వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి టీమిండియాలో చోటు, జింబాబ్వే టూర్‌కి ఎంపిక

NITISH KUMAR REDDY

ఫొటో సోర్స్, Getty Images

టి20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే జింబాబ్వేలో పర్యటించే భారత జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది.

ఈ జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డితో పాటు అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్‌లకు చోటు దక్కింది. వీరంతా తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు.

ఈ యువ ఆటగాళ్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరిచారు.

రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చారు.

టి20 వరల్డ్ కప్‌లో ఆడిన సీనియర్లందరికీ విశ్రాంతి ఇచ్చారు.

భారత్, జింబాబ్వే జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగనుంది. జింబాబ్వే వేదికగా జులై 6 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌తో పాటు ధ్రువ్ జురెల్‌కు జట్టులో చోటు దక్కింది.

అయితే, ఈ జట్టులో మరో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కలేదు.

బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే ఉన్నారు.

నితీశ్ కుమార్ రెడ్డి

ఫొటో సోర్స్, ANI

ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి?

2023 సీజన్‌తో నితీష్ కుమార్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు నితీష్ వయస్సు 21 ఏళ్లు.

2003 మే 26న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నితీశ్ జన్మించాడు.

2024 ఐపీఎల్ సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన నితీశ్ 142 స్ట్రయిక్‌రేట్‌తో 303 పరుగులు చేశాడు. 3 వికెట్లు తీశాడు.

దీనికంటే ముందు ఈ ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీ‌లో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో నితీష్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు.

ఇందులో అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ వికెట్లు కూడా ఉన్నాయి.

నితీశ్ కుమార్ రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

విరాట్ కోహ్లీని అభిమానించే నితీష్ కుమార్‌కు తానో విలువైన ఆటగాడిగా నిరూపించుకునే ప్రతిభ ఉందని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ తెలిపారు.

ప్రస్తుతం హర్దిక్ పాండ్యాలా ఫాస్ట్ బౌలింగ్ కోటాలో ఆల్‌రౌండర్‌గా పరిగణించాల్సిన కొద్ది మంది ఆటగాళ్లలో నితీష్‌ కుమార్ రెడ్డి కూడా ఒకరని విమల్ అభిప్రాయపడ్డారు.

నిరుడు క్రికెట్ దిగ్గజాలు బ్రయాన్ లారా, డేల్ స్టెయిన్‌తో నితీష్ కుమార్ ఎక్కువ సమయం గడిపాడు.

నితీష్ కుమార్ గురించి మరో తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఐపీఎల్ సమయంలో మాట్లాడుతూ, నితీష్ అరుదైన ఆటగాడని, అతనిపై బీసీసీఐ దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు నితీష్ భారత జట్టుకు ఎంపికయ్యాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)