హైదరాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం... ఆరుగురు మృతి

తెలంగాణలోని సికిందరాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు గాంధీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
గురువారం రాత్రి స్వప్నలోక్ కాంప్లెక్సులోని మూడవ అంతస్తులో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ కొందరు పని చేస్తున్నారు. స్వప్నలోక్ ఆనుకుని ఉన్న అపార్టుమెంటుల మీద కూడా మంటల ప్రభావం పడింది.
చనిపోయిన ఆరుగురులో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు.
మృతులు:
- శివ
- ప్రశాంత్
- ప్రమీల
- శ్రావణి
- వెన్నెల
- త్రివేణి
చనిపోయిన వారు స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఒక కాల్ సెంటర్‌లో పని చేస్తున్నారు.

మంటల్లో ఊపిరాడక
ఇది ఎనిమిది అంతస్తుల భవనం. చాలా పాత భవనం. ఇందులో గురువారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ఈ భవనంలోని 5, 6 అంతస్తుల్లో బాధితులు చిక్కుకున్నారు. ఈ అంతస్తుల్లో దట్టమైన పొగ అలుముకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద సుమారు 10 ఫైర్ ఇంజిన్లను అధికారులు మోహరించారు.
ఒక వైపు మంటలు అదుపు చేస్తూనే లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. ఏడుగురిని కాపాడినట్లు నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి వార్తా సంస్థ ఏన్‌ఐకి తెలిపారు.


కాంప్లెక్స్‌లో మంటలు దాదాపు అదుపులోకి వచ్చినప్పటికీ పొగ దట్టంగా అలుము కోవడం ఇబ్బందిగా మారింది. లోపల చిక్కుకున్న వారు పొగ వల్ల ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించగా కొందరు చికిత్స పొందుతూ మరణించారు.
అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్ కూడా సహాయ చర్యలను పర్యవేక్షించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మొత్తానికి గురువారం అర్ధరాత్రి కల్లా మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి.
షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సయ్యద్ రఫీక్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నిద్ర పట్టడం లేదా... అయితే ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి
- ఈ దేశంలో ప్రజలు పన్నులు కట్టనవసరం లేదు.. విద్య, వైద్యం పూర్తిగా ఉచితం.. ఎక్కడో తెలుసా-
- పాకిస్తాన్-లో రాజకీయ సంక్షోభం- దాయాది దేశం ఇప్పుడు అత్యంత ప్రమాదకర కూడలిలో ఉందా-
- జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన పవన్ కల్యాణ్.. కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- తెలంగాణ- పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








