ప్రియుడితో రోడ్‌ ట్రిప్‌‌కు వెళ్లిన ఈ అమ్మాయి అదృశ్యమైంది, ఇప్పుడు ఈమె బాయ్‌ఫ్రెండ్ కూడా కనిపించడం లేదు

అమెరికాలో గబ్బిపెటిటా అనే యువతి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది.

ఫొటో సోర్స్, INSTAGRAM

ఫొటో క్యాప్షన్, గబ్బి పెటిటా

అమెరికాకు చెందిన 22 ఏళ్ల యువతి గబ్బి పెటిటో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దేశవ్యాప్తంగా రోడ్‌ ట్రిప్‌‌కు వెళ్లారు. కానీ, కొన్నాళ్ల నుంచి ఆమె కనిపించకుండా పోయారు.

ఆగస్టులో వ్యోమింగ్‌లోని గ్రాండ్ టెటాన్ నేషనల్ పార్క్‌ను సందర్శించిన తర్వాత నుంచి ఆమె ఆచూకీ తెలియడం లేదు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. దీంతో గబ్బి పెటిటో ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

గబ్బి పెటిటో బాయ్‌ఫ్రెండ్ బ్రియాన్ లాండ్రి మాత్రం ఒంటరిగా ఫ్లోరిడాలోని తన ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఆయనే ప్రధాన అనుమానితుడని పోలీసులు తెలిపారు.

లాండ్రీ సెప్టెంబర్ 1న ఇంటికి తిరిగి రాగా, ఆ తర్వాత పది రోజులకు పెటిటో తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెటిటో అదృశ్యంపై లాండ్రీ మాట్లాడటానికి నిరాకరించారు. ఆయనపై ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

"గబ్బి పెటిటో ఆచూకీపై ఏదైనా సమాచారం తెలిస్తే తమకు అందించాలని లాండ్రీ తోపాటూ, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం"అని నార్త్ పోర్ట్ పోలీస్ చీఫ్ టాడ్ గారిసన్ చెప్పారు.

"లాండ్రీ సహకరించకపోవడంతో ఈ విచారణకు ఆటంకం ఏర్పడుతోంది. కానీ, చివరికి సమాధానాలు దొరుకుతాయి" అన్నారు గారిసన్.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

లాండ్రీ న్యాయవాది స్టీవ్ బెర్టోలినో తన క్లయింట్ మౌనాన్ని సమర్థించారు.

"నా అనుభవంలో ఇలాంటి కేసుల్లో జంటగా ఉన్న వ్యక్తిపైనే పోలీసులు ముందు దృష్టి సారిస్తారు. నా క్లయింట్‌కు పెటిటో అదృశ్యానికి సంబంధం ఉందా లేదా అనేది తేలకుండా ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం మంచిది కాదు'' అన్నారు స్టీవ్.

ఈ విషయంలో న్యాయపరమైన సలహా మేరకే లాండ్రీ మాట్లాడటం లేదని బెర్టోలినో పేర్కొన్నారు.

''మా అమ్మాయిని చివరిసారి ఎప్పుడు చూశావు? ఆమెను ఒంటరిగా వదిలేసి ఫ్లోరిడాకు ఎందుకు వచ్చావు?'' అంటూ పెటిటో కుటుంబ సభ్యులు లాండ్రీని ప్రశ్నించారు.

''ముందు వీటికి జవాబు కావాలి'' అని కుటుంబ సభ్యులు అన్నారు. విచారణకు ఉపయోగపడే సమాచారం ఏదైనా ఉంటే అందించాలని పెటిటో తండ్రి ప్రజలను కోరారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

దేశవ్యాప్తంగా ప్రయాణం

లాండ్రీ, పెటిటో జంట తెల్లరంగు ఫోర్డ్ ట్రాన్సిట్ వ్యాన్‌లో అమెరికా వ్యాప్తంగా పర్యటించడానికి బయలుదేరింది. వీరు తమ ప్రయాణ అనుభవాలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసేవారు.

"బిగినింగ్ అవర్ వ్యాన్ లైఫ్ జర్నీ" అనే పేరుతో ప్రయాణంలో సరదాగా గడిపిన క్షణాలను యూట్యూబ్‌లో వీళ్లు వీడియో పోస్ట్‌ చేశారు. దీనికి 600,000 కంటే ఎక్కువ వ్యూస్‌ వచ్చాయి.

యువతి అదృశ్యం కావడానికి రెండు వారాల ముందు, ఆగస్టు 12న, దక్షిణ ఉటాలోని మోయాబ్ నగరం పోలీసులకు ఈ జంట మధ్య గొడవ జరిగినట్టు సమాచారం అందడంతో అక్కడి వెళ్లారు.

పోలీసు బాడీ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో ఫుటేజీని గత గురువారం విడుదల చేశారు. ఇందులో యువతి ఏడుస్తున్నట్లు, వారిద్దరూ వాదులాడుకున్నట్లు కనిపించింది.

వీడియోను రికార్డ్ చేసిన పోలీసులు రాత్రిపూట విడిగా ఉండాలని వారికి సూచించారు. దీనిపై కేసులాంటిదేమీ నమోదు చేయలేదు. తరువాత ఏం జరిగిందన్నది తెలియడం లేదు.

అమ్మాయి

ఫొటో సోర్స్, NORTH PORT POLICE

యువతి మిస్సింగ్‌ మిస్టరీని ఛేదించడానికి కావాల్సిన ఆధారాల కోసం ఈ జంట ప్రయాణించిన వ్యాన్‌ను పోలీసులు సీజ్‌ చేసి పరిశీలిస్తున్నారు.

మరోవైపు, ఈ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌ కూడా కనిపించకుండా పోయాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మంగళవారం నుంచి తమ కుమారుడు కనిపించడం లేదని వారు స్థానిక పోలీసులకు చెప్పారు.

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)