జమున కన్నుమూత, హైదరాబాద్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచిన అలనాటి నటి

జమున కన్నుమూత

అలనాటి అందాల నటి జమున తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 86 ఏళ్ళు.

నటిగా, దర్శకురాలిగా, రాజకీయ నేతగా బహుముఖంగా రాణించిన జమున హైదరాబాద్‌లోని స్వగృహంలో ఈ ఉదయం కన్నుమూశారు. ఇటీవల కోవిడ్‌ వ్యాధికి గురై కోలుకున్నారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించిందని వార్తలు వచ్చాయి.

జమున భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకురానున్నారు.

పదహారేళ్ళ వయసులో డాక్టర్ గరికపాటి రాజారావు పుట్టిల్లు సినిమాతో జమున తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఈ సినిమా 1953లో విడుదలైంది.

తెలుగు సినిమా సత్యభామగా పేరు పొందిన జమున అగ్రనటులు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వంటి వారితో కలిసి నటించారు. మిస్సమ్మ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.

వీడియో క్యాప్షన్, జనాబాయి జమునగా ఎలా మారారు?

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా జమున నటించారు.

మొత్తంగా 198 సినిమాల్లో జమున నటించారు. తెలుగులో 145 చిత్రాల్లో, తమిళంలో 20, కన్నడలో 7, హిందీలో 10 చిత్రాల్లో నటించారు.

1964, 68లలో జమునకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి.

2008లో జమునకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం లభించింది.

జమున కన్నుమూత

ఫొటో సోర్స్, Vijaya Vauhuni Studios

1989 నుంచి 1991 వరకు రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా ఉన్నారు. అయితే, 1991లో జరిగిన ఎన్నికల్లో జమున ఓడిపోయారు.

1936లో ఆగస్టు 30న హంపీలో జన్మించిన జమున, ఆమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాస రావు, కౌసల్య దేవి.

ఆమె అసలు పేరు జనాబాయి. అయితే జన్మనక్షత్రం ప్రకారం ఆమె పేరులో నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో ఆమె పేరులో ‘ము’ అనే అక్షరం చేర్చి జమునగా మార్చారు.

జమున కన్నుమూత

ఫొటో సోర్స్, Vijaya Vauhuni Studios

జమున మృతిపై ప్రముఖుల సంతాపం

జమున మృతిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. వెండితెర సత్యభామగా పేరుగాంచిన ఆమె పోషించిన పాత్రలు ఆత్మవిశ్వాసానికి, మహిళా సాధికారతకు ప్రతీకలుగా ఉండేవని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

జమున మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సిఎం అన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

తెలుగు, తమిళం, కన్నడం లోనే కాకుండా హిందీ సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జమున, నటిగా కళాసేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

జమున మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

సీనియర్ హీరోయిన జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్తపై నటుడు చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. జమున బహుభాషా నటని, మాతృభాష కన్నడ అయినా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. మహానటి సావిత్రి గారితో ఆమె అనుబంధం ఎంతో గొప్పదని అన్నారు. జమున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

జమున కన్నుమూత

ఫొటో సోర్స్, Vijaya Vauhuni Studios

జమున ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని బ్రహ్మానందం అన్నారు. అందం, అభినయం కలబోసిన నటి జమున అని చెప్పారు. జమునను దేశంలోనే గొప్ప నటిగా అభివర్ణించారు.

జమున ఇక లేరనే వార్తను నమ్మలేకపోతున్నానని నటి జయసుధ అన్నారు. జమున నుంచి చాలా నేర్చుకున్నానని, ఆమె ఎన్నోఅద్భుతమైన పాత్రలు చేశారని చెప్పారు. అలనాటి తారల జీవిత విశేషాలు పుస్తక రూపంలో వస్తే, భవిష్యత్‌లో సినీ తారలు ఎన్నో నేర్చుకుంటారని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)