అజాజ్ పటేల్: టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్ రికార్డును సమం చేసిన ముంబయి బౌలర్

అజాజ్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అజాజ్ పటేల్

టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు. అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్ తరువాత ఆ అరుదైన ఘనత సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి అజాజ్ పటేల్ ఈ రికార్డు సృష్టించాడు.

న్యూజిలాండ్‌ జట్టుకు చెందిన స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ధాటికి భారత్ తొలి ఇన్నింగ్స్‌ 325 పరుగులకు పరిమితమైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అజాజ్ కన్నా ముందు ఈ ఘనత సాధించిన ఇంగ్లండ్‌ క్రికెటర్ జిమ్ లేకర్, భారత్‌కు చెందిన అనిల్ కుంబ్లే కూడా స్పిన్నర్లే.

దిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 1999 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత ఈ ఫీట్ ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యం కాలేదు.

అంతకుముందు, 1956 జూలై ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీశాడు.

ఎజాజ్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

భారత జట్టును ఆలౌట్ చేసిన ఒక్కడు

ముంబైలో జన్మించిన 33 ఏళ్ల స్పిన్నర్ అజాజ్ యూనస్ పటేల్ ఈ ఇన్నింగ్స్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లను క్లీన్ బౌల్డ్ చేశాడు. ముగ్గురిని ఎల్బీడబ్ల్యూ చేశాడు. మిగతా అయిదుగురు క్యాచౌట్ అయ్యారు.

ఈ మ్యాచ్‌లో అజాజ్ 47.5 ఓవర్లు బౌలింగ్ చేసి 119 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.

డిసెంబర్ 3 శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో 28వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ రూపంలో అజాజ్‌కు తొలి వికెట్ లభించింది. గిల్ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టేలర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అజాజ్‌ తీసిన పదో వికెట్ మహ్మద్ సిరాజ్‌ది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

శుక్రవారం తొలి టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఆ నాలుగు వికెట్లు అజాజ్ పటేల్ తీశాడు.

శనివారం రెండో రోజు ఆటమ మొదలయ్యాక లంచ్‌ సమయానికి భారత్‌ 285 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.

మయాంక్ అగర్వాల్ 146 పరుగులతో క్రీజు వద్ద పాతుకుపోయాడు. అయితే లంచ్ తర్వాత మ్యాచ్ ప్రారంభమైన వెంటనే, అజాజ్ పటేల్ తన స్పిన్‌ బౌలింగుతో భారత జట్టును చిక్కుల్లో పడేశాడు. లంచ్ తర్వాత 10 ఓవర్లలోపే భారత జట్టు ఆలౌట్ అయింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అజాజ్ పటేల్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీశాడు. కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది.

ఆ మ్యాచ్‌లో అజాజ్ పటేల్ బ్యాటింగులోనూ రాణించాడు. న్యూజిలాండ్ చివరి వికెట్ తీస్తే భారత్ గెలుపు ఖాయమనుకున్న సమయంలో అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర తమ వికెట్లు కాపాడుకున్నారు. ఈ జోడీని భారత బౌలర్లు విడదీయలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఎజాజ్ పటేల్

ఫొటో సోర్స్, ANI

జట్టులో చోటు కోసం ఎంతో కష్టపడ్డా...

అజాజ్ పటేల్ పుట్టింది ముంబైలో. కానీ, న్యూజీలాండ్‌లో స్థిరపడ్డాడు. ఆక్లాండ్ జట్టుతో తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన అజాజ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టులో ఆడి తన ప్రతిభను చాటుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

కొద్ది కాలంలోనే ఫస్ట్-క్లాస్ క్రికెటర్ అయిన అజాజ్, 2012లో అతను T20 క్రికెట్ టీమ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అయితే, 50-ఓవర్ల వన్‌డే ఫార్మాట్‌లో ఆడటానికి ఆ తరువాత మరో మూడేళ్లు వేచి ఉండాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)