రేక్షకుల్ని మరో లోకానికి తీసుకెళ్లాయి.
అయితే, పార్ట్ -3లో కూడా కథ కొంచెం కూడా మారకుండా మూస పద్ధతిలో సాగడం మైనస్‌గా మారింది.
పెద్దగా ఆశించకుండా దృశ్య ప్రపంచాన్ని మాత్రమే చూడాలనుకుంటే ఒకసారి ఓకే. త్రీడీలో చూడడం బెస్ట్.

ఫొటో సోర్స్, X/officialavatar
ప్లస్ పాయింట్:
1.సెకెండాఫ్
2.కెమెరా, సంగీతం
3.సముద్ర జీవుల యుద్ధం
మైనస్ పాయింట్:
1.ఫస్టాఫ్
2.నిడివి
3.పాత కథనే మళ్లీ చెప్పడం
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














