మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారంటే...

ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, FB/Narendra Modi

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మోదీతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.

రాష్ట్రపతి భవన్ ఎదుట ఉన్న ఆవరణలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

జూన్ 7న జరిగిన ఎన్డీయే సమావేశంలో మోదీని కూటమి తరపున లోక్‌సభా పక్షనేతగా ఎన్నుకున్నారు.

“ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మరోసారి నన్ను ప్రధానమంత్రి పదవికి ఎన్నుకున్నారు. దీని గురించి రాష్ట్రపతికి సమాచారం అందించాం. ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు రాష్ట్రపతి నన్ను ఆహ్వానించారు” అని రాష్ట్రపతి ముర్మును కలిసిన అనంతరం ప్రధాని చెప్పారు.

జూన్ 9 సాయంత్రం కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆయన చెప్పారు.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
నరేంద్ర మోదీ, ముయిజ్జు

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

ఎవరెవరిని ఆహ్వానించారు?

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ దేశాల అధినేతలను ఆహ్వానించారు.

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అరిఫ్, నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ, మారిషస్ ప్రధానమంత్రి ప్రవిండ్ జగన్నాథ్, మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు ఆహ్వానాలు పంపినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

వీరంతా ఆహ్వానాన్ని స్వీకరించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ప్రకటన ప్రకారం, భారత నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పొరుగునే ఉన్న పాకిస్తాన్, చైనా, మియన్మార్ నుంచి ఎవరినీ ఆహ్వానించలేదు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న వివిధ దేశాల అధినేతలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

భారత ప్రభుత్వం “పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు, సాగర్ విజన్” కింద ఆయా దేశాల నేతలను ఆహ్వనించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 8 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అతిథుల జాబితాను తయారు చేసిన కేంద్ర ప్రభుత్వం వారందరికీ ఆహ్వానాలు పంపింది.

ప్రభుత్వ ఆహ్వానితుల జాబితాలో న్యాయవాదులు, డాక్టర్లు, కళాకారులు, సాంస్కృతిక కళాకారులు, సమాజంలో ప్రభావిత వ్యక్తులు ఉన్నాట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి, ప్రమాణ స్వీకారం

ఫొటో సోర్స్, RASHTRAPATIBHVN @X

ఫొటో క్యాప్షన్, మోదీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించిన రాష్ట్రపతి ముర్ము

ఆహ్వానాన్ని స్వీకరించిన మాల్దీవులు

నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలన్న భారత ప్రభుత్వ ఆహ్వానాన్ని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అంగీకరించారు.

మాల్దీవుల్లో ఇండియన్ హై కమిషనర్ మును మహావర్ ఆహ్వాన పత్రాన్ని అధ్యక్షుడు ముయిజ్జుకు అందించినట్లు అధ్యక్షుడి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముయిజ్జు హాజరవుతారని మోదీ ఆశిస్తున్నారని మును మహావర్ చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరవు కావడం గౌరవంగా భావిస్తున్నట్లు ముయిజ్జు తెలిపారు.

భారతదేశంతో సంబంధాల బలోపేతానికి మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోదీతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నానని ముయిజ్జు చెప్పారు. భారత్- మాల్దీవుల సంబంధాలు సానుకూల మార్గంలో నడుస్తాయని తన పర్యటన నిరూపిస్తుందని ఆయన అన్నారు.

మహమ్మద్ ముయిజ్జు మాల్దీవులు అధ్యక్షుడైన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత పెరిగింది. ఆయన అధ్యక్షుడైన వెంటనే మాల్దీవుల నుంచి భారత్ బలగాలు వెళ్లిపోవాలని ఆదేశించారు.

గతేడాది దుబాయ్‌లో జరిగిన కాప్ 28 సదస్సులో మోదీ, ముయిజ్జు తొలిసారి భేటీ అయ్యారు. ఆ సమయంలో భారత్- మాల్దీవుల మధ్య సంబంధాలు, అభివృద్ధిలో సహకారంపై ఇద్దరు నేతలు చర్చించారు.

ప్రధానమంత్రి, నరేంద్ర మోదీ, ముయిజ్జు

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

ఫొటో క్యాప్షన్, ముయిజ్జుకు ఆహ్వాన పత్రాన్ని అందిస్తున్న భారత హై కమిషనర్

దిల్లీ చేరుకున్న షేక్ హసీనా

నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజయ్యేందుకు భారత్‌కు విచ్చేసిన తొలి విదేశీ అతిధి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధిర్ జైస్వాల్ చెప్పారు.

“భారత భాగస్వాముల్లో అత్యంత కీలకమైన దేశం. ఆమె పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది” షేక్ హసీనాకు స్వాగతం పలుకుతున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ రంధిర్ జైస్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకు ముందు షేక్ హసీనా శనివారం సాయంత్రం బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో దిల్లీకి బయల్దేరినట్లు బంగ్లాదేశ్‌కు చెందిన పత్రిక ద డైలీ స్టార్ కథనం ప్రచురించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

భారత్‌కు నేపాల్ ప్రధానమంత్రి

నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ, నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరను కానున్నారు.

నేపాల్ మంత్రి మండలి సమావేశం తర్వాత ప్రధానమంత్రి కమల్ దహల్ ప్రచండ ఆదివారం దిల్లీ చేరుకుంటారని నేపాల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి రాకేష్ శర్మ సమాచారం అందించినట్లు భారత ప్రభుత్వ అధికారిక ఛానల్ దూరదర్శన్ రిపోర్ట్ చేసింది.

అంతకు ముందు ప్రధానమంత్రి దహల్ మోదీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. నేపాల్- భారత్ సంబంధాల బలోపేతానికి కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

నేడు భారత్‌కు శ్రీలంక అధ్యక్షుడు

మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించిన తర్వాత రణిల్ విక్రమ సింఘ మోదీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని శ్రీలంక అధ్యక్షుడి మీడియా విభాగం తెలిపింది.

రణిల్ విక్రమ సింఘ మోదీకి ఫోన్ చేసినప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని మోదీ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారని మీడియా విభాగం తెలిపింది.

శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘ జూన్ 9న దిల్లీ చేరుకుంటారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

దిల్లీకి రానున్న సీషెల్స్ ఉపాధ్యక్షుడు

మోదీతో పాటు ఇతర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్ హాజరవుతున్నారని సీషెల్స్‌లోని భారత హైకమిషన్ తెలిపింది.

సీషెల్స్ తరపున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ఆ దేశ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)