డ్రగ్స్ ముఠాను పట్టిచ్చిన చిలుక, పోలీసులకు ఎలా సాయం చేసిందంటే..

మాటలు నేర్చిన ఓ చిలుక అతిపెద్ద మాదక ద్రవ్యాల కార్యకలాపాల గుట్టురట్టు చేసేందుకు యూకే పోలీసులకు సాయపడింది. ఈ చిలుకకు మాటలు నేర్పింది ఆ ముఠా సభ్యులే. డ్రగ్ డీలర్లు మాట్లాడే ‘‘టూ ఫర్ 25’’ లాంటివి దానికి నేర్పారు. కొకైన్ ధరలను వల్లెవేస్తున్న ఈ చిలుకే పోలీసులకు సాక్ష్యంగా మారింది.
బ్లాక్‌పూల్‌లోని ఇళ్లపై పోలీసులు దాడి చేసినప్పుడు ఈ చిలుకను కనుగొన్నారు . ఆ దాడుల్లో అధికారులు పెద్ద మొత్తంలో హెరాయిన్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
గ్యాంగ్‌లీడర్ అయిన 35 ఏళ్ల ఆడమ్ గార్నెట్ జైలు నుంచే 2023 నుంచి 2024దాకా ఈ ముఠాను నడిపించారు.
జైలులోని ఆయన సెల్‌లో తనిఖీలు చేసినప్పుడు కొన్ని ఫోన్లు కనిపించాయి. వాటిలో కిలోలకొద్దీ డ్రగ్స్ వీడియోలు ఉన్నాయి. అలాగే గార్నెట్ ప్రియురాలి పెంపుడు చిలుక మ్యాంగో డ్రగ్స్ డబ్బుతో ఆడుకోవడం, టూ ఫర్ 25 లాంటివి మాట్లాడిన ఫుటేజీ కూడా ఉంది. ఈ టూ ఫర్ 25 అనేది వ్యవస్థీకృత నేరముఠాలు మాట్లాడే భాషలో భాగం.


ఫొటో సోర్స్, Police handout
చిలుకకు డీలర్ల మాటలు నేర్పించిన గ్యాంగ్ సభ్యురాలు
ఈ గ్యాంగ్‌లో గార్నెట్ తదుపరి లీడర్ ఆయన గర్ల్‌ఫ్రెండ్ 29 ఏళ్ల షానన్ హిల్టన్ అని గుర్తించారు. ఆమెకు శాశ్వత చిరునామా లేదు. అలాగే బీచ్ రోడ్డులోని 41 ఏళ్ల దల్బీర్ సంధు, క్లీవ్‌లీస్ షోర్ రోడ్డులోని 50 ఏళ్ల జాసన్ గెర్రాండ్ కూడా ఈ గ్యాంగ్‌లో సభ్యులని తేలింది.
హిల్టన్ ఫోన్‌లో ఉన్న ఓ వీడియోలో హిల్టన్ నవ్వుతూ ఓ చిన్నారి ముందు చిలుకకు ‘‘టూ ఫర్ 25’’ అనే మాటలు నేర్పడం కనిపిస్తోంది. ఇక సంధు ఫోన్‌లో తన డీలింగ్స్‌కు సంబంధించిన రికార్డులు కనిపించాయి. అందులో ధరల జాబితా, లావాదేవీల వివరాలు సహా అన్నీఉన్నాయని లాంక్‌షైర్ పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Police handout
జైలు నుంచే గ్యాంగ్ నిర్వహణ
జైలులో ఉన్నప్పటికీ గార్నెట్ తన గ్యాంగులోని సభ్యులందరితోను సంప్రదింపులు జరిపే మార్గాలను కలిగి ఉన్నాడని పోలీసులు చెప్పారు. మరో ముఠా సభ్యుడు గారెత్ బర్గస్ తన నేరాల గురించి చెప్పుకుంటూ భారీ మొత్తంలో నగదుతో రిసార్టులో తిరుగుతున్నట్టు కనిపిస్తున్న వీడియోను ఆయన ఫోన్ నుంచే స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Police handout
15మందిని దోషులుగా తేల్చిన కోర్టు
2023 ఫిబ్రవరి నుంచి 2024 జూలై మధ్య డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడినందుకు ప్రిస్టన్ క్రౌన్ కోర్టు గ్యాంగ్‌లోని మొత్తం 15 మంది సభ్యులను దోషులుగా నిర్ధరించింది.
గార్నెట్‌కు 19ఏళ్ల ఆరు నెలలు, హిల్టన్‌కు 12 ఏళ్లు, సంధుకు 10ఏళ్ల శిక్ష పడింది.
కోలె స్టాట్, రియాన్ బ్లాక్ కోర్టుకు హాజరు కాలేదు. వారికి శిక్షలు విధించిన కోర్టు అరెస్టు వారెంటు జారీచేసింది.
కోల్ స్టాట్, రియాన్ బ్లాక్‌లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని డిటెక్టివ్ అంథోని ఏల్వ్స్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














