‘అక్కినేని, తొక్కినేని’ అన్న నందమూరి బాలకృష్ణ... రగులుతోన్న వివాదం

బాలకృష్ణ

ఫొటో సోర్స్, YoutubeScreengrab

వీరసింహా రెడ్డి సినిమా విజయోత్సవంలో నందమూరి బాలకృష్ణ మాటలు వివాదానికి కారణం అయ్యాయి.

ఆ సమావేశంలో సుమారు అరగంట సేపు మాట్లాడిన నందమూరి బాలకృష్ణ, చివర్లో ఒక్కొక్కరి గురించి చెబుతూ తన నిర్మాతలను చేయి పట్టుకుని ముందుకు లాగి మాట్లాడారు. 

ఆ క్రమంలో ‘‘ఈయన ఉన్నాడంటే ఎప్పుడూ కూర్చుని శాస్త్రాలు.. నాన్న గారు.. డైలాగులు.. ఆ రంగా రావు.. ఈ అక్కినేని తొక్కినేని.. అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం..’’ అని అన్నారు బాలకృష్ణ.

దీంతో ఎస్వీ రంగా రావు, అక్కినేని నాగేశ్వర రావులను బాలకృష్ణ అవమానించారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపించాయి.

బాలకృష్ణ

ఫొటో సోర్స్, YouTube Screengrab

అయితే ఆయన ఫ్లోలో అన్నాడు తప్ప అవమానించే ఉద్దేశం కాదంటూ సమర్థించే పోస్టులు కూడా మొదలయ్యాయి. ఆ క్రమంలో కొందరు బాలకృష్ణ పేరును ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.

ఈ క్రమంలో అక్కినేని నాగ చైతన్య ఈ అంశంపై స్పందించడం వేడిని పెంచింది.

‘‘నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్వీ రంగా రావులు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవ పరచడం అంటే మనల్ని మనమే కించపరుచుకోవడం’’ అని నాగ చైతన్య ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

అక్కినేని అఖిల్ కూడా ట్విటర్‌లో ఈ విషయంపై స్పందించారు. నాగచైతన్య తరహాలోనే అఖిల్ ట్వీట్ చేశారు.

‘‘ఏఎన్ఆర్ లివ్స్ ఆన్’’ అనే హ్యాష్ ట్యాగ్ తో వారు ఈ పోస్టు షేర్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

మరోవైపు ఇదే సందర్భంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఇతర హీరోల అభిమానులు కూడా బాలకృష్ణ పేరును, గతంలో బాలకృష్ణ పలువురిపై చేయి చేసుకున్న వీడియోలను ట్విట్టర్లో వైరల్ చేశారు.

బాలకృష్ణ గతంలో మహిళలపై మాట్లాడిన మాటలు, వివిధ సందర్భాల్లో చేయి చేసుకున్న వీడియోలు, యన్టీఆర్ పదవి దిగిన సందర్భం, ఆయన ఇంట్లో కాల్పుల ఘటనల అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

ఈ అంశంపై అక్కినేని ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ సర్వేశ్వర రావు కూడా ట్వీట్ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు.

సర్వేశ్వర రావు

‘‘బాలకృష్ణ ఇలా వేదికపై మాట్లాడడం అహంకార పూరిత అవలక్షణంగా భావించాల్సి ఉంటుంది. మీ నాన్నకు అన్యాయం చేసి అధికారం లాక్కుంటే... ఈ రోజుకూ ఒక కొడుకుగా ఏమీ చేయలేని నీ హీరోయిజం ఏమిటని మేం ప్రశ్నించవచ్చు. కానీ, మా అక్కినేని ఫ్యాన్స్ కి ఆ సంస్కారం ఉంది. అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పకపోతే, ఫ్యాన్స్ అసోసియేషన్ చేసే విభిన్న కార్యక్రమాలకు మీరు బాధపడాల్సి వస్తుంది’’ అంటూ ప్రకటించారు అక్కినేని ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ సర్వేశ్వర రావు. 

అయితే, సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇతర ప్రముఖులు ఎవరూ దీనిపై స్పందించలేదు. 

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)