పద్మ అవార్డులు 2023: చినజీయర్‌కు పద్మభూషణ్... కీరవాణికి పద్మశ్రీ
భారత ప్రభుత్వం 2023 పద్మ అవార్డులను నేడు ప్రకటించింది. మొత్తం 106 పద్మ అవార్డులను ప్రకటించగా, అందులో 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 పద్మశ్రీ అవార్డులు.
లైవ్ కవరేజీ
లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
తెలుగు వారికి పద్మ పురస్కారాలు

ఫొటో సోర్స్, Chinna Jeeyar/Facebook
తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు.
శ్రీవైష్ణవానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన జీయర్‌కు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. ఇది మూడో అత్యున్నత పౌర పురస్కారం.
ఇక ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.

ఫొటో సోర్స్, GVL Narasimha Rao/Facebook
మరొక ఆధ్యాత్మికవేత్త కమలేశ్ డి పాటిల్‌కు తెలంగాణ నుంచి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. హైదరాబాద్ సమీపంలో కన్హ శాంతి వనం పేరిట 1,400 ఎకరాల్లో ఆయన యోగా కేంద్రాన్ని నడుపుతున్నారు.

ఫొటో సోర్స్, Sudha Murthy/Facebook
పద్మభూషణ్ అవార్డులు వచ్చిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, సామాజిక కార్యకర్త సుధా మూర్తి, సీనియర్ సింగర్ వాణీ జయరాం వంటి వారు ఉన్నారు.

ఇక రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించిన వారిలో ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(మరణం తరువాత), నిర్మాణ రంగంలో బాలకృష్ణ దోషి(మరణం తరువాత), వైద్యరంగంలో దిలీప్ మహలనబిస్(మరణం తరువాత), అమెరికాకు చెందిన శ్రీనివాస్ వర్ధన్ ఉన్నారు.
భారతదేశంలో ఓరల్ రిహైడ్రేషన్ థెరపీలో దిలీప్ మహలనబిస్‌ను పయనీర్‌గా చెబుతారు.
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మందికి పద్మశ్రీలు వచ్చాయి.
చిన జీయర్‌కి పద్మ భూషణ్, కీరవాణికి పద్మశ్రీ

ఫొటో సోర్స్, CHINNAJEEYAR/MMKEERAVNI/FACEBOOK
భారత ప్రభుత్వం 2023 పద్మ అవార్డులను నేడు ప్రకటించింది. మొత్తం 106 పద్మ అవార్డులను ప్రకటించగా, అందులో 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 పద్మశ్రీ అవార్డులు.
చిన జీయర్‌కు, వాణి జయరాంకు పద్మ భూషణ్ అవార్డులు రాగా, ఎంఎం కీరవాణిికి పద్మశ్రీ పురస్కారం దక్కింది.
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు
జాకీర్ హుస్సేన్, కళలు, మహారాష్ట్ర
ఎస్ఎం కృష్ణ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి
ములాయం సింగ్ యాదవ్ , ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
బాలకృష్ణ దోషి, ఆర్కిటెక్చర్, గుజరాత్
దిలీప్ మహలనబిస్, వైద్యం, వెస్ట్ బెంగాల్
శ్రీనివాస్ వర్ధన్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, అమెరికా
పద్మ భూషణ్ అవార్డు గ్రహీతల్లో ప్రముఖులు
చిన జీయర్ స్వామి, ఆధ్యాత్మికం, తెలంగాణ
సుధా మూర్తి, సామాజిక సేవ, కర్నాటక
కమలేశ్ డీ పటేల్, ఆధ్యాత్మికం, తెలంగాణ
కుమార్ మంగళం బిర్లా, వాణిజ్యం& పరిశ్రమలు, కర్నాటక
వాణి జయరాం, కళలు, తమిళనాడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీతల్లో ప్రముఖులు
బీ రామకృష్ణా రెడ్డి, సాహిత్యం & విద్య, తెలంగాణ
సంకురాత్రి చంద్రశేఖర్, సమాజ సేవ, ఆంధ్రప్రదేశ్
ఎం ఎం కీరవాణి, కళలు, ఆంధ్రప్రదేశ్
మోదాడుగు విజయ్ గుప్తా, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తెలంగాణ
సీ వీ రాజు, కళలు, ఆంధ్రప్రదేశ్
పసుపులేటి హనుమంత రావు, వైద్యం, తెలంగాణ
కోట సచ్చిదానంద శాస్త్రి, కళలు, ఆంధ్రప్రదేశ్
అబ్బారెడ్డి నాగేశ్వర రావు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆంధ్రప్రదేశ్
ప్రకాశ్ చంద్రసూద్, సాహిత్యం & విద్య, ఆంధ్రప్రదేశ్
రవీనా టాండన్, కళలు, మహారాష్ట్ర
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
క్రికెట్: మహిళా ఐపీఎల్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేసిన అంబానీ, అదానీ
పద్మ అవార్డులు 2023: ఇద్దరు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు

ఫొటో సోర్స్, ANI
భారత ప్రభుత్వం 2023 పద్మ అవార్డులను నేడు ప్రకటించింది. మొత్తం 106 పద్మ అవార్డులను ప్రకటించగా, అందులో 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 పద్మశ్రీ అవార్డులు.
ఈ అవార్డులను జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రహీతలకు అందిస్తారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
లిటరేచర్ & ఎడ్యుకేషన్ విభాగంలో తెలంగాణ ప్రొఫెసర్ బీ రామకృష్ణారెడ్డి పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు.
కాకినాడకు చెందిన సోషల్ వర్కర్ సంకురాత్రి చంద్రశేఖర్ కూడా పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
విరేచనాలకు చికిత్సగా ఓఆర్ఎస్ వినియోగాన్ని కనిపెట్టిన ప్రముఖ వైద్యుడు దిలీప్ మహలనబిస్‌కు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు.
పంజాబ్ యూనివర్సిటీలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన... పాండిచ్చేరి యూనివర్సిటీలో గొడవలు

ఫొటో సోర్స్, @NSUI
ఫొటో క్యాప్షన్, పంజాబ్ యూనివర్సిటీలో బీబీసీ డాక్యుమెంటరీ చూస్తున్న విద్యార్థులు కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ బుధవారం పంజాబ్ యూనివర్సిటీలో ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించింది.
"పంజాబ్ ఎన్ఎస్‌యూఐ చీఫ్, ఎందరో విద్యార్థులు దేశంలో ప్రజాస్వామ్యన్ని తుదముట్టిస్తున్నవారి వాస్తవాలను చూశారు" అని ఎన్ఎస్‌యూఐ ట్వీట్ చేసింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మరోవైపు, పాండిచ్చేరి యూనివర్సిటీలో డాక్యుమెంటరీ స్క్రీనింగ్ నిషేధించారు. ఎస్ఎఫ్ఐ ఈరోజు అక్కడ బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించాలని ప్లాన్ చేయగా, యూనివర్సిటీ యాజమాన్యం అడ్డుకుంది. క్యాంపస్‌లో పోలీసులను మోహరించారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, ప్రదర్శనను క్యాంపస్‌లో కాకుండా జెండర్ గేట్ వద్ద ప్రదర్శిస్తున్నట్టు ఎస్ఎఫ్ఐ పేర్కొంది.
బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో జామియా మిలియా యూనివర్సిటీ వద్ద పోలీసుల మోహరింపు
సూర్యకుమార్ యాదవ్.. 2022 ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, సూర్యకుమార్ యాదవ్ భారత స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ 2022కి గానూ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని నేడు ఐసీసీ ప్రకటించింది.
2022లో సూర్యకుమార్ యాదవ్ 31 మ్యాచ్‌లలో 46.56 సగటుతో, 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు చేశాడు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
యాదవ్‌కు ఇది మరచిపోలేని ఏడాది. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.
టీ20లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మొత్తం 68 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలతో పలు మ్యాచుల్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టీ20 ప్రపంచ కప్‌లో సుమారు 60 రన్నుల సగటుతో మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 189.68.
శుభ్‌మన్ గిల్: మ్యాచ్ మ్యాచ్‌కు దూకుడు పెంచుతున్న యువ క్రికెటర్
పఠాన్ రివ్యూ: షారుక్ ఖాన్ హిట్ కొట్టాడా
ఆస్ట్రేలియా ఓపెన్: ఫైనల్‌కు సానియా మీర్జా-రోహన్ బోపన్న జోడి

ఫొటో సోర్స్, Graham Denholm/Getty Images
ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, రోహన్ బోపన్న జోడి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
బుధవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సానియా-రోహన్ బోపన్న (భారత్) జంట 6-7 (5-7), 7-6 (7-5), 10-6తో నీల్ స్కూప్క్సీ (బ్రిటన్)-దెసీరా క్రాజిక్ (అమెరికా) జోడీపై విజయం సాధించి ఫైనల్‌లో అడుగు పెట్టింది.
అంతకుముందు సానియా-రోహన్ జోడీకి క్వార్టర్స్‌లో వాకోవర్ లభించింది.
ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు సానియా ఇప్పటికే ప్రకటించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆర్‌ఆర్‌ఆర్: ‘‘విజయాన్ని తలకెక్కించుకోను’’- చంద్రబోస్

ఫొటో సోర్స్, ANI
ఆర్ఆర్‌ఆర్ సినిమా కోసం తాను రాసిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుల బరిలో నిలవడంపై సినీ గేయ రచయిత చంద్రబోస్ హర్షం వ్యక్తం చేశారు.
‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది.
ఈ సందర్భంగా వార్తా సంస్థ ఏఎన్‌ఐతో చంద్రబోస్ మాట్లాడారు.
‘‘విజయాన్ని నేను తలకు ఎక్కనివ్వను. ఆస్కార్ నామినేషన్స్ జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్ చేరడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.
తెలుగు సినిమా, పాటలు గ్లోబల్ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నాటు నాటు పాట స్థాయి వెనుక మా టీమ్ సమష్టి కృషి ఉంది.
ప్రపంచస్థాయిలో గుర్తింపు రావడం చాలా పెద్ద విషయం. ఆస్కార్ అనే గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెడుతుంది.
ప్రస్తుతం ఆనందంతో మేఘాల్లో తేలుతున్నా. మార్చిలో జరిగే ఆస్కార్ వేడుక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నా’’ అని చంద్రబోస్ వ్యాఖ్యానించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బ్రేకింగ్ న్యూస్, లఖీంపూర్ ఖేరీ: ‘రైతుల్ని కారుతో గుద్ది చంపిన కేసు’లో ఆశిష్ మిశ్రాకు మధ్యంతర బెయిల్

ఫొటో సోర్స్, PRASHANT PANDEY/BBC
లఖీంపూర్ ఖేరీ హింస కేసులో నిందితుడైన ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు ఎనిమిది వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఆశిష్ మిశ్రాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు... సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినా లేదా విచారణను ఆలస్యం చేయడానికి యత్నించినా బెయిల్‌ను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
దీనికంటే ముందు అలహాబాద్ హైకోర్టు, ఫిబ్రవరిలో ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చింది. దాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది.
2021 అక్టోబర్ 3నఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, లఖీంపూర్ ఖేరీ జిల్లా పర్యటనను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన ప్రదర్శనలు చేశారు.
ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు చనిపోయారు.
అనంతరం జరిగిన హింసాకాండలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘పఠాన్ సినిమాను వ్యతిరేకించం’’- విశ్వ హిందు పరిషత్

ఫొటో సోర్స్, CREDIT - YRF PR
షారూక్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి వస్తున్నారు.ఆయన నటించిన పఠాన్ సినిమా బుధవారం (జనవరి 25) థియేటర్లలో విడుదలవుతోంది.
ఈ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాట విడుదలైనప్పటి నుంచి ఇది వార్తల్లో నిలిచింది. అనేక హిందూ సంస్థలు, సినిమా విడుదలను వ్యతిరేకిస్తూ మాట్లాడాయి.
ఈ సినిమాను తాము బహిష్కరించబోమని తాజాగా విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది.
‘‘పఠాన్ సినిమాను వీహెచ్‌పీ వ్యతిరేకించదు. గతంలో మేం రేకెత్తించిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు సరైన మార్పులు చేశారు. సినిమా చూసిన తర్వాత ఏదైనా అభ్యంతరకరంగా అనిపిస్తే అప్పుడు దాన్ని వ్యతిరేకించడంపై పునరాలోచన చేస్తాం’’ అని వీహెచ్‌పీ ప్రతినిధి శ్రీరాజ్ నాయర్ అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
‘బేషరం రంగ్’ పాటలో దీపికా పదుకొణె ధరించిన దుస్తుల రంగుపై వివాదం మొదలైంది.
మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, భజరంగ్ దళ్, వీహెచ్‌పీ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
దీని తర్వాతసెన్సార్ బోర్డు సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా కోరింది. దాని ఆధారంగా మార్పులు జరిగాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుజరాత్: 2002 అల్లర్ల కేసులో 22 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 మందిని సాక్ష్యాలు లేని కారణంగా మంగళవారం పంచమహల్ జిల్లా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
2002లో గుజరాత్‌లో జరిగిన మత అల్లర్లకు సంబంధించిన కేసులో ఇద్దరు పిల్లలతో సహా మైనారిటీ వర్గానికి చెందిన 17 మందిని చంపినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.
డిఫెన్స్ న్యాయవాది గోపాల్‌సిన్హ్ సోలంకి మాట్లాడుతూ, న్యాయమూర్తి హర్ష్ త్రివేది నేతృత్వంలోని అదనపు సెషన్స్ కోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న 22 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. వీరిలో 8 మంది కేసు విచారణ సమయంలో మరణించారు.
దెలోల్ గ్రామంలో ఇద్దరు చిన్నారులు సహా మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందిని హత్య చేసిన కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిందని సోలంకి తెలిపారు.
బాధితులను 2002 ఫిబ్రవరి 28న చంపి, సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో వారి మృతదేహాలను కాల్చివేసినట్లు ప్రాసిక్యూషన్ వాదించింది.
2002 ఫిబ్రవరి 27న పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణం సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీని తగులబెట్టారు. దీంతో 59 మంది యాత్రికులు మరణించారు. వీరిలో అయోధ్య నుంచి తిరిగి వస్తోన్న కరసేవకులే ఎక్కువ ఉన్నారు.
ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మతపరమైన అల్లర్లు చెలరేగాయి.
ఈ అల్లర్లలో వెయ్యి మందికి పైగా మరణించినట్లు అంచనా వేశారు.
డెలోల్ గ్రామంలో హింసాకాండ తర్వాత హత్య, అల్లర్లకు సంబంధించి ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అయితే, ఈ ఘటన జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత మరో కేసు నమోదు చేసి అల్లర్లకు పాల్పడిన 22 మందిని అరెస్టు చేశారు.
నిందితులకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాలను సేకరించలేకపోయిందని, సాక్షులు కూడా సహకరించలేదని సోలంకి చెప్పారు.
ఈ అల్లర్లలో బాధితుల మృతదేహాలు ఇప్పటివరకు లభ్యం కాలేదని డిఫెన్స్ న్యాయవాది తెలిపారు.
హలో ఆల్, గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.