టోక్యో ఒలింపిక్స్‌: మహిళల హాకీ సెమీ ఫైనల్‌లో భారత్‌ ఓటమి

హాకీ

ఫొటో సోర్స్, Reuters

టోక్యో ఒలింపిక్స్ మహిళల హాకీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై అర్జెంటీనా 2-1 తేడాతో గెలిచింది.

భారత్ మొదట గోల్ చేసినా రెండు గోల్స్ చేసి ఆధిక్యం సాధించిన అర్జెంటీనాపై పైచేయి సాధించలేకపోయింది.

దీంతో భారత మహిళా హాకీ జట్టు కూడా పురుషుల హాకీ జట్టు ఫలితాన్నే రుచిచూసింది.

మొదట భారత్ గోల్ చేసింది. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే గుర్‌జీత్ కౌర్ గోల్ వేసి భారత్‌కు ఆధిక్యం ఇచ్చారు.

అర్జెంటీనా రెండో క్వార్టర్‌ మూడో నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో విజయవంతం అయ్యింది. దాంతో స్కోరును సమం చేసింది.

మూడో క్వార్టర్‌లో మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచిన అర్జెంటీనా 2-1తో భారత్‌పై ఆధిక్యం సంపాదించింది.

తర్వాత అర్జెంటీనా తమ ఆధిక్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది.

అటు భారత్ చివరి వరకూ ప్రయత్నించినా గోల్ చేయలేకపోయింది.

కాంస్యం కోసం భారత్ ఇక మరో సెమీ ఫైనల్లో ఓడిన బ్రిటన్‌తో తలపడుతుంది.

మొదటి సెమీ ఫైనల్లో నెదర్లాండ్స్ 5-1 తేడాతో బ్రిటన్‌ను ఓడించింది.

వరల్డ్ నంబర్-2 అయిన అర్జెంటీనా ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

భారత మహిళల హాకీ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

క్వార్టర్ ఫైనల్స్‌లో

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల ఫీల్డ్ హాకీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు విజయం సాధించింది.

గుర్‌జీత్ కౌర్ సంపాదించిన గోల్ పాయింట్‌తో ప్రపంచ ర్యాంకింగ్‌లలో నంబరు 2గా ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఒత్తిడికి గురైంది.

భారత్ ఈ లీడ్ పాయింట్‌ను మ్యాచ్ మొత్తం కొనసాగించింది.

ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా కొట్టలేదు.

గుర్‌జీత్ కొట్టిన గోల్ భారత్‌కు విజయాన్ని తెచ్చిపెట్టింది.

భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.

Please wait...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)