జింబాబ్వే: కాలి బొటనవేలు రూ. 30 లక్షలు - సోషల్ మీడియాలో కనిపిస్తున్నది నిజమేనా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చియగాజీ ఎన్‌వాన్వు
- హోదా, బీబీసీ న్యూస్, లాగోస్
జింబాబ్వే ప్రజలు పేదరికం నుంచి బయటపడేందుకు అవయవాలు అమ్ముకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాలి వేళ్లకు బాగా డిమాండ్ ఉన్నట్లు కొన్ని వాట్సాప్ గ్రూప్ చాట్స్ చూస్తుంటే అర్థమవుతోంది.
జింబాబ్వే ప్రజలు డబ్బు కోసం కాలి వేళ్లు అమ్ముకుంటున్నారనే వార్తలు... నైజీరియా, యుగాండ వంటి ఆఫ్రికా దేశాల సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
దక్షిణాఫ్రికాకు చెందిన సంప్రదాయ వైద్యులు కాలి బొటనవేలుకు 40 వేల డాలర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ కొన్ని వాట్సాప్ సందేశాలు కనిపిస్తున్నాయి. 40 వేల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 31 లక్షలు. నైజీరియా కరెన్సీలో చెప్పాలంటే సుమారు 1.66 కోట్ల నైరాలు. వాళ్లు చెబుతున్న ప్రకారం ఇది ఒక కాలి బొటనవేలు ధర.
అలాగే కాలి మధ్య వేలుకు 25 వేల డాలర్లు(రూ.19 లక్షలు), చిటికెన వేలుకు 10 వేల డాలర్లు(రూ.7.76 లక్షలు) అంటూ ధరలు కట్టి కొందరు ప్రచారం చేస్తున్నారు.
జింబాబ్వే రాజధాని హరారేలోని ఒక షాపింగ్ సెంటర్‌లో కాలి వేళ్లను కొనుగోలు చేసే వ్యాపారం జరుగుతున్నట్లు కొన్ని బ్లాగ్ పోస్టులలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
శరీరంలోని భాగాలతో వైద్యం
ఆఫ్రికా దేశాల్లో కొందరు సంప్రదాయ వైద్యం పేరిట చేసే చికిత్సల్లో శరీరంలోని భాగాలను వాడటం కొత్తేమీ కాదు. మంత్రాలు, తంత్రాలతో రోగాలను నయం చేస్తామని చెప్పుకునేవారిని.. 'సంగోమస్' అని పిలిచే మరొక వర్గం నాటు వైద్యులు వ్యతిరేకిస్తారు. ఈ 'సంగోమస్' నాటు వైద్యులను ప్రజలు గౌరవంగా చూస్తారు.
కానీ ఇలా కాలి వేళ్ల కోసం రూ.30 లక్షలు, రూ.20 లక్షల ఇస్తామనేది నమ్మశక్యంగా లేదంటున్నారు కొందరు.
ఇందుకు సంబంధించిన మీమ్స్, అక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఎంతో బాధాకరమైన ఈ విషయం మీద ఇలా కామెడీగా మీమ్స్ చేయడం సరికాదని మరికొందరు అంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అయితే జింబాబ్వేలో కాలి వేళ్ల వ్యాపారం గురించి అక్కడి ప్రధాన పత్రికలు కథనాలు ఏమీ రాయలేదు. ఈ ఏడాది మే 28న గంబాక్వే అనే బ్లాగులో రాసిన దాని ప్రకారం జింబాబ్వే రాజధాని హరారేలోని జీమెక్స్ మాల్‌లో కాలి వేళ్ల వ్యాపారం జరుగుతోంది.
ఆ తరువాత కొద్ది రోజులకు కరెన్సీని అక్రమంగా మారకం చేసే కొందరు వ్యాపారుల ఇంటర్వ్యూను హెచ్-మెట్రో అనే టాబ్లాయిడ్ ప్రచురించింది. తమలోని కొందరు దీని మీద సోషల్ మీడియాలో జోక్స్ వేయడం వల్లే సమస్య మొదలైందని వారు చెప్పారు. నాటి నుంచి కాలి వేళ్ల వ్యాపారం గురించి ఎంక్వైరీలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. జీమెక్స్ మాల్‌కు చాలా మంది రావడం కూడా పెరిగిందని అంటున్నారు.
జింబాబ్వే ప్రజలు వేల డాలర్లకు తమ కాలి వేళ్లను అమ్ముకుంటున్నట్లు కెన్యాలోని ఒక రేడియో స్టేషన్ కూడా ట్వీట్ చేసింది. కానీ ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు.
కాలికి కొన్ని వేళ్లు లేని ఫొటోలను @InnocentZikky అనే నైజీరియా ట్విటర్ హ్యాండిల్ షేర్ చేశారు. కాలి వేళ్లు అమ్మారు లేదా అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్న రెండు వీడియోలను బీబీసీ డిజిన్ఫర్మేషన్ పరిశీలించింది. కానీ అవి నిజమైనవిగా కనిపించడం లేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే డబ్బుల కోసం కాలి వేళ్లు అమ్ముకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కూడా పూర్తిగా అబద్ధమని కొట్టిపారేయలేం. ఎందుకంటే సోషల్ మీడియా ట్రెండ్స్ వాస్తవ సంఘటనలకు ఎంతో కొంత దగ్గరగా ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
అయితే నైజీరియాలో డబ్బు కోసం క్షుద్ర పూజలు చేసే వర్గాలను ఈ వార్తలు బాగా ఆకర్షిస్తున్నాయి. క్షుద్ర పూజల కోసం మనుషులను చంపి వారి అవయవాలను ఈ గ్రూపులు తరలిస్తుంటాయి. ఈ ఏడాది జనవరిలో ఇలా ఒక టీనేజీ అమ్మాయిని చంపారనే ఆరోపణలతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి:
- Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- Service Charge: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీ అంటే ఏంటి? బలవంతంగా వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
- ‘ఒక అమ్మాయి పరువు కోసం’ 200 ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉంటున్న ఎడారి గ్రామం.. ఏం జరిగిందంటే..
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- అంబేడ్కర్ పుట్టిన గడ్డపై ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినప్పుడు ఎందుకంత హింస చెలరేగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












