ఓవర్‌సీస్ హైవే: ‘‘నేనిప్పుడు సంతోషంగా చనిపోతాను, నా కోరిక నెరవేరింది’’

ఫ్లోరిడా కీస్‌ను ప్రధాన భూభాగానికి కలిపిన ఓవర్‌సీస్ హైవే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్లోరిడా కీస్‌ను ప్రధాన భూభాగానికి కలిపిన ఓవర్‌సీస్ హైవే
    • రచయిత, ట్రేసి టియో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహాసముద్రంపై 113 మైళ్లు విస్తరించి ఉన్న ఈ ఇంజనీరింగ్ అద్భుతం మారుమూల ఫ్లోరిడా కీస్‌ను ప్రధాన భూభాగానికి కలిపింది. ఇది ఫ్లోరిడా రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. అదే ‘ఓవర్‌సీస్ హైవే’. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అట్లాంటిక్ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో మధ్యలో జలాల గుండా మైళ్ల దూరం ప్రయాణించినప్పుడు, సీగుల్స్ పెద్దగా అరుస్తూ పట్టరాని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

నీలం-ఆకుపచ్చలో ఉన్న సముద్రంలో ఆకాశం కరిగిపోతున్నట్లు కనిపించించింది. పగడం, సున్నపురాయి ద్వీపాల మధ్యలో కలిసిపోతున్న మణిహారంగా అగుపిస్తుంది.

నేను నా అద్దాలను సరిచేసుకున్నప్పుడు, నా కంటి ముందు నుంచి ఏదో వెళ్లినట్టు అనిపించింది.

అది బాటిల్‌నోస్ డాల్ఫిన్! దీనికి స్నేహితులు కూడా ఉన్నాయి. ఇవి సముద్రంలో చెంగుచెంగున ఎగురుతూ కనిపించాయి. చేపల పడవలు మెల్లగా వస్తున్నాయి.

మియామి నుంచి ఫ్లోరిడా రాష్ట్రంలోని కీవెస్ట్ ద్వీపాలకి ప్రయాణించడం అప్పట్లో అంత తేలికైన విషయం కాదు.

20వ శతాబ్దం ప్రారంభంలో, కేవలం పడవలోనే ఒక రోజంతా ప్రయాణించి అమెరికాకు దక్షిణాదిలో మూలన ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండేది.

ఈ ప్రయాణం కూడా వాతావరణం, సముద్రపు అలల పోటులపైనే ఆధారపడి ఉండేది.

కానీ, ఇంజనీరింగ్ అద్భుతంగా పిలిచే ‘ఓవర్‌సీస్ హైవే’కు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.

ఇది ప్రధాన భూభాగం నుంచి మహాసముద్రంపైనే 113 మైళ్లు విస్తరించి ఉంది. 44 ఉష్ణమండల ద్వీపాల గుండా 42 వంతెనలతో ఈ హైవేను నిర్మించారు.

ఉత్తర అమెరికా, కరేబియన్ కలిసే ప్రాంతానికి నేను వెళ్లినప్పుడు, మడ అడవులు, పడగపు దిబ్బెలపై వేలాడుతూ ఉన్న ఒక గొలుసు మాదిరి ఇది కనిపించింది.

మియామి నుంచి కీవెస్ట్‌కి ఉన్న మార్గంలో 42 వంతెనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మియామి నుంచి కీవెస్ట్‌కి ఉన్న మార్గంలో 42 వంతెనలు

ఫ్లాగ్లర్ విజన్

ఓవర్‌సీస్ హైవేను తొలుత ఓవర్‌సీస్ రైలు రోడ్డుగా ప్రారంభించారు.

ఆధునిక ఫ్లోరిడాకు రూపకర్తగా చెప్పుకునే డెవలపర్ హెన్రీ మారీసన్ ఫ్లాగ్లర్ దీనికి శ్రీకారం చుట్టారు.

1870లో వ్యాపార దిగ్గజమైన జాన్ డీన్ రాకీఫెల్లర్‌తో కలిసి స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని ఫ్లాగ్లర్ ప్రారంభించారు.

20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన సంస్థలలో ఇదీ ఒకటి.

ఫ్లోరిడాను సందర్శించిన తర్వాత, పర్యాటకానికి ఇదొక అద్భుతమైన ప్రాంతమని ఆయన గుర్తించారు. ఫ్లాగ్లర్ తాను సంపాదించిన సొమ్మునంతా, ఈ ప్రాంతం కోసమే ఖర్చు చేశారు.

అమెరికాలో అత్యంత పేదరిక రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాను ఈశాన్య అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు స్వర్గధామంగా మార్చేందుకు లగ్జరీ రిసార్ట్‌లను ఇక్కడ ఏర్పాటు చేశారు.

అయితే, ఫ్లాగ్లర్ ఏర్పాటు చేసిన ఈ లగ్జరీ రిసార్ట్‌లను చేరుకునేందుకు పర్యాటకులకు ఎలాంటి మార్గం ఉండేది కాదు.

1885ల్లో, ఫ్లోరిడాకు తూర్పున చివరినున్న జాక్సన్‌విల్లే నుంచి రాష్ట్రంలో దక్షిణాదిన మూలనున్న మియామికి కలిపేందుకు ఫ్లోరిడా అట్లాంటిక్ తీరప్రాంతం గుండా రైలు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేశారు.

మియామి ఈ లైన్‌కు చివరి మార్గం. కానీ, అమెరికా 1904లో పనామా కెనాల్‌ నిర్మాణం ప్రారంభించినప్పుడు, ఈ కెనాల్‌కి దగ్గర్లో ఉన్న కీవెస్ట్‌ ద్వీపంలో అద్భుతమైన అవకాశాలున్నాయని ఫ్లాగ్లర్ పసిగట్టారు.

కీవెస్ట్‌ను ప్రధాన భూభాగానికి కలపడం ద్వారా తన కలను నెరవేర్చుకున్న వ్యాపారవేత్త హెన్రీ మారీసన్ ఫ్లాగ్లర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కీవెస్ట్‌ను ప్రధాన భూభాగానికి కలపడం ద్వారా తన కలను నెరవేర్చుకున్న వ్యాపారవేత్త హెన్రీ మారీసన్ ఫ్లాగ్లర్

‘‘ఫ్లాగ్లర్ మూర్ఖత్వం’’గా అభివర్ణించారు

1900 వరకు ఫ్లోరిడాలో అతిపెద్ద నగరంగా కీవెస్ట్ ఉండేది. చుట్ట, చేపల పరిశ్రమకు అప్పటికే ప్రముఖ కేంద్రం.

కానీ, ఈ మారుమూల ద్వీపం నుంచి ఉత్తరానికి వస్తువులను తరలించడం చాలా ఖర్చుతో, కష్టంతో కూడుకున్న పనిగా ఉండేది.

దీంతో, ఫ్లాగ్లర్ తన ట్రాక్‌ను దక్షిణం నుంచి కీవెస్ట్‌కి 156 మైళ్లు విస్తరించాలని నిర్ణయించారు. దానిలో ముఖ్యంగా మహాసముద్రంపైనే ఉంది. దీన్ని కీవెస్ట్ ఎక్స్‌టెన్షన్‌గా చెప్పారు.

అయితే, ఈ కీవెస్ట్ ఎక్స్‌టెన్షన్‌ను ఆయన ప్రత్యర్థులు చాలా మంది అసాధ్యంగా పరిగణించారు.

ఆయన విమర్శకులు దీన్ని ‘‘ఫ్లాగ్లర్ మూర్ఖత్వం’’గా కూడా అభివర్ణించారు.

1905 నుంచి 1912 మధ్య కాలంలో మూడు అతిపెద్ద హరికేన్లు దీన్ని నిర్మాణ ప్రాంతాన్ని బాగా దెబ్బకొట్టాయి. 100 మందికి పైగా కార్మికులు మరణించారు.

అయినప్పటికీ, వెనక్కి తగ్గని ఫ్లాగ్లర్ దీన్ని ముందుకు తీసుకెళ్లారు. దీన్ని నిర్మించేందుకు ఏడేళ్ల సమయం పట్టింది.

4 వేల ఆఫ్రికన్ అమెరికన్లు, బహామియన్లు, యూరోపియన్ శరణార్థులు ఈ రైలు రోడ్డు మార్గాన్ని నిర్మించడంలో సాయపడ్డారు.

పాములు, తేళ్లు, మొసళ్లలను ఎదుర్కొంటూ అత్యంత కష్టతరమైన వాతావరణ పరిస్థితుల మధ్యన ఈ మార్గాన్ని వారు పూర్తి చేశారు.

ఈ రైలు రోడ్డు మార్గాన్ని చివరికి 1912లో పూర్తి చేసినప్పుడు, దీన్ని ప్రపంచంలో ‘‘ఎనిమిదో వింతగా’’ అభివర్ణించారు.

30 మిలియన్ డాలర్లు సొంత డబ్బు ఖర్చు పెట్టిన ఫ్లాగ్లర్

ఈ మార్గంలో రైలు ప్రారంభోత్సవం జరిపినప్పుడు, 82 ఏళ్ల ఫ్లాగ్లర్ తన ప్రైవేట్ లగ్జరీ క్యారేజ్ కారులో మియామి నుంచి కీవెస్ట్‌కి వచ్చారు.

ఆ మార్గం ప్రారంభోత్సవ వేడుకల్లో తన స్నేహితుడితో ‘‘నేనిప్పుడు సంతోషంగా చనిపోతాను, నా కల నెరవేరింది’’ అని అన్నారు.

‘‘ఫ్లాగ్లర్ సొంతంగా 30 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయడం నిజంగా చాలా విశేషనీయం’’ అని ఫ్లోరిడా చరిత్రకారుడు బ్రాడ్ బెర్టెల్లీ అన్నారు.

జెఫ్ బెజోస్ లేదా బిల్ గేట్స్ నేడు ఇది పూర్తి చేయగలరు.

1935లో వచ్చిన హరికేన్లతో ఈ ఓవర్‌సీస్ రైల్ రోడ్డులో కొన్ని సెక్షన్లు పాడయ్యాయి. ధ్వంసమైన వీటిని అభివృద్ధి చేసేందుకు ఫ్లోరిడా ఈస్ట్ కోస్ట్ వద్ద డబ్బులు లేకపోవడంతో, ఈ రైల్ రోడ్డుకి చెందిన పూర్తి హక్కులను, మిగిలిన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఫ్లోరిడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.

గంటకు 200 మీటర్ల వేగంతో వీచే గాలులకు కూడా చెక్కుచెదరని ఫ్లాగ్లర్ వంతెన నిర్మాణాలను ఆధారంగా చేసుకుని, ప్రపంచంలో అతి పొడవైన ఓవర్‌వాటర్ రోడ్లను నిర్మించేందుకు 1938లో అమెరికా ప్రభుత్వం కూడా సిద్ధమైంది.

ఓవర్‌సీస్ హైవే మారుమూల ఫ్లోరిడా కీస్‌ను నేడు పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సాయపడింది.

ఈ రైలు రోడ్డు నిర్మాణం పూర్తయి శతాబ్దం దాటాక, మియామి నుంచి కీవెస్ట్‌లో ప్రయాణించేందుకు ఒరిజినల్ బ్రిడ్జ్‌లలో 20 వంతెనలను ఇప్పటికీ వాడుతున్నారు.

ఆకర్షణీయమైన, పెద్దగా పట్టించుకోని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్టాప్‌లు ఈ ఇంజనీరింగ్ అద్భుతం ఎలా కట్టారో అర్థం చేసుకునేందుకు పర్యాటకులకు బాగా ఉపయోగపడుతున్నాయి.

ఫ్లోరిడా కీస్‌పై ఈ మార్గం ఎంతో ప్రభావాన్ని చూపుతోంది.

కాయో లార్గోలో ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా క్రైస్ట్ ఆఫ్ ది అబిస్

ఫొటో సోర్స్, CHANDAN KHANNA

‘కీ లార్గో’ ఈ హైవేకి తొలి స్టాప్

మియామి నుంచి దక్షిణం వైపున 69 మైళ్ల దూరంలో ఉన్న ‘కీ లార్గో’ ఈ హైవేకి తొలి స్టాప్. ఇది ఫ్లోరిడా కీస్‌కి ఉత్తరాన ఉంది.

పాములు, మొసళ్లు, ఇతర విషపూరితమైన కీటకాలు వంటి వాటిని ఆనాడు ఫ్లాగ్లర్ సిబ్బంది ఎదుర్కొన్నారు.

కానీ, ప్రస్తుతం కీ లార్గోకి వచ్చే ప్రయాణికులు అపారమైన సముద్రపు జాతులను చూసి ఆశ్చర్యపోతున్నారు.

కీస్ హిస్టరీ అండ్ డిస్కవరీ సెంటర్‌ అనే హిస్టరీ మ్యూజియం ఈ రైల్వే నిర్మాణాన్ని చూపుతూ 35 నిమిషాల డాక్యుమెంటరీని కూడా రూపొందించింది.

దీనిలో ఈ నిర్మాణం జరిగేటప్పుడు సిబ్బంది ఎదుర్కొన్న ఆటంకాలను కూడా చూపారు.

ఈ ట్రైన్ నిర్మాణం జరిగిన సమయంలోని కళాఖండాలను కూడా ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తారు.

ఈ ఓవర్‌సీస్ హైవే నిర్మాణ సిబ్బంది 24 గంటల పాటు పనిచేశారు.

సముద్రం మధ్యలో సపోర్టింగ్ కోసం 700కి పైగా పైళ్లను ఏర్పాటు చేశారు.

ఈ మార్గంలో అతిపెద్ద వంతెనను ఏర్పాటు చేసేందుకు సముద్ర మట్టానికి 30 అడుగుల లోతులో వీటి ఏర్పాటు చేశారు.

ట్రైన్ ట్రాక్‌ల బరువుకు సపోర్ట్‌గా సముద్రంలో కాంక్రీట్ పీఠాలను ఏర్పాటు చేసేందుకు నిర్మాణ సిబ్బందికి పర్వతరోహకులు సాయపడ్డారు.

ఈ ఓవర్‌సీస్ హైవేను నిర్మించడంలో అత్యంత సవాలైన ఓవర్‌సీస్ రైల్ రోడ్డు అయిన ప్రముఖ సెవన్ మైల్ బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు, ఇస్లామోరాడాకు దక్షిణాన 56 కి.మీల దూరంలో ఉన్న చిన్న పగడాల ద్వీపం పిజియన్ కీ లోనే 400 మంది వర్కర్లు నివసించారు.

నేడు, పిజియన్ కీలో కేవలం నలుగురు మాత్రమే శాశ్వత నివాసితులున్నారు.

ఐదు ఎకరాల ఈ ద్వీపం ప్రస్తుతం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోయింది.

సోలార్ విద్యుత్‌తోనే ఇది నడుస్తోంది.

సెవన్ మైల్ బ్రిడ్జ్

ఫొటో సోర్స్, JEFF GREENBERG

ఆధునిక ప్రపంచంలో ఎనిమిదో వింత

సెవన్ మైల్ బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు సిబ్బంది రోజువారీ జీవితాన్ని తెలిపే, వారి ఇళ్లకు సంబంధించిన పలు భవంతులు ప్రస్తుతం పర్యాటకులకు ఆకర్షణీయంగా మారాయి.

కీవెస్ట్‌లోని యూఎస్ మైల్ మార్కర్‌ను చూసిన తర్వాత ఓవర్‌సీస్ హైవే ప్రయాణం ముగుస్తుంది.

అమెరికాలో దక్షిణాన ఉన్న ఈ మార్కర్, ప్రస్తుతం మియామితో పోలిస్తే క్యూబాకు దగ్గర్లో ఉంది.

ఆ తర్వాత పర్యాటకులు నేరుగా నగరంలోని ప్రధాన ప్రాంతం దువాల్ స్ట్రీట్‌కి లేదా ఎర్నెస్ట్ హెమింగ్‌వే హోమ్ అండ్ మ్యూజియానికి వెళ్లొచ్చు.

ఈ మ్యూజియం చిన్నది, కానీ సమాచారాత్మకంగా ఉంటుంది.

500 ఏళ్ల కీ వెస్ట్ చరిత్రను ఈ మ్యూజియం చూపిస్తోంది. ఈ 7 చదరపు మైళ్ల ఉష్ణమండల ద్వీపకల్పం ఎలా వాణిజ్య కేంద్రంగా, ఎలా పర్యాటక కేంద్రంగా ఎలా మారిందో ఈ మ్యూజియం తెలుపుతుంది.

ఆధునిక ప్రపంచంలో ఈ ఎనిమిదవ వింత, రైలు రోడ్డు మారిన తీరుతెన్నులను వివరిస్తుంది.

20వ శతాబ్దం ప్రారంభంలో టెక్నాలజీ పరంగా ఉన్న పరిమితులను దాటుకుని ఇదెలా ఏర్పాటైందో చూపుతుంది.

‘‘ఫ్లోరిడా కీస్ చరిత్రలో అత్యంత ప్రభావంతమైన దాన్ని గుర్తుంచుకోవాల్సి వస్తే, అది తప్పనిసరిగా ఫ్లాగ్లర్ ఓవర్‌సీస్ రైల్వేనే అవుతుంది’’ అని ఫ్లోరిడా కీస్ చరిత్రకారుడు, రచయిత డాక్టర్ కోరి కన్వర్‌టిటో అన్నారు.

ఫ్లాగ్లర్ దూరదృష్టి, కృషి, అంకితభావంతో ఫ్లోరిడా కీస్ తొలిసారి అమెరికా ప్రధాన భూభాగంతో కలిసింది.

నివాసితులకు, పర్యాటకులకు వాణిజ్య పరంగా, పర్యాటకపరంగా ఉండే ప్రయోజనాలను మనం తక్కువగా అంచనావేయలేమని కన్వర్‌టిటో అన్నారు.

ఫ్లోరిడా కీస్ ఆర్థిక వ్యవస్థకు ఈ హైవే సహకరించింది. నేడు పర్యాటక పరిశ్రమకు ఈ హైవేనే తలుపులు తెరిచింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)