వీరసింహారెడ్డి: అరుపులు.. కేకలు.. ఈలలు.. గోలలు.. అమెరికా థియేటర్లను హడలగొడుతున్న తెలుగు సినిమా ‘సంస్కృతి’

ఫొటో సోర్స్, Mythri Movie Makers/Facebook
- రచయిత, ఆర్కే
- హోదా, బీబీసీ ప్రతినిధి
అరుపులు.. కేకలు.. ఈలలు.. గోలలు..
తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లో బొమ్మ పడితే చాలు.. అభిమానులకు పూనకాలు లోడ్ అవుతాయి.
ఇక సినిమా రిలీజ్ రోజు.. తొలి షోకు ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. తెలుగులో ‘స్టార్ల’ సంఖ్య ఎక్కువ. ఆ ‘స్టార్ల’కు ఉండే అభిమానగణం కూడా ఎక్కువే.
విడుదల రోజు.. థియేటర్ బయట భారీ కటౌట్లకు అభిషేకాల దగ్గర నుంచి లోపల తెర మీద అభిమాన హీరోకు కాగితాలతో కుంభాభిషేకం చేసే వరకు రచ్చరచ్చ చేస్తుంది అభిమానగణం.

ఫొటో సోర్స్, YouTube/Global Studios
‘అబ్బా.. ఏం కొట్టావ్ అన్నా.. అదీ దెబ్బ..
ఇరగతీశావ్ అన్న.. కుమ్మేశావ్.. కెవ్వు కేక..’
ఇలా అభిమానుల అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఈ హోరు ముందు డాల్బే డీటీఎస్ అయినా దిగదుడుపే.
అన్న నడిచొస్తే మాస్.. అన్న నుంచుంటే మాస్.. అన్న లుక్కేస్తే మాస్.. ఇలా తెరమీద అన్న ఏం చేసినా అభిమానులకు మాసే.
డైలాగ్ చెబితే ఈలలు కొడతారు.. స్టెప్ వేస్తే గోల చేస్తారు.. పంచ్ ఇస్తే పూనకాలు వచ్చి ఊగిపోతారు.
నిమిషం కూడా సీట్లలో కుదురుగా కూర్చొరు. కొందరు థియేటర్లోనే టపాసులు పేలుస్తారు. ఇంకొందరు తెర దగ్గర నిలబడి చిందులు వేస్తారు. అభిమానం అనే ‘డోసు’ ఇంకా ఎక్కువైతే థియేటర్లో సీట్లు విరుగుతాయ్. సినిమా వేసే తెరలు చినుగుతాయ్.
‘పెద్ద హీరోల’ సినిమాల విడుదల ఉంది అంటే థియేటర్‌లో కొన్ని సీట్లు అయినా విరగడమనేది సాధారణంగా జరిగేదే. తెరలు చిరగడం, థియేటర్లలో టపాసులు కాల్చడం వల్ల మంటలు చెలరేగడం కూడా చూశాం.
సంక్రాంతి వంటి పండగలకు ‘స్టార్ల’ సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతుంటే అభిమానుల రియాక్షన్ ఒక రేంజ్‌లో ఉంటుంది. బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్ల దగ్గర నుంచి అరుపులు, కేకల వరకు ప్రతిదానిలోనూ అభిమానుల మధ్య పోటీనే.

ఫొటో సోర్స్, AKSHAY TELUGU VLOGS/YouTube
రూరల్ ఏరియాలు.. వైజాగ్, విజయవాడ, వరంగల్ వంటి పట్టణాల్లో ఈ ట్రెండ్ బాగా కనిపిస్తుంది. వీటినే ‘సి’ సెంటర్లు అంటారు. హైదరాబాద్‌లోనూ ఒకప్పుడు చాలా థియేటర్లు ‘సి’ సెంటర్లుగానే ఉండేవి. ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వంటివి అందుకు పెట్టింది పేరు.
నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు చెప్పే ‘మాస్’ సినిమాలు తీసేది ఈ ‘సి’ సెంటర్ ప్రేక్షకుల కోసమే.
ఇప్పుడంటే మల్టిప్లెక్స్‌లు వస్తుండటంతో థియేటర్లలో విడుదల రోజు జరిగే అభిమానుల హడావుడి కాస్త తగ్గింది. హైదరాబాద్‌తోపాటు చాలా పట్టణాల్లో నేడు మల్టిప్లెక్సులు వస్తున్నాయి.
మల్టిప్లెక్సుల్లో చూసే ప్రేక్షకులు ‘మౌనం’గా ఉంటారనే పేరు ఎలాగూ ఉంది. ఇక కోట్లు పోసి కట్టే థియేటర్లలో అభిమానులు సీట్ల మీదకు ఎక్కి చిందులు వేస్తానంటే యాజమాన్యాలు ఒప్పుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు.
హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉండే సంధ్య థియేటర్ వద్ద కనిపించే కటౌట్లు, ఫ్లెక్సీలు పంజాగుట్టలోని పీవీఆర్ వద్ద కనిపించవు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆగిన సినిమా షో
తెలుగు సినిమా అభిమానులు గర్వంగా చెప్పుకొనే సినిమా ‘సంస్కృతు’ల్లో ఈ ట్రెండ్ కూడా ఒకటి. ఇప్పుడు ఈ ‘సంస్కృతి’ ఖండాలు దాటి అమెరికాలో అడుగుపెట్టినట్లుగా కనిపిస్తోంది.
బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అమెరికాలోని వర్జీనియాలోనూ రిలీజ్ చేశారు. ఆ సినిమా చూడటడానికి వెళ్లిన తెలుగువారిలో కొందరు సినిమా అభిమానులు థియేటర్లలో గోల చేయడంతో షో ఆపివేసినట్లు వార్తలు వచ్చాయి.
అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థియేటర్ నిండా కాగితాలు పడిఉన్నట్లుగా వీడియో చూస్తే తెలుస్తోంది.
‘మీలో చాలా మంది సినిమా చూడటానికి ఇక్కడకు వచ్చారు. కానీ (షో ఆపినందుకు) నన్ను తిట్టకండి. ఎవరైతే ఇదంతా (కిందపడిన కాగితాలను చూపుతూ) చేశారో వాళ్లను తిట్టుకోండి.
ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. తెలుగు సినిమాలు, భారతీయ సినిమాలను ఇక్కడ వేయడం ఇదే తొలిసారి కాదు.
ఇంతకు ముందు కూడా (తెలుగు) సినిమాలు వేశాం కానీ ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇలా చేయడం సరికాదు.
నన్ను క్షమించండి.. దయచేసి (థియేటర్ నుంచి) బయటకు వెళ్లండి’ అని అంటున్న ఒక వ్యక్తి ఆ వీడియోలో కనిపించారు.
థియేటర్‌లో తెర మీద ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని ఒక ఫ్రేమ్ కనిపిస్తోంది. మాట్లాడిన తీరును బట్టి ఆయన, థియేటర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన వ్యక్తిగా అనిపిస్తోంది.
ఆ వ్యక్తి పక్కనే ఒక పోలీసు కూడా ఉన్నారు. ఆయన కూడా థియేటర్ నుంచి బయటకు వెళ్లమని అక్కడ ఉన్నవారితో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇలా కాగితాలు వేయడం సరికాదంటూ అమెరికాలోని క్రిస్టోఫర్ కనగరాజ్ అనే జర్నలిస్టు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అయితే ఇది అమెరికాలో అంత కొత్త ట్రెండేమీ కాదు.
తెలుగు హీరోల సినిమాల విడుదలకు అమెరికాలో అక్కడి అభిమానులు సందడి చేస్తుంటారు. గతంలో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ వంటి నటుల సినిమాల విడుదల సందర్భంగా కారు ర్యాలీలు చేపట్టారు.
బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా విడుదల సందర్భంగా కూడా ఆయా దేశాల్లో సందడి కనిపించింది. కారు ర్యాలీలు, కేకులు కట్ చేయడాలు వంటి వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- స్వామి వివేకానంద: గోరక్షకుడిని అంటూ భిక్షకు వచ్చిన వ్యక్తిని ఏమని ప్రశ్నించారు?
- ‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
- నాటు నాటు సాంగ్‌కు దక్కిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రత్యేకలేంటి ?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














