కాబుల్ అల్లకల్లోలం: ‘రోడ్డు పక్కన మృతదేహాలు, ఆస్పత్రుల్లో కుళ్లుతున్న శవాలు’

కాబుల్ బాంబు పేలుడులో 90 మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కాబుల్ విమానాశ్రయం దగ్గర బాంబు పేలుడులో 170 మంది చనిపోయారు.
    • రచయిత, మలిక్ ముదస్సర్
    • హోదా, కాబుల్ నుంచి బీబీసీ ప్రతినిధి

కాబుల్ పొలిమేరల్లోని ఒక ఇంట్లో అంత్యక్రియల ప్రార్ధనల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాబుల్‌ ఎయిర్ పోర్టు నుంచి మరొకరి వ్యక్తి మృతదేహం ఇంటికి చేరింది. తండ్రికి ఏమయిందో, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆయన 8 మంది పిల్లలకు తెలియదు.

నేను ఆసుపత్రికి వెళ్లే దారిలో ఒక వ్యక్తిని కలిశాను. ఆయన సోదరుడు తన కుటుంబాన్ని తనతో పాటు తీసుకుని వెళ్లేందుకు ఉజ్బెకిస్తాన్ నుంచి ఇటీవలే వచ్చారు.

కానీ, కాబుల్‌లో జరిగిన పేలుడు తర్వాత ఆయనతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు కనిపించటం లేదు. పేలుడు జరిగిన మరుసటి రోజు ఆయన భార్య మృతదేహం లభించింది.

శవాలు

నగరం మధ్యలో రోడ్డు పక్కనే మృతదేహాలు పడి ఉన్నాయి. ఆసుపత్రుల మార్చురీల్లో శవాలు కుళ్లిపోతున్నాయి.

ఈ పరిస్థితికి సరైన పరిష్కారాన్ని ఇప్పటి వరకు ఎవరూ సూచించలేకపోతున్నారు. ఇదేమి అసాధారణమైన విషయం కాదు.

ఎవరెక్కడికి వెళ్లారో తెలియదు. ఇక్కడ సమాచారాన్ని సేకరించడానికి ఎవరూ లేరు. ఆసుపత్రి వార్డుల్లో గాయపడినవారున్నారు. అయితే వీరి కథ పేలుళ్లకు గురయిన వారికి భిన్నంగా ఉంది.

కాబుల్ బాంబు పేలుడులో అనేక మందికి గాయాలయ్యాయి
ఫొటో క్యాప్షన్, కాబుల్ బాంబు పేలుడులో అనేక మందికి గాయాలయ్యాయి.

ముఖం పైనా, మెడపైనా బులెట్ గాయాలతో ఉన్న మృతదేహాలు ఆసుపత్రి మార్చురీలో కనిపిస్తున్నాయి.

అయితే ఈ పేలుళ్లను చూసిన ప్రత్యక్ష సాక్షులు నోరు విప్పటం లేదు. పేలుళ్ల తర్వాత జరిగిన కాల్పుల గురించి మాత్రం మాట్లాడుతున్నారు.

ఈ కాల్పులను సైన్యమే చేసిందని కొంతమంది ఆరోపిస్తున్నారు. బీబీసీ ఈ ఆరోపణలను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది.

నాతో పాటే ఉన్న బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీ దీనికి సంబంధించిన ప్రశ్నను అమెరికా రక్షణ శాఖకు పంపించారు.

కానీ, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సేనలే నిజంగా ఈ కాల్పులు జరిపాయా అనే అంశం గురించి ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం రాలేదు.

ఇక్కడే రక్తంలో తడిచిన పత్రాలున్నాయి. ఎయిర్ పోర్టు బయటా లోపలా రోజుల తరబడి చేతుల్లో పట్టుకున్న పాస్‌పోర్టులు ప్రస్తుతం వారి మృతదేహాలపై ఉన్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు ఇప్పుడవే ఆధారంగా ఉన్నాయి.

అక్కడున్న దృశ్యాలను, చిత్రాలను ఎవరికీ చూపించలేం. కానీ వాటి ఫొటోలు తీయడం మా వృత్తి ధర్మం. ఈ పనంతా ఎంత వేదనతో కూడుకున్నదో నేను మాటల్లో చెప్పలేను.

ఈ వేదన కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఉండదు. కానీ మేము కొన్ని రోజుల క్రితం చూసిన ఆ శవాల నుంచి వచ్చే వాసన కొన్ని వారాల వరకు గుర్తొస్తూనే ఉంటుంది.

కాబుల్

ఫొటో సోర్స్, Getty Images

ఈ పేలుళ్లు కాబుల్‌ను విధ్వంసం చేశాయి.

ఎయిర్ పోర్టు దగ్గర పేలుడు తర్వాత కాబుల్ నగరమంతా విచారంతో కూడిన నిశ్శబ్దం అలుముకుంది.

కాబుల్ రాయబార కార్యాలయాల దగ్గర, పెద్ద పెద్ద హోటళ్ల దగ్గర, హైవేల మీద డాక్యుమెంట్లు, విన్నపాలు రాయించుకునేందుకు లైన్లు కట్టిన ప్రజలు ఇప్పుడు కనిపించడం లేదు.

పొడవైన క్యూలు కనిపించనంత మాత్రాన కాబుల్ వదిలి వెళ్లాలని వారికి లేదని అర్థం కాదు.

మృతుల డాక్యుమెంట్లు
ఫొటో క్యాప్షన్, మృతుల డాక్యుమెంట్లు

కొంతమంది తిరిగి ఎయిర్‌పోర్ట్‌ గేట్ల దగ్గరకు వెళ్లారని నా స్నేహితుడొకరు చెప్పారు. నార్త్ గేటు దగ్గర చాలా మంది ఉన్నారు కానీ అక్కడ కూడా చెదురుమదురుగా కాల్పుులు జరుగుతున్నాయి.

పేలుడు సంభవించిన అబే గేటు దగ్గరకు మాత్రం ఎవరూ వెళ్లడం లేదు.

మీరు గనుక జర్నలిస్టు అయితే, మీకు ఇదే దృశ్యం మళ్ళీ మళ్ళీ ఎదురవుతుంది. ఈ సారి మరింత కఠినంగా.

మీరిక్కడకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే, తాలిబాన్లు మిమ్మల్ని చంపేందుకు ప్రయత్నించవచ్చు. "ఇక్కడ నుంచి వెళ్ళండి. మీరు రావడానికి అనుమతి లేదు" అని అవమానించవచ్చు.

కాబుల్ ఎయిర్ పోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

నా జర్నలిస్టు స్నేహితుల్లో చాలా మంది ఇప్పటికే కాబుల్ విడిచిపెట్టి వెళ్లిపోయారు. కొంతమంది వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

వారు ఇక్కడ నుంచి వెళ్లిన కొన్ని గంటల తర్వాత కూడా వారి ముఖాలపై కనిపించిన భావాలు నాకు గుర్తుకొస్తూనే ఉన్నాయి.

వారి పరిస్థితి అక్కడొక నౌక ఉన్నా.. అందులో వారికి స్థలం లేనట్టుగా ఉంది. వారి ఆప్తులను ఇక్కడే వదిలేసి వెళ్లడం ఇష్టం లేకపోయినప్పటికీ వారంతా నిస్సహాయులుగా అయిపోయారు.

ఆ క్షణాన్ని నేను కెమెరాలో బంధించలేకపోయాను.

నగరంలో వేగంగా మారిపోతున్న పరిస్థితి గురించి నాతో పాటు బహుశా మరెవ్వరికీ అవగాహన లేదు. రానున్న రోజుల్లో ఏమి జరగనుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.

తక్షణమే దేశం విడిచిపెట్టి వెళ్ళమని ఆదేశాలు జారీ చేయవచ్చని రాయబారులు, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు చెబుతున్నారు.

డిన్నర్ టేబుల్ దగ్గర కొన్ని ప్రావిన్సుల ట్రెజరర్ అని చెప్పుకుంటున్న ఒక తాలిబాన్ వ్యక్తిని కలిశాను.

ఆయనను మీ అమీర్ అల్ ముమినిన్ (నాయకుడు) ఎక్కడున్నారు? అని అడిగాను. "ఉన్నారు. కానీ, ఆయనపై కొన్ని ఆంక్షలున్నాయి. ఆంక్షలు తొలగించగానే ఆయన కనిపిస్తారు" అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, తాలిబాన్‌లను నమ్మొచ్చా? అఫ్గాన్ మహిళలు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)