‘దుబాయ్ పోర్టా పాటీ’ వెనకున్న సెక్స్ రాకెట్‌ను బీబీసీ ఎలా బయటపెట్టిందంటే

- రచయిత, రునాకో సెలీనా
(హెచ్చరిక: కలవరపరిచే అంశాలు, లైంగిక చర్యల వివరణలు ఉన్నాయి)
దుబాయ్‌లోని విలాసవంతమైన పరిసరాల్లో సెక్స్ రాకెట్‌ను నడుపుతూ, మహిళలను దోపిడీ చేస్తున్న వ్యక్తిని 'బీబీసీ ఇన్వెస్టిగేషన్' గుర్తించింది.
చార్లెస్ మ్వెసిగ్వా అనే ఆ వ్యక్తి ఒకప్పుడు తను లండన్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేసినట్లు చెప్పారు.
1,000 డాలర్లు ( సుమారు రూ.88 వేలు) నుంచి ప్రారంభమయ్యే సెక్స్ పార్టీలకు మహిళలను సరఫరా చేయగలనని బీబీసీ అండర్‌కవర్ రిపోర్టర్‌తో ఆయన అన్నారు. క్లయింట్లు కోరుకునే "ప్రతీది" ఈ మహిళలు చేస్తారని మ్వెసిగ్వా తెలిపారు.
దుబాయ్‌లో వైల్డ్ సెక్స్ పార్టీల గురించి ఏళ్లుగా పుకార్లు ఉన్నాయి. టిక్‌టాక్‌లో #Dubaiportapotty అనే హ్యాష్‌ట్యాగ్‌కు 45 కోట్ల వ్యూస్ ఉన్నాయి.

మహిళలు తాము కోరుకున్న లైఫ్‌స్టైల్ కోసం తీవ్రమైన లైంగిక చర్య(హార్డ్ కోర్ సెక్స్)లలో పాల్గొంటూ రహస్యంగా డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపించే జోకులు, కథనాలలో ఈ హ్యాష్‌ట్యాగ్ తరచుగా ఉపయోగిస్తుంటారు.
అయితే, వాస్తవం మరింత కలవరపెడుతుందని 'బీబీసీ ఇన్వెస్టిగేషన్' చెబుతోంది.
మ్వెసిగ్వా కోసం సెక్స్ వర్క్ చేయాల్సి వస్తుందని ఊహించలేదని యుగాండా యువతులు మాతో చెప్పారు. కొందరినైతే సూపర్ మార్కెట్లలో లేదా హోటళ్లలో పని చేయడం కోసమని దుబాయ్‌కి తీసుకొచ్చారు.
కొంతమంది క్లయింట్లు మహిళలపై మలవిసర్జన చేయాలని కూడా కోరుకుంటారని మియా(పేరు మార్చాం) అనే మహిళ అన్నారు. తాను మ్వెసిగ్వా నెట్‌వర్క్‌లో చిక్కుకున్నానని ఆమె చెప్పారు.
ఈ ఆరోపణలను మ్వెసిగ్వా తిరస్కరించారు. మహిళలు నివసించడానికి ఇళ్లను వెతకడంలో మాత్రమే సహాయం చేస్తానని, పార్టీలలో వారిని ధనవంతులకు పరిచయం చేస్తానని ఆయన అంటున్నారు.
అంతేకాదు, మ్వెసిగ్వాతో సంబంధం ఉన్న ఇద్దరు మహిళలు ఎత్తైన అపార్ట్‌మెంట్ల నుంచి పడి మరణించారని బీబీసీ కనుగొంది. వారి మరణాలను ఆత్మహత్యలుగా తేల్చారు పోలీసులు. కానీ, మరింత దర్యాప్తు చేసి ఉండాల్సిందని బంధువులు, స్నేహితులు అభిప్రాయపడ్డారు.
దుబాయ్ పోలీసులు ఇప్పటికే ఈ కేసులను పరిశీలించారని, దీనిపై వారినే అడగాలని బీబీసీకి మ్వెసిగ్వా సూచించారు. అయితే, ఈ కేసులపై బీబీసీ సంప్రదించగా పోలీసులు స్పందించలేదు.

ఫొటో సోర్స్, Family handout
'అప్పు ఉన్నట్లు చూపుతారు'
మరణించిన మహిళల్లో ఒకరు పశ్చిమ యుగాండాకు చెందిన మోనిక్ కరుంగి.
దుబాయ్‌లో మ్వెసిగ్వా వద్ద పనిచేస్తున్న డజన్ల కొద్దీ మహిళలతో కలిసి ఒక ఫ్లాట్‌లో మోనిక్ నివసించినట్లు కైరా చెప్పారు. 2022లో మోనిక్‌తో పాటు నివసించినట్లు ఈ మహిళ చెప్పారు.
"మ్వెసిగ్వా ఉండే ప్రాంతం ఒక మార్కెట్ లాంటిది. దాదాపు 50 మంది అమ్మాయిలున్నారు. ఊహించినట్లుగా ఉద్యోగం లేకపోవడంతో మోనిక్ అసంతృప్తి చెందారు" అని కైరా చెప్పారు.
సూపర్ మార్కెట్‌లో పని చేయడానికి దుబాయ్ వెళ్తున్నట్లు మోనిక్ భావించినట్లు ఆమె సోదరి రీటా చెప్పారు.
''ఇంటికి వెళ్లాలనుకుంటున్నానని చెప్పినప్పుడు మ్వెసిగ్వాలోని క్రూరుడు బయటకు వచ్చాడు'' అని మియా అంటున్నారు. ఈమెకు కూడా మోనిక్ తెలుసు.
మొదటిసారి దుబాయ్ వచ్చినప్పుడు, తనపై 2,711 డాలర్ల (రూ.2.4 లక్షలు) అప్పు ఉన్నట్లు చెప్పారని, రెండు వారాల్లోనే దాన్ని రెట్టింపుగా చూపారని ఆమె పేర్కొన్నారు.
‘‘ఫ్లైట్ టికెట్, వీసా, రెంట్, ఫుడ్ అన్నింటికీ ఆయన చార్జ్ చేస్తారు" అని మియా చెప్పారు.
‘‘ మీరు చాలా కష్టపడి పని చేయాలి. పురుషులు వచ్చి మీతో పడుకోవాలని వేడుకోవాలి" అని అన్నారామె.
కొన్నివారాల తర్వాత మ్వెసిగ్వాకు మోనిక్ 27,000 డాలర్ల(రూ. 23.8 లక్షలు)కు పైగా బాకీ పడినట్లు ఆమె బంధువు మైఖేల్(పేరు మార్చాం) చెప్పారు. ఆమె తన పరిస్థితి గురించి ఏడుస్తూ వాయిస్ మెసేజులను పంపినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు.
క్లయింట్లలో ఎక్కువగా తెల్లజాతి యూరోపియన్లు ఉన్నారని, అందులో కొందరికి తీవ్రమైన లైంగిక కోరికలున్నాయని మియా తెలిపారు.
"ఒక క్లయింట్ మహిళలపై మలవిసర్జన చేసేవారు. దాన్ని తినమని చెప్పేవారు" అని ఆమె అన్నారు.

వేరే గ్రూపు ద్వారా దోపిడీకి గురైన "లెక్సీ(పేరు మార్చాం)" అనే మరో మహిళ ఈ రకమైన (పోర్టా పాటీ) అభ్యర్థనలు సర్వసాధారణమని ధ్రువీకరించారు.
ఒక క్లయింట్ తనపై సామూహిక అత్యాచారం చేయడానికి, ముఖంపై మూత్ర విసర్జన చేయడానికి, కొట్టడానికి 15,000 దిర్హామ్‌లు (రూ. 3.6 లక్షలు) ఇస్తానన్నారని, అంతేకాదు మలం తింటున్నట్లు చిత్రీకరించడానికి అనుమతిస్తే మరో 5,000 దిర్హామ్‌లు (రూ.1.2 లక్షలు) ఇస్తానని చెప్పినట్లు లెక్సీ గుర్తుచేసుకున్నారు.
ఇక్కడ, జాత్యహంకారం ఒక పాత్ర పోషించిందని లెక్సీ నమ్ముతున్నారు. ఆ పురుషులు "ఏడుస్తూ, అరుస్తూ, పారిపోయే నల్లజాతి స్త్రీని కోరుకున్నారు" అని లెక్సీ చెప్పారు.
దుబాయ్ పోలీసుల సాయం కోసం ప్రయత్నించినప్పుడు, "మీ ఆఫ్రికన్లు సమస్యలు తెచ్చుకుంటున్నారు. మేం దానిలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు" అని ఫోన్ కట్ చేస్తారని లెక్సీ వివరించారు.
దీనిపై పోలీసులను బీబీసీ సంప్రదించగా, వారు స్పందించలేదు.
కొన్నిరోజుల తర్వాత లెక్సీ యుగాండాకు పారిపోయారు. ఇపుడు తనలాంటి పరిస్థితిలో ఉన్న ఇతర మహిళలకు మద్దతు ఇవ్వడానికి, రక్షించడానికి ఆమె పనిచేస్తున్నారు.
మ్వెసిగ్వాను గుర్తించడం సులభం కాదు
చార్లెస్ మ్వెసిగ్వాను గుర్తించడం అంత సులభం కాదు. ఆయనది బయట ఒకే ఒక ఆన్‌లైన్ ఫోటో ఉంది. అది కూడా ఆయన్ను వెనుక నుంచి చూపించింది. ఆయన సోషల్ మీడియాలో కూడా వేర్వేరు పేర్లను ఉపయోగించారు.
ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్, అండర్‌కవర్ రీసర్చ్, మ్వెసిగ్వా బృందంలోని మాజీ సభ్యుల సహాయంతో దుబాయ్‌లోని మధ్యతరగతి ప్రాంతమైన జుమేరా విలేజ్ సర్కిల్‌లో బీబీసీ ఆయనను గుర్తించింది.
అవమానకరమైన లైంగిక చర్యలకు మ్వెసిగ్వా మహిళలను సరఫరా చేశారనే ఆరోపణలను చెక్ చేయడానికి, లగ్జరీ పార్టీలకు మహిళలను వెతుకుతున్న ఈవెంట్ ఆర్గనైజర్‌గా నటిస్తూ బీబీసీ ఒక అండర్‌కవర్ రిపోర్టర్‌ను పంపింది.
"మా దగ్గర దాదాపు 25 మంది అమ్మాయిలు ఉన్నారు. చాలామంది ఓపెన్ మైండెడ్. వారు అన్నీ చేయగలరు" అని మ్వెసిగ్వా బీబీసీ అండర్‌కవర్ రిపోర్టర్‌తో అన్నారు.
ధరలు ఒక అమ్మాయికి రాత్రికి 1,000 డాలర్ల (రూ. 88 వేలు) నుంచి ప్రారంభమవుతాయని, 'క్రేజీ స్టఫ్' కి ఎక్కువ చార్జీలు ఉంటాయని చెప్పారు. రిపోర్టర్‌ను "శాంపిల్ నైట్(ఒక రాత్రి వచ్చి వెళ్లడానికి)"కి కూడా ఆహ్వానించారు మ్వెసిగ్వా.
"దుబాయ్ పోర్టా పాటీ" పుకార్ల గురించి అడిగినప్పుడు, "వారు ఓపెన్ మైండెడ్. నా దగ్గరున్న అత్యంత క్రేజీ అమ్మాయిని మీకు పంపుతాను" అని అన్నారు మ్వెసిగ్వా.
ఒకప్పుడు లండన్ బస్సు డ్రైవర్‌గా ఉన్నట్లు చెప్పారు మ్వెసిగ్వా. 2006లో తూర్పు లండన్‌లో డ్రైవింగ్ తన ఉద్యోగంగా నమోదు చేసుకున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి.
తన ప్రస్తుత పనిని ఇష్టపడుతున్నానని ఆయన రిపోర్టర్‌తో చెప్పారు.

ఉద్యోగుల పేర్లతో బుకింగ్స్
ట్రాయ్ అనే వ్యక్తి గతంలో మ్వెసిగ్వా ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేసినట్లు చెప్పారు.
ఈ నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి బీబీసీకి ఆయన మరిన్ని వివరాలను అందించారు.
మహిళలు లోపల క్లయింట్లను గుర్తించడానికి వీలుగా నైట్‌క్లబ్ సెక్యూరిటీకి మ్వెసిగ్వా డబ్బులిస్తారని ఆయన చెప్పారు.
తనతో పాటు మిగతావారిని కేవలం డ్రైవర్లుగానే ఉపయోగించకుండా, వారి పేర్లతో కార్లు, అపార్ట్‌మెంట్‌లను అద్దెకు తీసుకునేవారని ట్రాయ్ చెప్పారు. అందుకే, పేపర్లలో ఆయన పేరు ఉండదన్నారు.

ఫొటో సోర్స్, Instagram
మోనిక్ కరుంగి 2022 ఏప్రిల్ 27న దుబాయ్‌లోని అల్ బర్షా నుంచి ఒక సెల్ఫీ పోస్ట్ చేశారు. ఆమె అప్పటికీ దుబాయ్ వచ్చి కేవలం నాలుగు నెలలే. అల్ బర్షా ప్రవాసులకు ప్రసిద్ధి చెందింది. ఆ పోస్టు పెట్టిన నాలుగు రోజుల తర్వాత మోనిక్ చనిపోయారు.
మోనిక్, మ్వెసిగ్వాలు తరచుగా వాదించుకునేవారని మియా అన్నారు. మ్వెసిగ్వా డిమాండ్లను వ్యతిరేకిస్తూ మోనిక్ బయటికి వెళ్లిపోయారని చెప్పారు.
"ఆమెకు మరో ఉద్యోగం వచ్చింది. చాలా ఉత్సాహంగా కనిపించారు. ఆమె స్వేచ్ఛ పొందబోతున్నట్లు, తన జీవితాన్ని తిరిగి పొందబోతున్నట్లు భావించారామె. ఎందుకంటే ఇప్పుడు అది నిజమైన ఉద్యోగం. పురుషులతో పడుకునేది కాదు’’అని మియా అన్నారు.
అక్కడి నుంచి కేవలం కేవలం 10 నిమిషాల దూరంలోని కొత్త అపార్ట్‌మెంట్‌కు మారారు మోనిక్. అయితే, 2022 మే 1న ఆ భవనం బాల్కనీ నుంచి పడి ఆమె మరణించారు.

దర్యాప్తులో ఏం తేలింది?
మోనిక్ మరణించినప్పుడు ఆమె బంధువు మైఖేల్ యూఏఈలోనే ఉన్నారు. పోలీసుల నుంచి సమాధానాలకు ప్రయత్నించానని ఆయన అన్నారు.
మోనిక్ పడిపోయిన అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్, ఆల్కహాల్ దొరికాయని, బాల్కనీలో ఆమె వేలిముద్రలు మాత్రమే ఉన్నాయని, అందుకే దర్యాప్తు మూసివేసినట్లు పోలీసులు చెప్పారని మైఖేల్ అన్నారు.
మైఖేల్‌కు మోనిక్ డెత్ సర్టిఫికెట్ లభించింది. కానీ, ఆమె ఎలా చనిపోయిందో అందులో చెప్పలేదు. కుటుంబానికి టాక్సికాలజీ రిపోర్టు కూడా అందలేదు.
ఆ తర్వాత మ్వెసిగ్వా అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు మైఖేల్. ఫ్లాట్‌లోకి ప్రవేశించగానే తనకు షిషా పొగ, టేబుల్‌పై కొకైన్ మాదిరి ఉన్న పదార్థం కనిపించినట్లు చెప్పారు మైఖేల్.
కుర్చీలో కూర్చున్న క్లయింట్లతో మహిళలు సెక్స్ చేస్తున్నట్లు తెలిపారు. చార్లెస్ మ్వెసిగ్వా ఇద్దరు మహిళలతో మంచంలో ఉన్నట్లు చెప్పారు మైఖేల్.
ఆయనను పోలీసుల దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు, "నేను 25 సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నాను. దుబాయ్ నాది. మీరు నాపై ఫిర్యాదు చేయలేరు. నేనే ఎంబసీ. మోనిక్ మాత్రమే మరణించిన మొదటి వ్యక్తి కాదు, ఆమె చివరిదీ కాదు" అని మ్వెసిగ్వా అన్నారని మైఖేల్ చెప్పారు.
మియా, కైరా అనే మరో ఇద్దరు మహిళలు కూడా ఈ సంభాషణ విన్నట్లు ధ్రువీకరించారు. దీనిపై మ్వెసిగ్వాను ప్రశ్నించగా అలా మాట్లాడలేదని బదులిచ్చారు.
మోనిక్ మరణం మరొక యుగాండా మహిళ కైలా బిరుంగి మరణంలాగే ఉంది. ఆమె 2021లో అదే ప్రాంతంలోని ఎత్తైన అపార్ట్‌మెంట్ నుంచి పడి మరణించారు. ఆ అపార్ట్‌మెంట్‌ను మ్వెసిగ్వా నిర్వహించేవారని ఆధారాలు సూచిస్తున్నాయి.
కైలా కుటుంబం ఆమె ఇంటి యజమాని ఫోన్ నంబర్‌ను బీబీసీకి ఇచ్చింది - అది మ్వెసిగ్వా నంబర్లలో ఒకటి. ట్రాయ్, మరో నలుగురు మహిళలు కూడా మ్వెసిగ్వానే ఆ అపార్ట్‌మెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ధ్రువీకరించారు.
కైలా మృతి కూడా మద్యం, మాదకద్రవ్యాలతో ముడిపడి ఉందని చెప్పినట్లు ఆమె బంధువులు తెలిపారు. కానీ, బీబీసీ చూసిన టాక్సికాలజీ రిపోర్టు ప్రకారం, కైలా మరణించినప్పుడు తన శరీరంలో మాదకద్రవ్యాలు లేదా మద్యం లేవని తేలింది.

ఫొటో సోర్స్, Instagram
మోనిక్, కైలా వంటి వారు ఉద్యోగం కోసం దుబాయ్ వస్తుంటారు. చివరకు ప్రమాదకరమైన వృత్తిలోకి వెళ్లిపోతున్నారు. గల్ఫ్‌లో దోపిడీ నుంచి 700 మందికి పైగా ప్రజలను రక్షించడంలో సహాయం చేశానని మ్విజా అనే యుగాండా సామాజిక కార్యకర్త చెప్పారు.
కాగా, మ్వెసిగ్వా తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. అవన్నీ తప్పుడు వాదనలన్నారు.
మోనిక్ గురించి మ్వెసిగ్వా స్పందిస్తూ "పాస్‌పోర్ట్ ఆమె దగ్గర ఉండగానే మరణించింది. కాబట్టి ఎవరూ ఆమెను డబ్బు కోసం నిర్బంధించలేదు. చనిపోవడానికి నాలుగైదు వారాల ముందువరకు నేను ఆమెను చూడలేదు" అన్నారు.
మోనిక్, కైలా మరణాలపై దుబాయ్ పోలీసులు దర్యాప్తు చేశారని కూడా ఆయన చెప్పారు.
మోనిక్, కైలా కేసు ఫైళ్ల కోసం బీబీసీ అల్ బర్షా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించింది. కానీ, ఎటువంటి స్పందనా రాలేదు. మోనిక్ టాక్సికాలజీ రిపోర్టు కూడా బీబీసీకి దొరకలేదు. ఆమె ఇంటి (చనిపోయిన ప్రాంతం) యజమానితోనూ మాట్లాడలేకపోయింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














