బ్రెస్ట్ క్యాన్సర్: అక్కడ నివసించిన వారి వారసులకు క్యాన్సర్ వస్తుందా?

రొమ్ము, అండాశయ క్యాన్సర్ల ముప్పు పెంచే ఓ రకమైన జన్యువును ఆర్క్‌నీ ద్వీపాల నేపథ్యం ఉన్న ప్రజలలో గుర్తించారు.
ఆర్క్‌నీ ద్వీపాలలో నివసించిన తాతయ్యలు, బామ్మలు ఉన్న ప్రతి 100 మందిలో ఒకరిలో బీఆర్‌సీఏ-1 జన్యు ఉత్పరివర్తనాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
స్కాట్‌లాండ్‌లోని ఆర్క్‌నీ దీవులలో నివసించిన వారి వారసులు చాలామందిలో ఈ పరివర్తన జన్యువును గుర్తించారు.
బ్రిటన్‌లో ఒక ప్రదేశానికి, క్యాన్సర్‌కు సంబంధం ఉన్నట్లు గుర్తించడం ఇదే తొలిసారి.
గతంలో కొన్ని అధ్యయనాలలో అష్కెనాజీ మూలాలున్న యూదు మహిళలలో ఇలా రొమ్ము క్యాన్సర్ జన్యు వేరియంట్లను(బీఆర్‌సీఏ) గుర్తించారు. కానీ, బ్రిటన్‌లో ఇదే తొలిసారి.
రొమ్ము, అండాశయ క్యానర్ల ముప్పు పెంచే ఇలాంటి జీన్ వేరియంట్‌ను బ్రిటన్‌వ్యాప్తంగా మొత్తం వెయ్యి మంది మహిళలలో కనుగొన్నారు.

ఫొటో సోర్స్, FRANCISXT
నిజానికి బీఆర్‌సీఏ జీన్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. పురుషులు, మహిళలు అందరిలోనూ ఉంటాయి. అయితే, ఈ జన్యువుల్లో దేనిలోనైనా లోపమేర్పడితే అది డీఎన్‌ఏకి నష్టం కలిగిస్తుంది. ఫలితంగా కణాలు క్యాన్సర్ కణాలుగా మారి నియంత్రించలేనట్లుగా పెరిగిపోతాయి.
ఇలాంటి లోపాలున్న జీన్స్ ఉన్నవారి పిల్లలకు కూడా ఆ లోపమున్న జన్యు వేరియంట్ ఉండే ప్రమాదం 50 శాతం వరకు ఉంటుంది.
సుమారు పదేళ్ల కిందట హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీకి బీఆర్‌సీఏ-1 వేరియంట్ జీన్ ఉన్నట్లు గుర్తించి ఆమెకు శస్త్రచికిత్సలు చేసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా చాలామందికి దీనిపై అవగాహన పెరిగింది.
ఆ శస్త్రచికిత్స వల్ల ఆమెకు రొమ్ము క్యాన్సర్ ముప్పు 87 శాతం నుంచి 5 శాతానికి తగ్గించగలిగారు.
అయితే, రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గించడానికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం కాదని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Science Photo Library
రొమ్ములలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించడం, ఏటా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవడం, అవసరమైతే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ను ముందే గుర్తించొచ్చు.
అలాగే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల కూడా ముప్పును చాలావరకు నివారించొచ్చని ఎన్‌హెచ్‌ఎస్ సూచిస్తోంది.
అయితే, అండాశయ క్యాన్సర్‌ను గుర్తించడానికి నమ్మకమైన స్క్రీనింగ్ టెస్ట్ ఏదీ ఇంతవరకు లేదని ఎన్‌హెచ్ఎస్ చెప్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ అబెర్డీన్ అండ్ ఎడిన్‌బరాకు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనం ఒకటి ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్’లో ప్రచురితమైంది.
బీఆర్‌సీఏ-1 జీన్ వేరియంట్ ఉన్న 80 మందిపై ఈ పరిశోధన చేశారు. అందులో భాగంగా వారి తాతయ్యలు, బామ్మలపైనా జీన్ వేరియంట్ కోసం పరిశోధన చేశారు. ఈ సందర్భంగాలో వారిలో 60 శాతం మంది ఆర్క్‌నీ ద్వీపాలలో నివసించినవారేనని గుర్తించారు.
ఆర్క్‌నీలో జనాభా 22,000 ఉంటుంది. ప్రస్తుతం కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సరో, అండాశయో క్యాన్సర్ వచ్చి.. ఆర్క్‌నీ ద్వీప మూలాలు ఉన్నవారికి స్కాట్లాండ్‌లో పరీక్షలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- గోళ్లు ఎందుకు కొరుకుతారు?
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- ఈ స్కూలు పిల్లలు రోజూ రెండుసార్లు డబ్బాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
- గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














