ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూత... అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు

వాణీ జయరాం

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు.

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని నివాసంలో వాణీ జయరాంను చనిపోయిన స్థితిలో గుర్తించినట్లు థౌజండ్ లైట్స్ పోలీసు అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికిగానూ ఆమెకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును అందుకోకముందే ఆమె మృతి చెందారు.

చెన్నైలోని నుంగంబాక్కంలోని తన ఇంట్లో పడిపోవడంతో వాణీ జయరామ్ మరణించినట్లు ఆమె స్నేహితులు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

19 భాషల్లో 10 వేలకు పైగా పాటలు

వాణీ జయరాం 1945లో తమిళనాడులోని వేలూరులో జన్మించారు. దాదాపు 5 దశాబ్దాల పాటు తన స్వరంతో ప్రేక్షకులను అలరించారు. సినిమా పాటలతో పాటు భక్తి గీతాలు, ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ ఎన్నో పాటలు పాడారు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ సహా 19 భాషల్లో పదివేలకు పైగా పాటలను ఆమె పాడారు. అయిదేళ్ల వయస్సులో కడలూరి శ్రీనివాస్ అయ్యంగార్ వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. పదేళ్ల వయస్సులోనే తొలిసారి ఆలిండియా రేడియాలో పాటలు పాడారు.

1970లో గుడ్డీ చిత్రంతో ఆమె గాయనిగా పరిచయం అయ్యారు. ‘అభిమానవంతుడు’ సినిమాతో ఆమె తెలుగు సినిమాలో అరంగేంట్రం చేశారు.

అపూర్వ రాగంగళ్ , శంకరాభరణం, స్వాతికిరణం చిత్రాల్లో పాడిన పాటలకు ఆమె జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

స్వాతికిరణం సినిమాలోని "ఆనతినీయరా హరా" పాట ఆమెకు ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది.

వాణీ జయరాం

ఫొటో సోర్స్, Vani Jairam/fb

ఒంటరిగా నివాసం

చెన్నైలోని నివాసంలో వాణీ జయరామ్ ఒంటరిగా నివసిస్తున్నారు. ఆ ఇంట్లోనే ఆమె చనిపోయారు. పోలీసులు ఆమె ఇంటికి చేరుకొని తనిఖీలు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

‘‘అయిదు సార్లు బెల్ కొట్టినా ఆమె తలుపు తెరవలేదు’’

ఇంటి కాలింగ్ బెల్‌ను అయిదుసార్లు కొట్టినప్పటికీ ఆమె తలుపు తెరవలేదని వాణీ జయరామ్ ఇంట్లో పని చేసే మలర్కొడి చెప్పారు.

తన భర్త కూడా ఆమెకు ఫోన్ చేశారని, అప్పుడు కూడా ఎత్తలేదని మలర్కొడి తెలిపారు.

చెన్నైలోని నివాసంలో వాణీ జయరామ్ ఒక్కరే ఉంటారని ఆమె వెల్లడించారు.

‘‘10.45కు ఆమె ఇంటికి వచ్చాను. బెల్ కొట్టాను, తలుపు తీయలేదు. నాలుగైదు సార్లు కొట్టినా తీయకపోవడంతో నాకు సందేహం వచ్చింది.

మా ఆయనకు ఫోన్ చేసి మీరు ఫోన్ చేసి చూడండి అని చెప్పాను. ఆయన కూడా ఫోన్ చేస్తే తీయలేదు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాం.

ఇంట్లో కింద పడిపోయి కనిపించారు. తలకు దెబ్బ కనిపించింది. నుదురు మీద దెబ్బ ఉంది. నేను ఆమె దగ్గర పదేళ్లుగా పనిచేస్తున్నాను.

నేను ప్రతీరోజూ 10.15కు వచ్చి 12 వరకూ ఉంటాను. అనారోగ్యం కూడా ఏమీ లేదు. చాలా బాగున్నారు. పద్మభూషణ్ అవార్డు రావడంతో చాలామంది వచ్చిపోతున్నారు. చాలా ఫోన్లు వస్తుంటే మాట్లాడుతుంటారు. బాగానే ఉన్నారు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటున్నారు’’ అని ఆమె వివరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)