1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత్ ఎలా గెలిచిందంటే...

వీడియో క్యాప్షన్, 1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత్ ఎలా గెలిచిందంటే...

భారత క్రికెట్ అభిమానుల కల తొలిసారిగా నెరవేరిన రోజు జూన్ 25. కపిల్ సేన 1983లో సరిగ్గా ఇదే రోజున క్రికెట్ ప్రపంచకప్ కైవసం చేసుకుని క్రీడాలోకంలో సంచలనం సృష్టించింది.

ఆరోజు చాలా మంది ఫైనల్లో వెస్టిండీస్‌ కచ్చితంగా గెలుస్తుందని భావించారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 183 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత సగం పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఆ మ్యాచ్‌లో కొన్ని మరపురాని సంఘటనలు జరిగాయి. అవి ఆటను భారత జట్టు వైపు మళ్లించాయి. చివరకు జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ ప్రపంచకప్‌ను ముద్దాడారు.

ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సీహెచ్ వెంకటేష్ అలనాటి మధుర క్షణాలను పంచుకుంటున్న వీడియో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)