భర్తను చంపి ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన భార్య... అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, ANI
శ్రద్ధ వాల్కర్ హత్య కేసు తరహాలో దిల్లీలో మరో కేసు వెలుగులోకి వచ్చింది.
అంజన్ దాస్ అనే వ్యక్తిని హత్య చేశారనే ఆరోపణలపై ఆయన భార్య, సవతి కుమారుడులను దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
‘‘వీరిద్దరూ అంజన్ దాస్‌ను హత్యచేసి, అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఫిడ్జ్‌లో పెట్టారు. ఆ తర్వాత నగరంలోని భిన్న ప్రాంతాల్లో వాటిని పారేశారు’’అని పోలీసులు వెల్లడించారు.
మెహ్రౌలీలోని శ్రద్ధ వాల్కర్ హత్య కేసుతో ఈ కేసును సోషల్ మీడియాలో పోలుస్తున్నారు. శ్రద్ధను కూడా ఇలానే ఆమెతో సహజీవనం చేసిన అఫ్తాబ్ అనే వ్యక్తి 35 ముక్కలు కోసి, నగరంలోని భిన్న ప్రాంతాల్లో విసిరేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తాజా కేసులో ఏం జరిగింది?
అంజన్ దాస్ హత్య కేసుపై దిల్లీ పోలీసులు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు.
‘‘జూన్ 5న ఒక వ్యక్తి శరీర భాగాలు రామ్‌లీలా మైదాన్‌లో కనిపించాయి. ఆ తర్వాత రెండు కాళ్లు, రెండు తొడలు, ఒక చేయి భాగం కూడా పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ తర్వాత మరికొన్ని శరీర భాగాలు కూడా సమీపంలో వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఒక ఎఫ్ఐఆర్‌ను పోలీసులు నమోదుచేశారు. మొదట ఆ శరీర భాగాలు ఎవరివో గుర్తుపట్టడం పోలీసులకు కష్టమైంది. దీని కోసం పోలీసులు చాలా శ్రమించారు. దీని కోసం చాలా పోలీసుల బృందాలు పనిచేశాయి’’అని దిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ విభాగం డీసీపీ అమిత్ గోయల్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భార్య, కుమారుడిపై అనుమానం..
అంజన్ దాస్ కనిపించడంలేదని ఎలాంటి ఫిర్యాదూ దాఖలు చేయకపోవడంతో ఆయన భార్య పూనమ్, కుమారుడు దీపక్‌లపై అనుమానం కలిగినట్లు డీసీపీ తెలిపారు.
‘‘సీసీటీవీ ఫుటేజీలోనూ వీరిద్దరూ కనిపించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాం. ఆ తర్వాత వీరిద్దరూ ఆ నేరాన్ని అంగీకరించారు’’అని ఆయన వివరించారు.
హత్య చేసే సమయంలో నిందితులు వేసుకున్న బట్టలను కూడా తాము వీరి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
‘‘ఆ బట్టలు వేసుకునే సీసీటీవీ ఫుటేజీలో నిందితులు కనిపించారు. మరోవైపు మృతిచెందిన వ్యక్తి ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నాం’’అని అమిత్ గోయల్ వివరించారు.
ఎందుకు ఇలా?
‘‘అంజన్ దాస్ 2011 నుంచి పూనమ్‌తో కలిసి జీవిస్తున్నారు. వీరిద్దరికీ 2017లో పెళ్లి జరిగింది. ఇదివరకు కుల్లు అనే వ్యక్తితో ఆమె జీవించేవారు. 2016లో ఆయన మరణించారు. ప్రస్తుతం అరెస్టయిన దీపక్ ఆయన కుమారుడే. అయితే, దీపక్‌కు పెళ్లి అయిన తర్వాత వేరే ఇంటికి వెళ్లిపోయారు’’అని పోలీసులు చెప్పారు.
‘‘అంజన్ దాస్ బిహార్‌లోనూ మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. అయితే, పూనమ్ బంగారు నగలను అమ్మేసి ఆ డబ్బులను అక్కడకు ఆయన పంపించేవారు. ఆయన పెద్దగా సంపాదించేవారు కాదు. అన్నింటికీ పూనమ్‌పైనే ఆధారపడేవారు. దీంతో వారి కుటుంబంలో గొడవలు అయ్యేవి’’అని గోయల్ వివరించారు.
‘‘దీపక్ భార్యను కూడా అంజన్ దాస్ తప్పుడు ఉద్దేశంతో చూసేవారని పూనమ్ భావించేవారు. దీంతో పూనమ్, దీపక్ కలిసి అంజన్‌ను హత్య చేశారు. ఇంట్లోనే మద్యం ఇచ్చి ఆయన్ను హత్య చేశారు. అతడిని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టి నగరంలోని భిన్న ప్రాంతాల్లో విసిరేశారు’’అని గోయల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులోళ్ల దగ్గరకు ఎలా వెళ్లాయి’
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- విప్ప సారా: బ్రిటిషర్లు నిషేధించిన ఈ భారతీయ మద్యం అంతర్జాతీయంగా ఆదరణ పొందగలదా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















