కీయెవ్ వీధుల్లో నాటు బాంబులు తయారు చేస్తున్న యుక్రెయిన్ మహిళలు

యుక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతోంది. రష్యా దళాలు దాడి చేస్తూ ముందుకు సాగుతున్నాయి. యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగరంలో పోరాటం వీధుల్లోకి వచ్చింది.

రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా దాడి మొదలైన మూడవ రోజు కీయెవ్‌లో గస్తీ కాస్తున యుక్రెయిన్ సైనికులు. ఆ నగర మేయర్ విటాలి క్లిట్ష్కో, స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి 26న 17:00 గంట నుంచి ఫిబ్రవరి 28న 08:00 వరకు కర్ఫ్యూ ప్రకటించారు.
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైదాన్ స్క్వేర్ వద్ద వీధుల్లో గస్తీ తిరుగుతున్న యుక్రెయిన్ బలగాలు
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యెవ్ రక్షణ కోసం ఆయుధం చేపట్టిన యుక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు స్వియాతోస్లావ్ యురాష్ (26)
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్ సభ్యులు మోలోటోవ్ కాక్‌టెయిల్ సిద్ధం చేస్తున్నారు.

గాజుసీసాలో పెట్రోల్, ఆల్కాహాల్ లాంటి మండే ద్రవాలను పోసి, కొంత మోటర్ ఆయిల్ కూడా కలుపుతారు. దీన్నే మోలోటోవ్ కాక్‌టెయిల్ అంటారు.

చేతి బాంబులు తయారు చేస్తున్న యుక్రెయిన్ మహిళ

సీసాలోంచి బయటకు వేలాడేటట్టుగా ఒక గుడ్డ ముక్కను అందులో ఉంచుతారు. లోపల ఉన్న ద్రవాన్ని మెల్ల మెల్లగా గుడ్డ పీల్చుకుంటుంది. గుడ్డ ముక్క రెండో చివర మంట పెడితే ఈ మోలోటోవ్ కాక్‌టెయిల్ పేలుడు పదార్థంలా పనిచేస్తుంది.

ఇవి తయారుచేసుకోవడం సులభం కావడంతో క్రిమినల్స్, అల్లర్లకు పాల్పడేవారు, టెర్రరిస్టులు, ఒక్కోసారి ఆయుధ సామాగ్రి తక్కువగా ఉన్నప్పుడు ఆర్మీ కూడా వీటిని ఉపయోగిస్తుంది.

రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కీయెవ్ సమీపంలో రష్యా క్షిపణి దాడికు దెబ్బతిన్న పెట్రోలియం నిల్వల డిపో నుంచి చెలరేగుతున్న మంటలను చూస్తున్న యుక్రెయిన్ సైనికుడు, ఆయన పెంపుడు కుక్క
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, ANADOLU AGENCY / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కీయెవ్‌లోని జులియానీ విమానాశ్రయం సమీపంలో ఒక అపార్ట్‌మెంట్ భవనాన్ని శనివారం ఉదయం క్షిపణి ఢీకొట్టింది.
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భవనాన్ని తాకిన క్షిపణి.. రాయిటర్స్ నిఘా ఫుటేజీ
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈ భవనంలో కనీసం అయిదు అంతస్తులు ధ్వంసమయ్యాయి
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సేవల సిబ్బంది
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బాంబు పేలిన అపార్ట్మెంట్ బ్లాకులో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, ANADOLU AGENCY / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పౌరులను తరలిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య "బయట పడుతోందని" అధికారులు తెలిపారు.
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, ANADOLU AGENCY / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ముగ్గురు పిల్లలు సహా మొత్తం 198 మంది యుక్రెయినియన్లు మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రి విక్టర్ లియాష్కో తెలిపారు.
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వైమానిక దాడి సైరన్ వినిపించడంతో, దెబ్బతిన్న అపార్ట్మెంట్ భవనం సమీపంలో దాక్కుంటున్న పౌరులు
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, ANADOLU AGENCY / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రాజధాని కీయెవ్‌లో తుపాకీతో సిద్దంగా ఉన్న యుక్రెయినియన్ సైనికుడు
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, ANADOLU AGENCY / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, శనివారం కీయెవ్‌లోని జులియానీ నుంచి తరలిపోతున్న పౌరులు
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సోమవారం ఉదయం పశ్చిమాన ఒక మెయిన్ రోడ్డుపై జరిగిన దాడిని తిప్పికొట్టినట్టు యుక్రెయినియన్ ఆర్మీ తెలిపింది.
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, రష్యా దాడిలో ధ్వంసమైన వాహనాలను పరిశీలిస్తున్న యుక్రెయినియన్ సాయుధ దళాలు
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రష్యా దళాలు నగర రక్షణను పర్యవేక్షిస్తున్నప్పుడు వీధుల్లో కూడా పోరాటం సాగింది.
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, రాజధానిలో బాంబు దాడి హెచ్చరికలు జారీ చేసిన తరువాత షెల్టర్‌లో భయంగా కూర్చున్న పౌరులు
రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ముందు రోజు రాత్రంతా జరిగిన బాంబు దాడుల వలన శనివారం ఉదయం కీయెవ్‌లో వ్యాపించిన పొగ
ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)