సెక్స్ డాల్స్: ఏది నైతికత?

ఫొటో సోర్స్, Xdolls
సెక్స్ డాల్స్.. లైంగిక తృప్తి కోసం మనుషులు ఉపయోగిస్తున్న ఒకరకమైన బొమ్మలు. ఒకప్పుడు వీటిని వ్యక్తిగత అవసరాలకు కొనుక్కొనే వారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సెక్స్ డాల్స్‌తో ఏకంగా వేశ్యవాటికలను తెరుస్తున్నారు. వీటిని మూసేయాలన్న తీర్మానాన్ని కౌన్సిల్ ఆఫ్ పారిస్ కొట్టేసింది. ఈ సెక్స్ డాల్స్ వ్యాపారంపై వామపక్షాలు, కొందరు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా లైంగిక ప్రక్రియ మనుషుల మధ్య జరుగుతుంది. అయితే ఇప్పుడు లైంగిక అవసరాల కోసం రోబోలు, సిలికాన్ బొమ్మలను వాడుకోవడం కూడా ప్రారంభమైంది. వీటినే సెక్స్ డాల్స్ అంటారు. స్త్రీ, పురుషుల బొమ్మలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా లైంగిక ఆనందం పొందేవారు పెరుగుతున్నారు.

ఫొటో సోర్స్, Xdolls
గంటకు రూ.7,000
పారిస్‌లో సెక్స్ డాల్స్‌తో లైంగిక వ్యాపారం చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. వేశ్యవాటికల మాదిరిగా సెక్స్ డాల్స్ కేంద్రాలు తెరచి అద్దె ప్రాతిపదికన ఈ బొమ్మలను అందుబాటులో ఉంచుతున్నారు. వీటిలో ఎక్కువగా మహిళల బొమ్మలే ఉంటాయి. లైంగిక తృప్తి కోసం పురుషులు ఇక్కడకు వస్తారు. గంటకు 109 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.7,000.
గదికో బొమ్మ..
ఫ్రాన్స్‌లో వ్యభిచారంపై నిషేధం లేదు కానీ వ్యభిచార గృహాలను నిర్వహించడం మాత్రం చట్టవ్యతిరేకం. ప్రస్తుతం సెక్స్ డాల్స్‌ను అద్దెకు పెట్టారు. అంటే గంటకు ఇంతని డబ్బులు చెల్లించి వాటి ద్వారా లైంగిక కోరికలు తీర్చుకోవచ్చు.
ఎక్స్‌డాల్స్ అనే సంస్థ పారిస్‌లో గత నెలలో ఒక కేంద్రాన్ని తెరచింది. ఇందులో మూడు గదులుంటాయి.
ఒక్కో గదిలో ఒక్కో సెక్స్ డాల్ ఉంటుంది. ఒకోదాని ఎత్తు సగటున 4 అడుగుల 7 అంగుళాలు. ఒక్కో బొమ్మ ఖరీదు లక్షల్లో ఉంటుంది.
తాము చేసే పని బయటకు తెలియకుండా ఉండేలా ఎక్స్‌డాల్స్ జాగ్రత్తలు తీసుకుంది. వారు తమ వ్యాపారాన్ని గేమింగ్ సెంటర్‌గా అభివర్ణిస్తున్నారు.

ఫొటో సోర్స్, Xdolls
పురుషులే ఎక్కువ
లైంగిక అవసరాలు తీర్చుకోవడం కోసం పురుషులే ఎక్కువగా వస్తుంటారని ఎక్స్‌డాల్స్ యజమాని జోయాచిమ్ లూస్కీ, లా పారిసన్ పత్రికకు తెలిపారు.
అప్పుడప్పుడు జంటగా కూడా వస్తుంటారని చెప్పారు. గతంలో లూస్కీ ఇ-సిగరెట్ల విక్రయ కేంద్రాన్ని నిర్వహించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
వివాదం ఎందుకు?
ఈ సెక్స్ డాల్స్ కేంద్రాలు వ్యభిచార గృహాలలాంటివేనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మహిళా సంఘాలు, వామపక్షాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి.
సెక్స్ డాల్స్‌తో లైంగిక వ్యాపారం చేయడమంటే వ్యభిచారంతో సమానమేనని వారు అంటున్నారు. ఇది మహిళలను కించపరచడమేనని ఆరోపిస్తున్నారు.
వ్యభిచారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎక్స్‌డాల్స్ వంటి కేంద్రాలు తోడ్పడతాయని, దీన్ని నిషేధించకూడదంటూ కౌన్సిల్ ఆఫ్ పారిస్ నిర్ణయించడం బాధాకరమని వామపక్ష కౌన్సిలర్లు నికోలస్ బెనెట్, హార్వే అన్నారు.
ఒక స్త్రీ, పురుషుడు మధ్య జరిగే పవిత్రమైన శృంగారాన్ని అగౌరపరిచినట్లేనని వ్యాఖ్యానించారు.
అంతకు ముందు పోలీసులు ఎక్స్‌డాల్స్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ చట్టవ్యతిరేకంగా ఏమీ జరగడం లేదని వారు నివేదిక ఇచ్చారు.
సెక్స్ డాల్స్ మహిళల గౌరవాన్ని తగ్గిస్తాయని తాను అనుకోవడం లేదని లూస్కీ అంటున్నారు.

ఫొటో సోర్స్, Xdolls
రేప్ చేయడమే
ఫ్రాన్స్‌లో ప్రతి ఏడాదీ 86,000 మంది మహిళలను రేప్ చేస్తున్నారని పారిస్ ఫెమినిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి, న్యాయవాది లారీన్ చెబుతున్నారు. ఎక్స్‌డాల్స్ అనేది సెక్స్‌ను కొనుక్కొనే ప్రాంతం కాదు. అక్కడికి వెళ్లడమంటే డబ్బు ఇచ్చి ఒక మహిళను రేప్ చేసినట్లేనని ఆమె అంటున్నారు. ఇటువంటి కేంద్రాలను మూసేయాలని ఆమె గట్టిగా వాదిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








