Sumit Antil: పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం.. జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సుమిత్ అంతిల్

సుమిత్ అంతిల్

ఫొటో సోర్స్, facebook/sportsauthorityofindiaMYAS

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారతదేశానికి రెండో స్వర్ణపతకం లభించింది.

జావెలిన్ త్రో F64 విభాగంలో సుమిత్ అంతిల్ ప్రపంచ రికార్డులను తిరగరాసి, బంగారు పతకాన్ని సాధించాడు.

ఫైనల్‌లో తొలి త్రోలోనే 66.95 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పిన సుమిత్, రెండో త్రోలో తన రికార్డును తానే అధిగమిస్తూ 68.08 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు.

చివరగా ఐదో త్రోలో 68.55 మీటర్ల దూరం విసిరి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించడంతో పాటు స్వర్ణ పతకాన్ని సాధించాడు.

అవని లేఖరా/Avani Lekhara

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అవని లేఖారా

అవని లేఖారా: పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం సాధించిన తొలి మహిళా షూటర్

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్ విభాగంలో అవని లేఖారా బంగారు పతకం సాధించారు.

దీంతో పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారత మహిళగా అవని రికార్డ్ సృష్టించారు.

రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల అవని తన పదేళ్ల వయసులో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెకు నడుం కింద భాగం నుంచి చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు.

సోమవారం నాటి పోటీలలో అవని స్వర్ణం సాధించగా డిస్కస్ త్రోలో యోగేశ్ కథూనియా రజత పతకం, జావలిన్ త్రోలో దేవేంద్ర ఝంఝారియా రజతం సాధించారు.

జావలిన్ త్రో‌లోనే మరో భారత క్రీడాకారుడు సుందర్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

యోగేశ్ కథూనియా

ఫొటో సోర్స్, SAI

ఫొటో క్యాప్షన్, యోగేశ్ కథూనియా

‘డిస్కస్ త్రో’లో రజతం

మరోవైపు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్-56 పోటీలో యోగేశ్ కథూనియా రజతం సాధించారు.

యోగేశ్ 44.38 మీటర్ల దూరం విసిరి రజతం సాధించారు.

పథకాలు సాధించిన భారత క్రీడాకరులకు ప్రధాని అభినందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

‘జావలిన త్రో’లో రజతం, కాంస్యం

పురుషుల జావలిన్ త్రో(ఎఫ్-46) విభాగంలో ఇద్దరు భారతీయులు పతకాలు సాధించారు.

దేవేంద్ర ఝంఝారియా రజత పతకం సాధించగా సుందర్ సింగ్ కాంస్యం సాధించారు.

దేవేంద్ర ఝంఝారియా 64.35 మీటర్ల దూరం విసిరి రజతం సాధించడమే కాకుండా తన వ్యక్తిగత రికార్డు కూడా మెరుగుపర్చుకున్నారు.

కాంస్యం సాధించిన సుందర్ సింగ్ 64.01 మీటర్ల దూరం విసిరారు.

శ్రీలంకకు చెందిన దినేశ్ ముదియెన్సెలెగె 67.79 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించారు.

దేవేంద్ర ఝంఝారియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేవేంద్ర ఝంఝారియా

ఇంతకుముందు ఆదివారం టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ దేశానికి తొలి పతకం అందించారు. టేబుల్ టెన్నిస్ క్లాస్-4 ఫైనల్లో స్వర్ణ పతకం కోసం చైనా క్రీడాకారిణి యింగ్‌ జావోతో పోరాడిన భవీనా ఓటమిపాలయ్యారు దీంతో ఆమె రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

పురుషుల టి-47 హైజంప్‌లో నిషద్ కుమార్ రజత పతకం గెల్చుకున్నారు. వీరితో పాటు పురుషుల ఎఫ్-52 డిస్కస్ త్రో విభాగంలో వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించారు.

టోక్యో పారాలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు మూడు పతకాలు లభించాయి. సోమవారం ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం లభించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)