హత్యలు చేసి సమాధులు కట్టే ‘రూత్‌లెస్ గాడ్ ఫాదర్’

30 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ మాఫియా డాన్

ఫొటో సోర్స్, EPA/POLICE HANDOUT

    • రచయిత, లౌరా గోజీ, డేవిడ్ జిగ్లియోన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఇటలీ మోస్ట్ వాంటెడ్ మాఫియా బాస్ మతేయో మెసినా డినారో 30 ఏళ్ల తర్వాత సిసిలీలో పోలీసులకు చిక్కాడు.

సిసిలీ రాజధాని పాలెర్మోలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో క్యాన్సర్ చికిత్స కోసం వచ్చిన అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నోటోరియస్ కోసా నోస్ట్రా మాఫియాకు అతను బాస్‌గా ఉండేవాడని ఆరోపణలున్నాయి. ఆ మాఫియా గ్యాంగ్ మోసాలు, డ్రగ్స్ దందా, మనీ లాండరింగ్ వంటి పలు అక్రమాలకు పాల్పడేది.

పలు హత్యలు చేసినందుకు 2002లో అతనికి యావజ్జీవ శిక్ష పడింది. కానీ, ఆ శిక్షల నుంచి డినారో తప్పించుకుని తిరుగుతున్నాడు.

డినారోను అరెస్ట్ చేసేందుకు 100 మందికి పైగా సాయుధ దళాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

30 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ మాఫియా డాన్

ఫొటో సోర్స్, Reuters

‘ రూత్‌లెస్ గాడ్ ఫాదర్’

డినారోను కరుడుగట్టిన మాఫియా డాన్‌గా చూస్తుంటారు.

‘ఆయనకొక రూత్‌లెస్ గాడ్‌ఫాదర్’ అని సీనియర్ జర్నలిస్టు ఆండ్రియా పుర్గాటోరీ అన్నారు. ఆయన చంపిన వారితో ఒక స్మశాన వాటిక నిండిపోయిందని చెబుతారు.

మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రాసిక్యూటర్లు జియోవాని ఫాల్కోన్, పౌలో బోర్సెలినోలను 1992లో హత్య చేశాడు.

మిలాన్, ఫ్లోరెన్స్, రోమ్‌లలో 1993లో బాంబు దాడులకు పాల్పడ్డాడు.

మాఫియా నుంచి బయటికి వచ్చి ప్రభుత్వ ఇన్‌ఫార్మర్‌గా మారిన ఒక వ్యక్తి 11 ఏళ్ల కొడుకుని కిడ్నాప్ చేసి, హింసించి, హత్య చేశాడు.

బాధితులను హత్యలు చేసిన తర్వాత వారిని సమాధి చేస్తూ మెసినా డినారో గొప్పగా భావించేవాడు.

కోర్లియాని క్లాన్ అనే మాఫియా గ్యాంగ్‌కు హెడ్‌గా ఉండే టోటో రీనా నుంచి మెసినా డినారో మాఫియా డాన్‌గా ఎదిగాడు. టోటో రీనా కూడా 23 ఏళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగి 1993లో అరెస్టయ్యాడు.

మత్తెవో మెసినా డినారో 1993 నుంచి కనిపించకుండా పోయాడు. అతని కింద స్థాయి వ్యక్తులకి ఈ సీక్రెట్ లొకేషన్ల నుంచే తన ఆదేశాలు జారీ చేసేవాడు. ఇతని కోసం 30ఏళ్లుగా పోలీసులు వెతికారు.

ఇతన్ని గుర్తించేందుకు వారి వద్ద అతని ముఖానికి చెందిన కొన్ని స్కెచ్‌లు, అతని వాయిస్ రికార్డింగ్‌కు చెందిన కొన్ని ఆడియో టేపులు మాత్రమే ఉన్నాయి.

మెసినా డినారోను పట్టుకునేందుకు అతనికి సన్నిహితులుగా ఉన్న వారందర్ని కూడా ఇటాలియన్ ఇన్వెస్టిగేటర్లు మానిటర్ చేశారు.

ఇలా అతని సోదరి పట్రిజియా, ఇతర సన్నిహితులను ఇటలీ పోలీసులు 2013లో అరెస్ట్ చేశారు.

‘‘అతన్ని పట్టుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇతర మాఫియా లీడర్ల మాదిరిగా, అతని చుట్టూ వేలాది మంది అసిస్టెంట్లతో కనీసం చేరుకునేందుకు వీలు లేని నెట్‌వర్క్ ఉంటుంది’’ అని ఇటలీలోని సీనియర్ జర్నలిస్ట్ ఆండ్రియా బీబీసీకి తెలిపారు.

కోసా నోస్ట్రా మాఫియా గ్యాంగ్ చేసిన అత్యంత హై ప్రొఫైల్ నేరాలకు చెందిన సమాచారం, పేర్లు అతనికి తెలుసుంటాయని న్యాయవాదులు, ఇన్‌ఫార్మర్లు భావిస్తున్నారు.

న్యాయవాదులు ఫాల్కోన్, పౌలో బోర్సెలినోలను చంపిన బాంబు దాడులకు చెందిన సమాచారం కూడా అతనికి తెలుసుంటాదని అనుమానిస్తున్నారు.

మాఫియా బాస్ మెసినా డెనారోను అరెస్ట్ చేసిన వార్తలు చూసి ఇటాలియన్ ప్రజలు సోమవారం ఉదయం టీవీలకు అతుక్కుపోయారు.

దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో కూడా మాఫియాను నిరోధించగలమనే దానికి సంకేతంగా అతన్ని అరెస్ట్ నిలవనుంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ప్రభుత్వానికి ఎలాంటి పట్టు లేదు.

30 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ మాఫియా డాన్

ఫొటో సోర్స్, EPA/CARABINIERI HANDOUT

మెసినా డినారోను ఏ సమయంలో అరెస్ట్ చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఉదయం పూట క్లినిక్‌పై దాడి ఎలా బయటికి వచ్చింది, 30 ఏళ్లుగా పోలీసుల కంటపడకుండా ఉన్న మెసినా డినారో సిసిలీలో ఎలా తిరుతున్నారనే విషయాలపై పూర్తిగా అస్పష్టత నెలకొందని ఎస్సెక్స్ యూనివర్సిటీ క్రిమినాలజీ ప్రొఫెసర్ అన్న సెర్జి అన్నారు.

మెసినా డినారో క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నాడని, అంటే అతను తీవ్ర అస్వస్థతకు గురై ఉంటాడని ప్రొఫెసర్ అన్నారు.

అతనికి చెందిన అసోసియేట్లలో ఎవరో ఒకరు అతని సమాచారాన్ని లీక్ చేసి ఉంటారని ఆమె భావిస్తున్నారు. ఈ మాఫియా కింగ్ ఇక వారికి పనికి రారని, అతని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఇలా చేసుంటారని తెలుస్తోంది.

డినారో గురించి వేగుల నుంచి తాము సమాచారం పొందామన్న వార్తలను కరబినేరి(మిలిటరీ పోలీసులు) సోమవారం మధ్యాహ్నం పత్రికా సమావేశంలో ఖండించారు. ఈ మాఫియా బాస్‌ను పట్టుకునేందుకు ఇన్వెస్టిగేటర్లు చాలా కష్టపడ్డారని, ఎంతో సీక్రెట్‌గా తాము ఈ ఆపరేషన్‌ను చేపట్టినట్టు తెలిపారు.

తనని పట్టుకునేందుకు ఆపరేషన్ జరుగుతుందని తెలిసినప్పటికీ మెసినా డినారో తప్పించుకునేందుకు ప్రయత్నించలేదని అధికారులు తెలిపారు. మిలిటరీ పోలీసులు తన వద్దకు చేరుకోగానే వారు వెతుక్కుతుంది అతనినే అని ఒప్పుకున్నట్లు చెప్పారు.

ఇన్నేళ్ల పాటు తప్పించుకు తిరిగిన మెసినా డినారో చూడటానికి చాలా హుందాగా, ఆకర్షణీయంగా, ఖరీదైన వస్త్రాలతో కనిపించినట్లు వారు తెలిపారు. ‘‘మేము కనీసం ఆయన నిరాశ, నిస్పృహతో ఉన్నట్టు గుర్తించలేదు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని కనుగొన్నట్టు అనిపించింది’’ అని అన్నారు.

మెసినా డినారోను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు అతని చేతికి 35 వేల యూరోల విలువైన గడియారాన్ని పెట్టుకుని ఉన్నాడని కరబినేరి ఆర్ఓఎస్ స్పెషల్ ఫోర్స్‌ యూనిట్‌కి చెందిన జనరల్ పాస్క్వెల్ ఏజెలోసాంటో అన్నారు.

30 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ మాఫియా డాన్

ఫొటో సోర్స్, EPA/PRESIDENZA DEL CONSIGLIO HANDOUT

గత మూడు దశాబ్దాలుగా ఇటలీలో చాలా ప్రాంతాల్లో మెసినా డినారో ఎవరికీ కనిపించకుండా దాకున్నాడని, ఇటీవల సిసిలీకి వచ్చాడని పాలెర్మో ప్రాసిక్యూటర్ జనరల్ మారిజియో డి లుసియా రిపోర్టర్లతో అన్నారు.

అరెస్ట్ తర్వాత, సాయుధ దళాలకు అన్ని రాజకీయ వర్గాల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి.

మెసినా డినారో అరెస్ట్ చారిత్రాత్మకమైన విషయమని, ఇతని అరెస్టుతో ఇటలీలో 10 మంది ప్రాణాలను బలిగొన్న 1993 బాంబు దాడుల విచారణకు తగినంత సమాచారం లభించే అవకాశం ఉందని మాజీ ప్రాసిక్యూటర్ జనరల్, జడ్జి గియాన్ కార్లో కేసెల్లి అన్నారు.

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)