‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది

షాహిద్ ఆఫ్రిది

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సోషల్ మీడియాలో మరోసారి వార్తల్లో నిలిచాడు.

తాలిబాన్లను షాహిద్ అఫ్రిది పొగడ్తలతో ముంచెత్తిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

తాలిబాన్లు ఈసారి సానుకూల దృక్పథంతో తిరిగి వచ్చారని వీడియోలో అఫ్రిది చెప్పాడు.

ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగటంతో ఆఫ్రిది.. బీబీసీతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.

ప్రజలు తాలిబాన్లను చూసి భయపడటానికి కారణం వారి ‘పాత ఇమేజ్’ అని ఆఫ్రిది అన్నారు.

అఫ్గానిస్తాన్ క్రికెట్‌పై ‘‘భారతదేశ పెత్తనం ఇకపై చెల్లదు. మిగతా అన్నింటిలాగే తాలిబాన్లు క్రికెట్‌నూ నియంత్రిస్తారు’’ అని కూడా ఆఫ్రిది చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పాకిస్తానీ జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ఒక వీడియోను ట్వీట్ చేశారు. దీనిలో అఫ్రిది విలేకరులతో మాట్లాడుతూ.. ''వాస్తవానికి తాలిబాన్లు సానుకూల మనస్తత్వంతో కనిపిస్తున్నారు. ఇది మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. మహిళలు పని చేయడానికి, రాజకీయాల్లోకి రావడానికి కూడా అనుమతించారు.

తాలిబాన్లు క్రికెట్‌కు మద్దతు ఇస్తున్నారు. శ్రీలంకలో ఉన్న పరిస్థితుల కారణంగా, ఈసారి సిరీస్ జరగలేదు. కానీ తాలిబాన్లు క్రికెట్‌ని చాలా ఇష్టపడతారని నాకు అర్థమైంది'' అని అఫ్రిది చెప్పారు.

దీంతో తాలిబాన్ తదుపరి ప్రధాన మంత్రిగా అఫ్రిది ఉండాలని కామెంట్ రాసి మరీ.. జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇక, అఫ్రిది వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

''అవును, అఫ్రిది మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడల్లా జట్టు కెప్టెన్ సానుకూలతను గమనిస్తే తాలిబాన్లనే గుర్తుకు తెస్తుంది. అఫ్రిదీ ఏవో అద్భుతాలు సృష్టిస్తాడని కెప్టెన్ అనుకుంటాడు. కానీ, 10 స్లార్లు అఫ్రిది ఆడితే, అందులో 9 సార్లు కెప్టెన్ మైండ్ బ్లాక్ అవుతుంది'' అని కాంగ్రెస్ పార్టీనేత అభిషేక్ సింఘ్వీ ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

దూకుడు బ్యాట్స్ మెన్ గా అఫ్రిదికి మంచి పేరుంది. ఆయన మొత్తం 398 వన్ డే మ్యాచ్‌లు ఆడాడు. దాదాపు ఎనిమిది వేల పరుగులు చేయగా, బ్యాటింగ్ సగటు మాత్రం 23.57గా ఉంది.

షాహిద్ ఆఫ్రిది

ఫొటో సోర్స్, Getty Images

''రెండు సంవత్సరాల కిందట ఆయన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించే సమయంలో బర్ఖాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలో ఆయన తన కుమార్తెలను ఎలాంటి క్రీడల్లో ఆడటానికి అనుమతించనని చెప్పాడు. ఆయన తాలిబాన్లకు భిన్నంగా ఏమీ లేడు'' అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.

''ఖచ్చితంగా, వారు అక్కడ కూడా 20-20 లీగ్ ప్రారంభించవచ్చు. తాలిబాన్ ప్రో లీగ్'' అని మరో నెటిజన్ మనీష్ ముంద్రా కామెంట్ చేశారు.

''తాలిబాన్ ప్రేమికుడు షాహిద్ అఫ్రిది బహిరంగంగా తాలిబాన్లకు మద్దతు ఇచ్చాడు. అది మానవత్వానికి, మహిళల స్వేచ్ఛకు పూర్తి విరుద్ధమైన ఉగ్రవాద సంస్థ. అఫ్రిది ఓపూర్తి స్థాయి జిహాదీ కంటే తక్కువేమీ కాదు! ఇది పాకిస్తానీ సమాజంలో తీవ్రవాదం పట్ల పెరుగుతున్న ఆసక్తికి, అనుబంధానికి ప్రతిబింబంగా చెప్పొచ్చు'' అని మేజర్ పూనియా ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

''పాకిస్థాన్ క్రికెటర్ అఫ్రిదిని చూడండి. కాబూల్‌లో తాలిబాన్ తీవ్రవాద పాలనను సమర్థిస్తున్నాడు. తాలిబాన్‌లకు క్రికెట్ పై ఉన్న ప్రేమను ఊటంకిస్తూ మహిళలను పని చేయడానికి అనుమతించే సాక్ష్యంగా భావించి అఫ్రిది ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు'' అని ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న ఒక పాకిస్తానీ మూలాలున్న జర్నలిస్ట్, రచయిత తారెక్ ఫతేహ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల, పాక్ పాలిత కశ్మీర్‌‌లో నిర్వహిస్తున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్‌కు మద్దతు తెలిపి విమర్శలపాలయ్యాడు.

బీబీసీతో అఫ్రిది ఏమన్నారంటే..

బీబీసీతో మాట్లాడుతూ.. అఫ్రిది మరోమారు తాలిబాన్లకు మద్దతును తెలిపాడు. ''మహిళలు లేకుండా సమాజం నడవలేదు'' అని తాలిబాన్లకు అర్థం అయిందని తాను అర్థం చేసుకున్నానని చెప్పాడు. వారు 'శాంతి' గురించి కూడా మాట్లాడుతున్నారని అఫ్రిది అన్నాడు.

''ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంటుందని భావిస్తున్నాను.

తాలిబాన్లు 'పగ తీర్చుకోవడం' గురించి మాట్లాడటం లేదు. శాంతిని కోరుకుంటూ మిగతా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈసారి తాలిబాన్లు మహిళలకు విద్య, ఉపాధితో సహా ప్రతి రంగంలోనూ అవకాశాలు కల్పించడం గురించి మాట్లాడుతున్నారు. అంతకు ముందు ఎప్పుడూ ఇలాంటివి కనిపించలేదు.

సమాజంలో మహిళలు ఎంత ముఖ్యమో తాలిబాన్లు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మహిళలు లేకుండా సమాజం నడవదు. మహిళలు చదువుకుంటే సమాజం కూడా విద్యలో ముందుంటుందని వారందరికీ తెలిసింది.

తాలిబాన్లు ఇటీవల చేసిన ప్రకటన ఆధారంగా వారు చాలా మారారని స్పష్టమవుతోంది'' అని అఫ్రిది పేర్కొన్నాడు.

తాలిబాన్‌ల గురించి ప్రజలు ఇంకా ఎందుకు భయపడుతున్నారని అడిగినప్పుడు, ''వారి పాత ఇమేజ్ కారణంగా'' అని షాహిద్ అఫ్రిది బదులిచ్చాడు.

''తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది, పరిస్థితులు మెరుగవుతాయి'' అని షాహిద్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)