యుక్రెయిన్‌లో కారుపైకి ఎక్కిన రష్యా యుద్ధ ట్యాంక్
యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో కారు మీదికి రష్యన్ యుద్ధ ట్యాంకు ఎక్కడంతో కారు నుజ్జనుజ్జయింది.
ఆ సమయంలో కారును నడుపుతున్న వృద్ధుడు అందులో చిక్కుకుపోగా స్థానికులు రక్షించారు.
మరోవైపు రష్యా దాడులలో 210 మందికి పైగా పౌరులు మరణించారని, 1,100 మందికి పైగా గాయపడ్డారని యుక్రెయిన్ ప్రభుత్వ అధికారి ల్యూడిమిలా డెనిసోవా చెప్పారు.
"ఊహకందని క్రౌర్యంతో శత్రుసేనలు జనావాసాలు, హాస్పిటళ్లు, పాఠశాలల మీద దాడులు చేస్తున్నాయి. యుక్రెయిన్ గడ్డ మీద పుట్టిన ప్రజల జీవించే హక్కును ధ్వంసం చేస్తున్నాయి" అని ఆమె ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
చిన్నపిల్లలు కూడా ఈ దాడుల్లో చనిపోతున్నారని చెప్పిన డెనిసోవా, కీయెవ్ ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఒక చిన్నారి, ఖార్కియెవ్ నగరంలోని ఓ భవనం మీద జరిగిన దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ఈ నేరాలకు రష్యాను తీవ్రంగా శిక్షించాలని ఆమె అన్నారు.
"ఈ దారుణ వాస్తవాలను యుక్రెయిన్ నోట్ చేస్తోంది. వాటిని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలోని మిలటరీ ట్రిబ్యునల్‌కు నివేదిస్తాం" అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




