ఉత్తర కొరియా: కిమ్ వారసత్వాన్ని ఎవరు దక్కించుకుంటారో తెలిసిందన్న సౌత్ కొరియా స్పై ఏజెన్సీ.. ఇంతకీ ఎవరా లీడర్?

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, ANADOLU AGENCY

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్
    • రచయిత, జోయెల్ గ్వింటో
    • హోదా, బీబీసీ న్యూస్

ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్‌ వారసత్వాన్ని కొనసాగించేదెవరో గుర్తించామని దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ తెలిపింది.

ఆయనతోపాటు మిలటరీ పరేడ్, మిసైల్ లాంఛ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్న కుమార్తె ఆయన వారసురాలయ్యే అవకాశాలు ఉన్నాయని దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ తెలిపింది.

కిమ్ తరువాత ఆయన చిన్న కుమార్తె కిమ్ జు యే వారసురాలు కానుందని దక్షిణ కొరియా జాతీయ ఇంటెలిజెన్స్ సర్వీస్ ధ్రువీకరించింది.

అయితే, ఇంకా దీనిపై స్పష్టత రావాల్సి ఉందని, దాదాపుగా ఆమె పేరే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది.

2022లో మొదటిసారిగా కిమ్ జు యే పేరు బయటకు వచ్చింది. ఆమె ప్రజల ముందుకు వచ్చింది.

"ఆమె తొలిసారి ప్రజల మధ్యకు వచ్చినప్పటి నుంచి, ప్రజా కార్యక్రమాలు, కార్యకలాపాల సమగ్ర విశ్లేషణ ఆధారంగా, కిమ్ జు యే వారసురాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి" అని ఎన్ఐఎస్ పేర్కొంది.

"ఇతర సాధ్యాసాధ్యాల గురించి కూడా విశ్లేషణలు జరుపుతున్నాం. ఎందుకంటే కిమ్ జోంగ్ ఉన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆయన వయసు కూడా తక్కువే. ఇంకేమైనా జరగొచ్చు" అని తెలిపింది.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Reuters

కిమ్ జు యే వయసు ఎంత?

కిమ్ జు యే వయసు సుమారు 10 సంవత్సరాలు ఉంటుంది. ఆమె కిమ్ జోంగ్ ఉన్ రెండో కుమార్తె అని చెప్తున్నారు.

గత నెలలో నిర్వహించిన దక్షిణకొరయా మంత్రి కిమ్ యుంగ్ హో కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే చెప్పారు.

"ఉత్తర కొరియాలో నెలకొన్న అంతర్గత సంక్షోభం, క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా ఉత్తర కొరియా నాయకత్వం వారసురాలిని ప్రకటించడానికి ఆరాటపడుతోన్నట్లు కనిపిస్తోంది" అన్నారు.

నవంబర్ 2022లో ఆమెను తొలిసారి పరిచయం చేసినప్పుడు 'ప్రియమైన (బిలవ్‌డ్)' అని వ్యవహరించగా, ఈ మధ్యన 'గౌరవ (రెస్పెక్టెడ్)' అనే విశేషణంతో వ్యవహరిస్తున్నారు.

అత్యున్నత స్థాయికి చెందిన వారికి మాత్రమే 'గౌరవ' అనే విశేషణంతో పిలుస్తారు. కిమ్‌ జోంగ్ ఉన్‌ను 'గౌరవనీయ కామ్రెడ్' అని వ్యవహరిస్తారు. ఈ విశేషణం నాయకుడికి మాత్రమే కేటాయించడింది. కిమ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆయనను 'గౌరవనీయ కామ్రెడ్' అని పిలుస్తున్నారు.

కిమ్స్ వంశస్తుల రక్తసంబంధీకులే ఉత్తర కొరియాను పాలించగలిగే సామర్థ్యం ఉన్నవారని ప్రజలకు చెప్పారు.

కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు నాల్గోవ తరానికి తన వారసత్వపు పాలనను సంక్రమింపజేయాలి.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తండ్రి కిమ్ జోంగ్ ఉన్‌తో కిమ్ జు యే

ఇటీవలే డిసెంబర్‌లో ఉత్తర కొరియా ప్రయోగించిన అత్యాధునిక సాంకేతికతో రూపొంది, సుదూర లక్ష్యాలను చేధించే హ్వాసోంగ్-18 సాలిడ్-ఫ్యుయెల్ ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీబీఎం) లాంఛ్ కార్యక్రమానికి కిమ్ జు యే తన తండ్రితో కలిసి పాల్గొంది. అంతేకాకుండా, నవంబర్‌లో మలిగ్యాంగ్-1 రాకెట్ ప్రయోగ సమయంలోనూ కనిపించింది. రెండు సార్లు ఈ ప్రయోగం విఫలమై, మూడోసారి విజయవంతమైంది. దీని ద్వారా కిమ్ జోంగ్ ఉన్ వైట్‌హౌస్‌ దృశ్యాలను చూడగలరని పాంగ్యాంగ్ వెల్లడించింది.

కిమ్ జు యేను ముందుగానే ప్రజలకు పరిచయం చేయడం ద్వారా ఆమె ప్రజల్లో తనకుంటూ స్థానాన్ని సుస్థిరపరచుకునేలా చూడాలని కిమ్ జోంగ్ ఉన్ ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.

ఒకవేళ అదే గనుక జరిగితే, ఒక్కసారి కూడా మహిళా నాయకత్వానికి నోచుకోని ఉత్తరకొరియాలో కిమ్ జోంగ్ ఉన్ తీసుకున్న నిర్ణయంతో ఆయన పక్షపాత వైఖరికి వ్యతిరేకం అన్న వాదనను అధిగమించినట్లు అవుతుంది.

వివాదాస్పదంగా మారిన మాజీ అమెరికన్ బాస్కెట్‌బాల్ స్టార్ ప్లేయర్ డెన్నిస్ రాడ్‌మాన్ 2013 ఉత్తర కొరియా పర్యటనతో తొలిసారిగా ప్రపంచానికి కిమ్ జు యే గురించి తెలిసింది.

రాడ్‌మాన్ తన ఉత్తర కొరియా పర్యటన వివరాలు వెల్లడించిన సమయంలో, సముద్రపు తీరాన కిమ్ కుటుంబంతో కలిసి సరదాగా గడిపానని, వారి కుమార్తెతో ఆడుకున్నానని చెప్పారు.

తమ కుటుంబ సభ్యుల విషయంలో కిమ్ చాలా గోప్యత పాటిస్తారు. కిమ్ జోంగ్ ఉన్‌ను వివాహం చేసుకున్న రి సోల్ జు వివరాలు చాలాకాలం పాటు రహస్యంగానే ఉంచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)