యువతలో ఎక్కువగా వచ్చే లైంగిక వ్యాధి ఇదే.. చాలామందిలో బయటకు లక్షణాలు కనిపించవు

వీడియో క్యాప్షన్, యవతలో ఎక్కువగా వచ్చే లైంగిక వ్యాధి ఇదే

జననేంద్రియ హెర్పెస్ అనేది యువతీయువకులలో చాలా సాధారణంగా కనిపించే లైంగిక సంక్రమణ వ్యాధి (Sexually Transmitted Disease - STD).

లైంగిక సంబంధాలలో చురుకుగా పాల్గొనే యువతీయువకులలో జననేంద్రియాల హెర్పెస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ ఇన్పెక్షన్ కు రెండు రకాల హెర్పెస్‌లు( Herpes Virus) కారణం.

1) హెర్పెస్ టైప్ 1- నోటి అల్సర్లను కలుగ జేస్తుంది.

2) హెర్పెస్ టైప్ 2- జననేంద్రియాల వద్ద అల్సర్లు వస్తాయి.

చాలామందిలో ఈ హెర్పెస్ వైరస్ శరీరం లోపల ఉన్నా సరే, ఎలాంటి లక్షణాలూ ఉండవు. కానీ, వారితో ఎవరైనా లైంగికంగా కలిస్తే వైరస్ సంక్రమించే ప్రమాదం ఉంటుంది.

జననాంగాల హెర్పెస్ ఇన్ఫెక్షన్ మొదటి సారి కలిగినపుడు దానిని ప్రాథమిక ఇన్ఫెక్షన్ ( Primary Herpes ) అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)