సెక్స్ కోరికలు ఎందుకు తగ్గిపోతాయి... దీనికి పరిష్కారమేంటి?

చిన్న చిన్న కారణాల వల్ల కూడా సెక్స్ కోరికలు తగ్గిపోవచ్చు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చిన్న చిన్న కారణాల వల్ల కూడా సెక్స్ కోరికలు తగ్గిపోవచ్చు
    • రచయిత, జియులియా గ్రాంచి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లిబిడో అంటే లైంగిక తృష్ణ. ఇది అందరికీ ఒకేలా ఉండదు. కొందరిలో ఎక్కువగా, కొందరిలో తక్కువగా ఉంటుంది. లైంగిక వాంఛ తక్కువ ఉండడం అన్నది ఒక సహజ సమస్య.

ప్రతి అయిదుగురు మగవాళ్ళలో ఒకరు ఈ సమస్యతో బాధ పడుతున్నారు. మహిళల్లో ఈ సమస్య ఇంతకన్నా ఎక్కువేనని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.

దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు. వ్యక్తిగతమైన లేదా వృత్తి పరమైన ఒత్తిళ్లు ఏవైనా ఇందుకు కారణం కావచ్చు. అలాగే, మహిళల జీవితంలో వివిధ దశలు గర్బం దాల్చడం, పిల్లలు పుట్టడం, పిల్లలకు పాలివ్వడం లాంటివి క్రమక్రమంగా శృంగారం మీద ఆసక్తిని తగ్గించవచ్చు.

అయితే, కామ వాంఛలు పూర్తిగా తగ్గిపోయి, సెక్స్ మీద ఆసక్తి పోతుంటే మాత్రం దానికి గల కారణాలను పరిశోధించడం అవసరం.

“శృంగారం మీద ఆసక్తి తగ్గిపోవడాన్ని గుర్తించడమే మొదటి దశ” అని బ్రెజిల్‌లోని రెసిఫ్‌ నగరంలో ఉన్న హాస్పిటల్ డాస్ క్లినికాస్‌లోని లైంగిక సమస్యల క్లినిక్ సమన్వయకర్త, బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ కార్యదర్శి, సైక్రియాటిస్టు డాక్టర్ కాటరినా డి మోరేస్ వివరించారు.

"కొన్నిసార్లు, అంగ స్తంభన సమస్య, లైంగిక సామర్ధ్యం తగ్గిపోవడం, సెక్స్‌లో సృంతృప్తి చెందలేకపోవడం వంటివి కూడా శృంగారం మీద ఆసక్తి తగ్గిపోవడానికి కారణాలు కావచ్చు. అయితే కామ వాంఛలు ఉండటానికి వీటికి సంబంధం లేదు.”

“కామ వాంఛలు తగ్గిపోయాయని వైద్యపరంగా చెప్పడానికి ఆరు నెలల పాటు అలాంటి పరిస్థితి ఉండాలి” అని ఎండో క్రైనాలజిస్టు డీగో ఫొన్సెకా చెబుతున్నారు.

“ఒక వ్యక్తిలో సెక్స్ వాంఛ తగ్గిందని వైద్యపరంగా తేల్చడం కాస్త కష్టమే, అయితే అదే సమయంలో పేషంట్ల వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకోవడం ముఖ్యం“ అని బ్రెజిల్‌లోని మారిస్కా రిబీరో ఉమెన్స్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న వైద్య నిపుణుడొకరు చెప్పారు.

కామ వాంఛలో మార్పులకు కారణాల గురించి నిపుణులతో మాట్లాడి ఈ కింది నాలుగు అంశాలను రూపొందించడం జరిగింది.

శృంగారం మీద ఆసక్తి తగ్గుతోందా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, శృంగారం మీద ఆసక్తి తగ్గుతోందా

1. దైనందిన జీవితంలో మార్పులు, జీవితంలో వివిధ దశలు

చిన్న చిన్న కారణాల వల్ల కూడా సెక్స్ వాంఛలు తగ్గిపోవచ్చు. జీవితంలో ఏదో ఒక దశలో ఒత్తిడి, అలసట, దైనందిన జీవితంలో మార్పులు, రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు, ఇంకా ఏవైనా అనుకోని పనులు ఎదురైనప్పుడు సెక్స్ మీద కోరిక తగ్గిపోతుంది. పిల్లల మీ ధ్యాస కూడా ఇందులో భాగం కావచ్చు.

ఇదేమీ జబ్బు కాదు. చాలా కాలంగా ఒకే భాగస్వామి కావడం లాంటివి కూడా శృంగారం మీద వ్యామోహం తగ్గడానికి కారణం కావచ్చు. అయితే స్త్రీ, పురుషులలో స్పందనలు, సెక్స్ మీద ఆసక్తి లాంటివి ఎప్పుడూ ఉంటాయని కాటరినా చెప్పారు.

లైంగిక చర్యలో సంతృప్తి ఉన్నంత కాలం శృంగారం మీద ఆసక్తి తగ్గడం అనేది జబ్బేమీ కాదు.

2. మానసిక సమస్యలు

నిరాశ, ఆందోళన లాంటి మానసిక సమస్యలు కూడా శృంగార కోరికలపై ప్రభావం చూపుతుంది.

“మానసిక ఆందోళనలతో బాధ పడే రోగుల్లో మెదడులో రసాయనిక చర్యల ప్రభావం వల్ల శృంగారం మీద అంతగా ఆసక్తి చూపరు. ఆందోళన వల్ల మనుషుల్లో శృంగారాన్ని ప్రేరేపించేలా మెదడు విడుదల చేసే సెరటోనిన్, డోపమైన్ అనే హార్మోన్లు కూడా మారిపోతాయని” సైక్రియాటిస్ట్ ఒకరు చెప్పారు.

“ఇలాంటి కేసులలో చికిత్స తీసుకోవడం వల్ల కోరికలు పెరగడమే కాకుండా తరచుగా సెక్సులో పాల్గొంటారు.”

అయితే, ఆందోళన, నిరాశ లాంటివి తగ్గడానికి తీసుకునే మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల శృంగారం మీద ఆసక్తి తగ్గిపోవచ్చు.

ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు వైద్య నిపుణుల దగ్గర చికిత్స విధానాలు, వ్యూహాలు ఉన్నాయి. మందుల్ని మార్చడం, డోసేజ్ తగ్గించడం, రోజువారీ వ్యాయామంతో ఈ పరిస్థితిని మార్చుకోవచ్చు.

స్త్రీలైనా, పురుషులైనా ఆందోళనకు సంబఁధించిన లక్షణాలను గుర్తించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఆందోళనకు చికిత్స తీసుకోకుంటే అది శృంగార కోరికలు, సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది. అలాగే సైక్రియాటిస్టుల దగ్గర చికిత్స తీసుకునేటప్పుడు దాన్ని హఠాత్తుగా నిలిపివేయడం కూడా సమస్యల్ని పెంచుతుంది.

“పేషంట్లు తమకున్న లైంగిక సమస్యలు, ఇతర అంశాల గురించి వైద్యులకు పూర్తి వాస్తవాలు వివరించడం, వారితో సమస్యల గురించి చర్చించడం మంచిదంటున్నారు సైక్రియాటిస్టులు.

3. హార్మోనల్ మార్పులు

స్త్రీ, పురుషుల్లో మానసిక సమస్యలు ఏమీ లేకున్నా సెక్స్ మీద ఆసక్తి తగ్గితే హార్మోనల్ మార్పుల గురించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

లైంగికపరమైన కోరికలు పెరగడానికి, శృంగారంలో సంతృప్తి చెందడానికి స్త్రీలలో ఈస్ట్రోజన్, పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్లు కీలకం అని సావో కేమిలో ఆసుపత్రిలో ఎండోక్రైనాలజిస్టు కెరోలిన్ క్యాస్ట్రో వివరించారు.

స్త్రీ జననాయవయవాల టిష్యూ ఆరోగ్యం, యోని సరళత, మానసిక సంతుష్టి ఈస్ట్రోజెన్‌పై ఆధారపడి ఉంటుంది.

అలాగే, పురుషుల్లో వీర్య ఉత్పత్తికి, జనానాయవయాల చర్మపు పొరల ఆరోగ్యానికి టెస్టోస్టిరాన్‌కు సంబంధం ఉంది. ఈ హార్మోన్ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. సెక్స్ పట్ల ఆసక్తి, ప్రేరణను పెంచుతుంది.

అయితే వీటికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వైద్యపరంగా వాటిన గుర్తించడం చాలా కష్టం అంటున్నారు డీగో ఫొన్సెకా.

ఉదారహరణకు పురుషులనే తీసుకుంటే, వారిలో మేము కేవలం టెస్టోస్టిరాన్ లెవల్స్‌ తగ్గడాన్ని మాత్రమే అంచనా వెయ్యలేం. దాంతో పాటు హార్మోన్లలో మార్పులు రావడానికి పేషంటులో ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూడాలి.

గర్భధారణ, ప్రసవానంతర పరిస్థితులు, పిల్లలకు పాలివ్వడం, ఒబేసిటీ లాంటివి కూడా హార్మోన్లలో మార్పులకు కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.

“ఇలాంటి రోగులకు మందులు ఇవ్వడం, శరీరంలో మార్పుల గురించి అవగాహన కల్పించడం లాంటివి చెయ్యడం ద్వారా వారిలో శృంగారం మీద ఆసక్తి పెంచవచ్చు. అయితే ఇదీ అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. ఒక్కో వ్యక్తిని బట్టి ట్రీట్‌మెంట్ మారవచ్చు. ఆ వ్యక్తిఆరోగ్య పరిస్థితి, జీవనశైలిని బట్టి వైద్యం అందించాల్సి ఉంటుందని” కెరొలోనా క్యాస్ట్రో చెప్పారు.

వైద్యుల సూచనలతోనే ఔషధాల వాడకం మంచిది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వైద్యుల సూచనలతోనే ఔషధాల వాడకం మంచిది

4. వయసు పెరిగే కొద్దీ వచ్చే వ్యాధులు

శృంగార కోరికల మీద ప్రభావం చూపే మరో అంశం వయసు పెరగడం. వయసు, వయసు పైబడడం వల్ల వచ్చే వ్యాధులు లైంగిక వాంఛలపై ప్రభావం చూపిస్తాయి.

నాడీ సంబంధిత జబ్బులు, పక్షవాతం, వెన్నెముకకు గాయాలు, నరాల బలహీనత లాంటివి కూడా సెక్స్ కోరికలను నియంత్రిస్తాయి. ఇలాంటి జబ్బుల వల్ల అంగం గట్టి పడటం, సంభోగంలో సంతృప్తి లేకపోవడం, లైంగిక ఉద్రేకం కలగకపోవడం లాంటి సమస్యలు తలెత్తవచ్చు.

హార్మోనల్ మార్పుల వల్ల వచ్చే మధుమేహం కూడా సెక్స్ కోరికల్ని తగ్గించి వేస్తుంది. దీని వల్ల అలసట పెరిగి, నరాల పటుత్వం తగ్గుతుంది. దీంతో శృంగారంలో పాల్గొన్నప్పటికీ సంతృప్తి ఉండదు. దీంతో క్రమేపీ ఆసక్తి తగ్గిపోతుంది.

హృదయ సంబంధ సమస్యలున్నవారు త్వరగా అలసిపోతారు. వీరిలో గుండె రక్తాన్ని వేగంగా పంప్ చెయ్యలేదు. తరచుగా వచ్చే అలసట వల్ల శృంగారం మీద ఆసక్తి ఉండదు. దీంతో పాటు హృదయ సంబంధ వ్యాధులకు వాడే ఔషధాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌ కూడా సెక్స్ మీద, సెక్సులో పాల్గొనాలనే కోరిక మీద ప్రభావం చూపుతాయి.

ఒకరికొకరు నిజాయితీగా చెప్పుకోవాలి

పురుషుల్లో కామ వాంఛ పెంచడానికి సత్వర పరిష్కారాలు ఏమీ లేవని వైద్యులు చెబుతున్నారు.

ప్రతీ కేసు కూడా దేనికదే ప్రత్యేకం అని, వ్యక్తుల జీవనశైలి మీద ఆధారపడి ఉంటుందని, వారి వ్యక్తిగత అలవాట్లను కూడా దృష్టిలో పెట్టుకుని చికిత్స చేయాలంటున్నారు.

దంపతులకు సంబంధించినంత వరకూ సెక్స్ మీద ఆసక్తి తగ్గిపోవడం తమ భాగస్వామితో ఓపెన్‌గా చర్చించడం మంచిందని సూచిస్తున్నారు.

“కాస్త అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఇలాంటి సమస్య దంపతుల్లో ఎవరికి ఎదురైనా బహిరంగంగా, నిజాయతీగా చర్చించడం తప్పనిసరి. శృంగార వాంఛ తగ్గడం గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల అపార్ధాలు తొలగిపోతాయని ఒకరి పరిస్థితిని మరకొరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని” డీగో ఫొన్సెకా చెప్పారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)