ఇడా తుపాను బీభత్సం, నీట మునిగిన న్యూయార్క్, న్యూజెర్సీ

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో ఆకస్మిక వరదలు, టోర్నడోల కారణంగా తొమ్మిది మంది మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఇళ్లలోకి చేరిన వరద నీటిలో కొంతమంది చిక్కుకున్నారు. కొట్టుకుపోయిన వాహనంలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు.
న్యూయార్క్, న్యూజెర్సీ గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
గంటలో 8 సెంటీమీటర్ల వర్షపాతం
న్యూయార్క్ సెంట్రల్ పార్కులో కేవలం ఒక గంట వ్యవధిలోనే 8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
న్యూయార్క్ సిటీ సబ్‌వే లైన్లన్నీ మూసివేశారు.
రహదారులపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
న్యూయార్క్, న్యూజెర్సీల్లో అనేక విమాన సర్వీసులను, రైళ్లను నిలిపివేశారు.
ఇదొక వాతావరణ విపత్తు అని న్యూయార్క్ నగర మేయర్ బిల్ డే బ్లాసియో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వరదల్లో కొట్టుకుపోయిన వాహనం నుంచి 70 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు న్యూజెర్సీలోని పాసైక్ నగర మేయర్ హెక్టర్ లోరా సీఎన్ఎన్‌కి చెప్పారు.
న్యూజెర్సీలో మరో వ్యక్తి మరణించినట్లు ఎన్‌బీసీ న్యూయార్క్ నివేదించింది. న్యూయార్క్ నగరంలో ఏడుగురు మరణించారని ఎన్‌బీసీ, ఏఎఫ్‌పీ పేర్కొన్నాయి. వీరిలో కొందరు ఇళ్ల బేస్‌మెంట్లలో చిక్కుకొని మృతిచెందినట్టు తెలిపాయి. మృతుల్లో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
వరద నీటిలో చిక్కుకున్న సబ్ వే స్టేషన్లు, ఇళ్లు, నీట మునిగిన రహదారుల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి.
రాత్రి భోజనం చేసే సమయంలో భారీ శబ్ధం విన్నాను. మా బాత్రూమ్‌లోని షవర్ డ్రెయిన్ నుంచి నీరు బయటకు వచ్చింది. నేను యుటిలిటీ రూమ్‌లోని ప్రధాన వాటర్ లైన్‌ని తనిఖీ చేయడానికి వెళ్లాను. తిరిగి గదిలోకి వచ్చే సమయానికి దాదాపు అడుగు మేర నీరు వచ్చి చేరింది. ఇది అంత వేగంగా ఎలా వచ్చిందో నమ్మశక్యం కాలేదు అని న్యూయార్క్ నివాసి జార్జ్ బెయిలీ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యూయార్క్ నగరం, బ్రూక్లిన్, క్వీన్స్, లాంగ్ ఐలాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోఅత్యవసర పరిస్థితిని ప్రకటించింది యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్. మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్‌లోని కొన్ని ప్రాంతాలకు టోర్నడో హెచ్చరికలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, EPA
ఈ వారం ప్రారంభంలో దక్షిణ లూసియానాలో ఇడా తుపాను విధ్వంసం సృష్టించింది.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. లూసియానాలోని లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూఓర్లీన్స్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.
ఇడా తుపాను ప్రభావం దేశానికి తూర్పు నుంచి ఉత్తరం వైపుకు కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, EPA
ఇవి కూడా చదవండి.
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








