ఆస్కార్ 2024: ఉత్తమ డైరెక్టర్‌గా క్రిస్టోఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా కిలియన్ మర్ఫీ, ఉత్తమ చిత్రంగా ఒపెన్‌హైమర్

కిలియన్ మర్ఫీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఉత్తమ నటుడిగా ఒపెన్‌హైమర్ నటుడు కిలియన్ మర్ఫీకి ఆస్కార్ అవార్డు

ఆస్కార్- 2024 అవార్డులలో ఒపెన్‌హైమర్‌కు అవార్డుల పంట పండింది.

లాస్ ఏంజెలిస్‌లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ చిత్రంగా ఒపెన్‌హైమర్ ఎంపికైంది.

ఉత్తమ నటుడిగా కిలియన్ మర్ఫీ(ఒపెన్‌హైమర్) ఆస్కార్ అవార్డును దక్కించుకున్నారు.

ఆయనకు వచ్చిన తొలి ఆస్కార్ ఇది.

క్రిస్టోఫర్ నోలన్

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తమ డైరెక్టర్ కేటగిరీలో ఒపెన్‌హైమర్‌ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అవార్డు దక్కించుకున్నారు.

ఆయనకూ ఇది తొలి ఆస్కార్ అవార్డు. 2018లో ఆయన ఆస్కార్‌కు ఉత్తమ దర్శకుడి కేటగిరీలో నామినేట్ అయ్యారు.

 ఉత్తమ చిత్రంగా ఒపెన్‌హైమ‌ర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తమ చిత్రంగా ఒపెన్‌హైమ‌ర్‌కు ఆస్కార్ అవార్డు

2023లో విడుదలైన క్రిస్టోఫ‌ర్ నోల‌న్ చిత్రం 'ఒపెన్‌హైమ‌ర్' ఈ అవార్డుల సీజన్‌లో ఎక్కువ పురస్కారాలు గెలుచుకుంది.

13 విభాగాలలో నామినేట్ అయిన ఈ చిత్రం 7 అవార్డులను దక్కించుకుంది.

ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఉత్తమ సహాయ నటుడు కేటగిరీల్లో ఒపెన్‌హైమర్ ఆస్కార్ అవార్డులను పొందింది.

ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్

ఆస్కార్ అవార్డు విజేతలు వీరే

లాస్ ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్ వద్ద యునైటెడ్ స్టేట్స్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ఈ వేడుక జరిగింది.

ఎప్పటి కంటే గంట ముందే ఈ వేడుక ప్రారంభమైంది. కమెడియన్ జిమ్మీ కిమ్మెల్ ఈ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు.

విజేతలు ఎవరంటే..

ఉత్తమ చిత్రం: ఒపెన్‌హైమర్

ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ - ఒపెన్‌హైమర్ చిత్రం

ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ - ఒపెన్‌హైమర్ చిత్రం

ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ - ఒపెన్‌హైమర్ చిత్రం

ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ - పూర్ థింగ్స్

ఉత్తమ సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ - ది హోల్డోవర్స్

ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఒపెన్‌హైమర్

బెస్ట్ మ్యూజిక్(ఒరిజినల్ స్కోర్): లుడ్‌వింగ్ జోరాంసన్ - ఒపెన్‌హైమర్

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఒపెన్‌హైమర్ - జెనీఫర్ లేమ్

ఒపెన్‌హైమర్

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్, జాష్ వెస్టన్ - పూర్ థింగ్స్

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్ - అమెరికన్ ఫిక్షన్

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిస్ ట్రైట్, అర్థర్ హరారీ - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్

బెస్ట్ కాస్టూమ్ డిజైన్: హోలి వెడ్డింగ్‌టన్ - పూర్ థింగ్స్

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రైస్, షోనా హెత్ - పూర్ థింగ్స్

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

రాబర్ట్ డౌనీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఒపెన్‌హైమర్ నుంచి ఉత్తమ సహాయ నటుడు అవార్డును దక్కించుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్

అందరూ అంచనా వేసిన విధంగానే, బెస్ట్ ఎడిటింగ్ కేటగిరీలో ఒపెన్‌హైమర్ ‘జెనీఫర్ లేమ్’కు ఆస్కార్ అవార్డు వచ్చింది.

ఒపెన్‌హైమర్ నుంచి ఉత్తమ సహాయ నటుడు అవార్డును రాబర్ట్ డౌనీ జూనియర్ దక్కించుకున్నారు. ఈ సినిమాలో అటమిక్ ఎనర్జీ కమిషన్‌కు చైర్మన్‌ పాత్ర పోషించారు.

అంతకుముందు రెండుసార్లు ఆయన ఆస్కార్ నామినేషన్లలో నిలిచారు. 2009లో ట్రోపిక్ థండర్(ఉత్తమ సహాయ నటుడు కేటగిరీ), 1993లో చాప్లిన్(టైటిల్ రోల్) సినిమాలకు గాను ఆయన ఆస్కార్‌కు నామినేటెడ్ అయ్యారు.

ఒపెన్‌హైమర్ చిత్రానికి ఆయనకు తొలి ఆస్కార్ అవార్డు దక్కింది.

ఉత్తమ సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అవార్డు పొందిన డేవైన్ జో రాండాల్ఫ్

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)