ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌కు క్లీన్ చిట్.. పార్టీ చేసుకున్నంత మాత్రాన అనుమానించలేమన్న న్యాయమూర్తి
సనా తన ప్రవర్తనతో దేశ ప్రతిష్ట, భద్రతకు భంగం కలిగించారని అప్పట్లో అనేక మంది ఫిర్యాదు చేశారు. కానీ, సనా తన చర్యను సమర్థించుకున్నారు.
లైవ్ కవరేజీ
టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ ఎవరు? చంద్రబాబు నాయుడు ‘చివరి ఎన్నికలు’ అస్త్రం ఆయనదేనా?
హైదరాబాద్‌లో కార్ రేసులు: స్ట్రీట్ రేసింగ్, ఫార్ములా ఈ రేస్..
పాడైపోయిన అవయవాలు మళ్లీ పుట్టుకొచ్చాయి.. కుష్టువ్యాధి బ్యాక్టీరియాతో శాస్త్రవేత్తల ప్రయోగాల్లో నిర్ఘాంతపరిచే ఫలితాలు
సూర్యకుమార్ యాదవ్ ‘వీడియో గేమ్ ఇన్నింగ్స్’.. అంతర్జాతీయ టీ20ల్లో రెండో సెంచరీ
విజయనగరం జిల్లా: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కి ఫిట్స్.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థి మృతి, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, UGC
నడుస్తున్న ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో, అదుపు తప్పిన బస్సు ఢీ కొట్టి ఏడవ తరగతి విద్యార్థి మృతి చెందాడు.
అలాగే ఒక ఇంటిని ఢీ కొట్టడంతో ఆ ఇంటిలో ఉన్న ఒక మహిళకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సంఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.
శృంగవరపుకోట డిపో నుంచి విజయనగరం బయలుదేరిన బస్సు, ధర్మవరం సమీపంలోకి రాగానే బస్సు డ్రైవర్ నాయుడుకు ఆకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి.
దాంతో బస్సు అదుపు తప్పిడంతో రోడ్డుపై వెళ్తున్న ఏడవ తరగతి విద్యార్థి అభిషేక్ ని ఢీ కొట్టింది.
అదే క్రమంలో ఆ పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకుని వెళ్లింది. ఆ ఇంటి గోడ, అక్కడున్న ఒక మహిళపై పడటంతో ఆమెకు తీవ్రగాయాలైయ్యాయి.
వీరిద్దని సుంగరపాడు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ మరణించగా.. ఇంటి గోడపడి గాయపడిన మహిళ చికిత్స పొందుతున్నట్లు ఎస్. కోట ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.
మరణించిన అభిషేక్ తండ్రి గోవింద్. అతడు ఆటోడ్రైవర్ గా పని చేస్తున్నారని స్థానికులు చెప్పారు.
ప్రమాద విషయం తెలుసుకుని ఎస్. కోట ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ అక్కడికి చేరుకున్నారు.
ఫిట్స్ ఉన్న వ్యక్తికి డ్రైవింగ్ ఎలా అప్పగిస్తారంటూ స్థానికులు నిలదీశారు.
అయితే 15 రోజుల క్రితమే అతను ఫిట్ నెస్ సర్టిఫికేట్ సమర్పించాడని, అతనికి గతంలో ఫిట్స్ వచ్చిన విషయం తనకి తెలియదని మీడియాకు డిపో మేనేజర్ రమేష్ చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 43 మంది ఉన్నారని, వారంతా క్షేమంగా ఉన్నారని డిపో మేనేజర్ రమేష్ చెప్పారు.
డ్రైవర్ ఆర్జీ నాయుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఫిట్స్ ఉన్న ఆర్జీ నాయుడుకు డ్రైవింగ్ విధులు ఎలా అప్పగించారన్న దానిపై విచారణ జరిపిస్తామన్నారు.
‘చంద్రుడి మీద మనుషులు జీవించే రోజు ఎంతో దూరంలో లేదు...’
జ్ఞాపకశక్తి: ఏం తింటే పెరుగుతుంది, ఎలాంటి ఆహారాలతో దెబ్బతింటుంది?
వాతావరణ మార్పులను తట్టుకుని, ప్రకృతితో కలిసి జీవించడం ఎలా?
మోదీ గ్లోబల్ లీడర్ అవుతున్నారా, అమెరికా ఎందుకు పొగడ్తల వర్షం కురిపించింది?
శ్రద్ధా, అఫ్తాబ్‌ల మధ్య సంబంధాల గురించి ఇరుగుపొరుగు వారు ఏం చెబుతున్నారు?-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
ట్రంప్ ట్విటర్ అకౌంట్‌ను పునరుద్ధరించిన ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Reuters
ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్.. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్విటర్ అకౌంట్‌ను పునరుద్ధరించారు.
దీనికిముందు.. ట్రంప్ అకౌంట్‌ను పునరుద్ధరించాలా వద్దా అంటూ ట్విటర్‌లో మస్క్ ఒక పోల్ నిర్వహించారు. పునరుద్ధరించటానికి అనుకూలంగా స్వల్పంగా ఎక్కువ ఓట్లు వచ్చాయి.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘జనం తీర్పు చెప్పారు’’ అని మస్క్ ట్వటీ చేశారు. ఈ పోల్‌లో 1.5 కోట్ల మందికి పైగా ఓట్లు వేయగా.. వారిలో 51.8 శాతం మంది ట్రంప్ అకౌంట్ మీద నిషేధాన్ని ఎత్తివేయటానికి మద్దతిచ్చారు.
దీంతో ట్రంప్ అకౌంట్‌ను పునరుద్ధరిస్తున్నట్లు మస్క్ చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన ట్రంప్ ట్విటర్‌కు తిరిగి రాకపోవచ్చు. ‘‘ఎందుకు వెళ్లాలో నాకు కారణమేమీ కనిపించటం లేదు’’ అని ఆయన ఇంతకుముందు వ్యాఖ్యానించారు.
ట్రంప్ ట్విటర్ అకౌంట్‌ను 2021లో సస్సెండ్ చేశారు. అప్పటికి ఆయనకు కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.
ట్విటర్‌లో నిషేధించిన తర్వాత ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ను ప్రారంభించారు.
కాప్ సదస్సు: పేద దేశాల కోసం విపత్తు నిధి ఏర్పాటుకు ధనిక దేశాల అంగీకారం
‘నా ఉద్యోగం పోయింది, ఇప్పుడు నేనేం చేయాలి’-అమెరికాలో జాబ్ కోల్పోయిన భారతీయ టెక్కీల ఆవేదన
కాశీ తమిళ సంగమం ఏమిటి? ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేక రాజకీయ వ్యూహమా?
ఫసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోతున్న దేశం ఇది..
2 వేల రూపాయల నోట్లు ఏమైపోయాయి? ఈ నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందా?
2 వేల రూపాయల నోట్లు ఎందుకు కనిపించట్లేదు? ఈ నోటుని కూడా కేంద్రం రద్దు చేస్తుందా?
కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ

ఫొటో సోర్స్, facebook/OfficeOfMSR
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిని ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ చర్య తీసుకున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ జి. చిన్నా రెడ్డి తెలిపారు.
కొద్ది రోజుల కిందట మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారని వెల్లడించారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలసి దిల్లీలో అమిత్ షాతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ అయ్యారని, ఆ పార్టీలో చేరే అంశంపై చర్చలు జరిగాయని కాంగ్రెస్ చెబుతోంది.

'ఇదేం ఖర్మ' కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సిన అవసరం ఉందని లేదంటే రాష్ట్రం నష్టపోతుందని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏపీలో రివర్స్ పాలన సాగుతోందంటూ 'ఇదేం ఖర్మ' అనే పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇంత దారుణమైన, నీచమైన ప్రభుత్వం తాను ఎక్కడా చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందరినీ వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రమ అరెస్టులు చేసి, పోలీసు టార్చర్ చేసి కార్యకర్తలను, నేతలను వేధించారని వాపోయారు. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకునేది ఖాయం అన్నారు.
సిఎంకు చెందిన ఒక ఫ్లెక్సీ చినిగితే హంగామా చేసిన పోలీసులు.. తునిలో భక్తుడి వేషంలో టీడీపీ నేతపై హత్యాయత్నం చేస్తే ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, UGC
'బాదుడే బాదుడు' కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. నందిగామలో టీడీపీ కార్యక్రమానికి గతంలో ఎన్నడూ చూడనంతమంది జనం వచ్చారని,. అంత జనం వస్తే నా మీద రాయి విసిరి భయపెట్టాలి అని ప్రయత్నించారని చంద్రబాబు విమర్శించారు.
"పూలల్లో రాళ్లు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు.. మరి, పూలల్లో బాంబులు కూడా వస్తాయా?" అని ప్రశ్నించారు.
ప్రభుత్వ దాడులు, వేధింపులతో ప్రజలు విసిగిపోయారని, ఇక టీడీపీ రావాలని కట్టలు తెంచుకుని వచ్చి సంఘీభావం తెలుపుతున్నారని చంద్రబాబు అన్నారు.
కర్నూలు ప్రజలు కూడా ముక్తకంఠంతో ఒకే రాజధాని కావాలి అని నినదించినట్టు టీడీపీ అధినేత తెలిపారు.
అసత్యాలను పదే పదే చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం వైసీపీ చేస్తోందన్నారు.
ఊర్లో రౌడీకి భయపడి జనం నోరెత్తరు.. ఇప్పుడు అదే విధానంలో జగన్ ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, UGC
"ప్రాణాలు అయినా ఇస్తాను గానీ, రాష్ట్రాన్ని నాశనం కానివ్వను" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి, ఆంధ్ర ప్రదేశ్ ద్రోహి జగన్ అంటూ మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల్లో తెలుగు దేశం ఓడిపోతే, ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికీ ఉండదని బాబు అభిప్రాయపడ్డారు.
"మళ్లీ ముఖ్యమంత్రిగానే సభకు వెళతానన్నాను. అలాగే వెళతా"నంటూ మరోసారి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు. 'ఇదేం ఖర్మ' పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎన్నికల వ్యూహకర్త గా పనిచేస్తున్న రాబిన్ శర్మ వేదిక మీద కనిపించారు. ఆయన్ను తొలిసారిగా పార్టీ నేతలకు చంద్రబాబు పరిచయం చేయడం విశేషం.
