అరబ్ దేశాల శృంగార సాహిత్యంలో ఏముంది?
శృంగార సాహిత్యం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మన మనసులో కొన్ని ప్రత్యేక పేర్లు మెదులుతాయి. లోలితా, లేడీ చాటర్లీస్ లవర్.. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే లాంటి కథలు మనకు గుర్తొస్తాయి.
సెక్స్ గురించి అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తకాన్ని భారత్‌లో రాశారు. అదే వాత్సాయనుడి కామసూత్ర.
సంస్కృతంలో రాసిన ఈ గ్రంథం.. మొత్తం ప్రపంచంలోనే అత్యుత్తమ లైంగిక విజ్ఞాన సాహిత్యంగా పేరు సంపాదించింది.
సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బార్టన్ ఈ కామసూత్రను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనువాదాలు పాపులర్ అయ్యాయి.

ఫొటో సోర్స్, Alamy
అయితే, ఇప్పుడు మనం కామసూత్ర గురించి చెప్పుకోవడం లేదు.ఈ రోజు మనం అరబ్ దేశ శృంగార సాహిత్యం గురించి చెప్పుకుందాం. శృంగారానికి సంబంధించిన సాహిత్యం, అది కూడా అరబ్ దేశాల్లో అని ఆశ్చర్యపోతున్నారా. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.
కామసూత్రను ఇంగ్లిష్‌లోకి అనువదించిన సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బార్టన్ అరబిక్‌లోని ఒక పుస్తకాన్ని కూడా అనువదించారు. ఆ పుస్తకం పేరు ద పెర్‌ఫ్యూమ్డ్ గార్డెన్. అయితే దీని అనువాద మూలం అరబిక్ కాదు. బార్టన్ దీన్ని ఫ్రెంచ్ భాష నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించారు.
ఈ పుస్తకాన్ని 15వ శతాబ్దంలో అరబ్ దేశమైన ట్యునీషియాకు చెందిన మహమ్మద్ నఫ్‌జవి రాశారు. ఈ పుస్తకంలో శారీరక బంధాలు ఏర్పరుచుకునే ఎన్నో పద్ధతులను వివరంగా చెప్పారు.కామసూత్ర అనగానే, సాధారణంగా అందరూ ఇది లైంగిక ప్రక్రియలో భంగిమల గురించి వివరించే పుస్తకం అని భావిస్తారు. కానీ, ఈ పుస్తకం మహిళల హక్కుల గురించి నొక్కి చెబుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పుస్తకం ప్రకారం సెక్స్ అనే హక్కు పురుషుడిదే కాదు.. ఇందులో మహిళకు కూడా సమాన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే వారి హక్కులను నిర్లక్ష్యం చేయకూడదని చెబుతుంది.మరో మాటలో చెప్పాలంటే.. సెక్స్ విషయంలో మహిళల ఆత్మవిశ్వాసం ఇనుమడింపజేయడం గురించి చెబుతుంది కామసూత్ర.
దీనికి భిన్నంగా, ద పెర్‌ఫ్యూమ్డ్ గార్డెన్ పుస్తకంలో... శారీరక బంధాలను ఆస్వాదించడం గురించి చర్చించారు. దాంతోపాటు... సెక్స్ చేసే పద్ధతుల గురించి కథల ద్వారా ఈ పుస్తకంలో వివరించారు.
ఈ కథలను అలిఫ్ లైలా రాసిన విధానంలోనే రాశారు. అది పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది.
స్వలింగ సంపర్కం గురించి కూడా ద పెర్‌ఫ్యూమ్ గార్డెన్లో పెద్ద ఎత్తునే చర్చించారు. బర్టన్ తన రచనల్లో 21 చాప్టర్లు కేవలం దాని గురించే రాశారు.
ఈ రోజుల్లో అరబ్ దేశాల్లో సెక్స్ ప్రస్తావన రాకుండా చూసుకుంటున్నప్పటికీ, ఒకప్పుడు అరబ్ దేశాల్లో సెక్స్ ఆసక్తిని పెంచే పుస్తకాలకు ధార్మిక గుర్తింపు ఉండేదని అరబిక్ సాహిత్య నిపుణులు సారా ఇర్విన్ చెప్పారు.
కానీ ఇప్పుడు 'ద పెర్‌ఫ్యూమ్డ్ గార్డెన్' లాంటి పుస్తకాలను ఆ దేశాల్లో సైతాన్ పుస్తకాలుగా చూస్తున్నారు. అరబ్ దేశాల్లో సెక్స్ గురించి పెద్దగా చర్చలేకపోయినా, సెక్స్ సాహిత్యానికి ఇక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది.
ఇవే కథలను హజార్ అఫ్సానే పేరుతో పార్సీ భాషలో కూడా రాశారు. కానీ, ఈ కథలన్నింటికీ ప్రధానంగా సెక్సే మూలంగా ఉంటుంది.
ఉదాహరణకు హజార్ అఫ్సానే పుస్తకంలోని ఒక కథలో హీరో.. రాజకుమారుడు షహ్రియార్. ఒకసారి భార్య తనకు ద్రోహం చేసిందని ఆ రాజకుమారుడికి తెలుస్తుంది.
దాంతో అతడు ఆమెను హత్య చేస్తాడు. ఆ తర్వాత అతడు ప్రతి రోజూ రాత్రి ఒక కన్యతో గడుపుతాడు. తెల్లారకముందే ఆమెను హత్య చేస్తుంటాడు.
ఒకరోజు మంత్రి కూతురినే అతడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ రోజు రాత్రంతా ఆమె రాజకుమారుడికి కథలు వినిపిస్తూ అతడు తనను హత్య చేయకుండా చూసుకుంటుంది.
రాజకుమారి చెప్పే కథలు షహ్రియార్‌కు ఎంతగా నచ్చుతాయంటే, ఆయన ప్రతి రాత్రీ ఆమె దగ్గర ఒక కథ విని వెళ్తాడు. అలా వెయ్యి రాత్రులు గడుస్తాయి. రాజకుమారి చివరికి షహ్రియార్‌ను తన భర్తగా గెలుచుకుంటుంది.

ఫొటో సోర్స్, iStock
షహ్రియార్ కథల సంపుటిని 'షహజాదీ కీ ఏక్ హజార్ రాత్' అనే పేరుతో చెప్పుకుంటారు.
నిజానికి, తన భార్య తనతోనే శారీరక సంబంధం పెట్టుకోవాలని షహ్రియార్ అనుకుంటాడు. అంటే ఒక మహిళతో శారీరక సంబంధం ఏర్పరచుకున్న తర్వాత పురుషుడు ఆమెను తన ఆస్తిగా భావిస్తాడు. అతడు ఆ బంధంలో ఆమెకు సమాన హక్కు ఇవ్వాలనుకోడు.
ఇప్పుడు అరబిక్ మహిళలు కూడా ఇలాంటి సాహిత్యం రాయడం మొదలుపెట్టారు. 2005లో నజ్మా పేరుతో ఒక పుస్తకం రాశారు. దానిని ఒక మహిళ రాశారు. అరబిక్ చరిత్రలో శారీరక సంబంధాల గురించి ఒక మహిళ రాసిన తొలి పుస్తకం ఇదే.
దీంతోపాటు సెక్స్‌ను శారీరక, మానసిక సుఖం ఇచ్చేదిగా భావించారు. దానికోసం కొన్ని పద్ధతులు కూడా సూచించారు. అయినప్పటికీ అరబిక్ సాహిత్యంపై వాత్సాయనుడి కామసూత్రదే పైచేయిగా ఉంది.
ఎందుకంటే ఇది శారీరక సంబంధాలు పెట్టుకోవడం గురించి మాత్రమే కాదు, మహిళల హక్కుల గురించి కూడా మాట్లాడుతుంది. అందుకేనేమో.. దీని విలువ, ప్రాధాన్యం ఇప్పటికీ తగ్గడం లేదు.
ఇవి కూడా చదవండి:
- విశాఖలో ఈ చిన్నారి విగ్రహాన్ని ముందుకొస్తున్న సముద్రం మింగేస్తుందా? -ఫోటో ఫీచర్
- మోదీ, పుతిన్‌ల స్నేహం భారత్, రష్యాల సంబంధాలను కొత్త దారి పట్టించనుందా
- దిల్లీలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు
- దేశ విభజన సమయంలో సిక్కు కుటుంబాన్ని కాపాడేందుకు లాహోర్ ముస్లిం యువకుడు ఏం చేశారంటే..
- అజాజ్ పటేల్: టెస్ట్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్ రికార్డును సమం చేసిన ముంబయి బౌలర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















