షాపులో బంగారం చోరీ.. ‘బొమ్మ’ అరెస్ట్

చోరీ

ఫొటో సోర్స్, WARSAW POLICE

ఫొటో క్యాప్షన్, షాపులో బొమ్మల మధ్య బొమ్మలా నిలబడిన యువకుడు
    • రచయిత, జేమ్స్ ఓ రెయిల్లీ
    • హోదా, బీబీసీ న్యూస్

పోలండ్ రాజధాని వార్సాలో 22 ఏళ్ళ యువకుడు దొంగతనం చేసేందుకు ఆసక్తికరమైన ఎత్తుగడ వేసిన వైనం వెలుగులోకి వచ్చింది.

ఆయన తన చేతిలో బ్యాగు పట్టుకుని షాపింగ్‌ మాల్‌లోని అద్దాల వెనుక ఉన్న అనేక బొమ్మల మధ్య బొమ్మలా నిలబడ్డారు.

బంగారు ఆభరణాల విభాగంలో ఆయన సెటిలవ్వడానికి ముందు షాపింగ్ మాల్‌లోని వివిధ దుకాణాలలో తిరిగినట్లు పోలీసులు చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించి వార్సా పోలీసులు ఓ ఫోటోను విడుదల చేశారు. షాపులోని అద్దం వెనుక ఆయన చేతిలో సంచితో విగ్రహంలా నిలబడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా బొమ్మ అనుకొనేలా నటించారు.

ఈయన చేసిన పని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యిందని పోలీసు ప్రతినిధి రాబర్ట్ సుజుమైతా చెప్పారు. ఇక తను సేఫ్ అని భావించాక, బంగారం దొంగతనం చేయడానికి ముందు మాల్‌లోని దుకాణాలన్నీ ఓసారి అలా తిరిగొచ్చారని తెలిపారు.

దొంగతనం

ఫొటో సోర్స్, WARSAW POLICE

ఫొటో క్యాప్షన్, బట్టల దుకాణం షట్టర్‌నుంచి లోపలకు చొరబడుతున్న దొంగ

దీనికి ముందుగా ఆయన మరో దొంగతనం చేశారు. తొలుత ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసి, తర్వాత అక్కడే ఉన్న షాపింగ్ సెంటర్ మూసేవరకూ వేచి చూశాడు.

ఆపై ఓ బట్టల దుకాణంలోకి ప్రవేశించి బొమ్మలా ఉండేందుకు వీలుగా కొత్త దుస్తులు ధరించారు.

ఈ దుస్తుల దుకాణం షట్టర్ కొద్దిభాగం తెరిచి అందులోకి ఆయన చొరబడుతున్న దృశ్యం సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది.

తరువాత ఆయన మరో షాపింగ్ మాల్ వద్దకు వచ్చాడు. అక్కడే ఓ షాపులో బొమ్మలా నిలబడ్డారు. మాల్ మూసేవరకూ అలాగే నిలబడ్డాడు. ఇక అంతా సద్దుమణిగిందనుకున్నాక తన పని మొదలుపెట్టారు.

తాను ఎంచుకున్న షాపులో కొంత నగదు, బంగారం దొంగతనం చేశారు. కానీ చివరకు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడి కటకటాలపాలయ్యారు.

నిందితుడికి మూడునెలల జైలు శిక్ష పడినట్టు ప్రభుత్వ న్యాయవాది వార్సాలో తెలిపారు.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)