టోక్యో ఒలింపిక్స్: పీవీ సింధుకు కాంస్యం, భారత పురుషుల హాకీ జట్టుకు చరిత్రాత్మక విజయం... 41 ఏళ్ల తరువాత సెమీస్ ఎంట్రీ

ఫొటో సోర్స్, Getty Images
పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం చైనాకు చెందిన బింగ్ జియావోపై విజయం సాధించి కాంస్య పతకాన్ని గెల్చుకున్నారు. వరసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు.
ఇంతవరకూ బ్యాడ్మింటన్ క్రీడలో భారత్ నుంచి పురుషులు కానీ మహిళలు కానీ ఆ ఘనత సాధించలేదు.
జియావోతో మొదటి గేమ్‌లో సింధు 21-13 స్కోర్‌తో గెలిచారు. రెండో గేమ్‌లోనూ మొదటి నుంచీ ఆధిక్యాన్ని చూపించిన సింధు 21-15తో రెండో గేమ్ కూడా సొంతం చేసుకున్నారు.
ఈ విజయంతో పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు.
కాంస్య పతకం గెలిచిన సింధును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పీవీ సింధు భారతదేశానికే గర్వకారణమైన క్రీడాకారిణి అని శుభాకాంక్షాలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
వరసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళాక్రీడాకారిణిగా పివీ సింధు చరిత్ర సృష్టించడం పట్ల సిఎం కెసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
రాజకీయ నాయకులు, క్రీడారంగ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాభిమానులు సోషల్ మీడియాలో సింధును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సెమీ ఫైనల్స్‌కు చేరిన భారత పురుషుల హాకీ జట్టు
మరోవైపు, భారత పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌లో స్థానం కోసం బ్రిటన్ జట్టుతో తలపడుతోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమైంది.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు 3-1 బ్రిటన్‌ను ఓడించి సెమీ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. భారతజట్టు సెమీస్‌లో బెల్జియంతో తలపడుతుంది.
గత నాలుగు దశాబ్దాలలో సెమీస్‌లోకి అడుగుపెట్టాలనే భారత పురుషుల హాకీ టీమ్ కల ఇన్నాళ్లకు నెరవేరింది. ఈ జట్టు సెమీస్‌లోనూ ఒలింపిక్స్‌లో గెలిచి భారత హాకీ చరిత్రను తిరగరాస్తుందేమో చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
బాక్సింగ్‌లో సతీశ్ కుమార్ ఔట్
టోక్యో ఒలింపిక్స్ పురుషుల సూపర్ హెవీ వెయిట్ బాక్సింగ్‌లో భారత బాక్సర్ సతీశ్ కుమార్ అవుట్ అయ్యారు.
ఆదివారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ తొలి మ్యాచ్‌లో సతీశ్ కుమార్‌పై ఉజ్బెకిస్తాన్‌కు చెందిన బఖోదిర్ జలోలోవ్ 5-0 తేడాతో గెలిచారు.
ఉజ్బెకిస్తాన్‌కు చెందిన బఖోదిర్ జలోలోవ్ 91 కేజీల విభాగంలో ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్. ఆయనను నిలువరించేందుకు సతీశ్ చాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
సతీశ్ ఓటమితో భారత్‌కు పురుషుల బాక్సింగ్‌లో పతకాల ఆశలు ఆవిరైపోయినట్లే. ఇప్పటికే మనీశ్ కౌశిక్ (63 కేజీలు), వికాస్ కృష్ణన్ (69 కేజీలు), ఆశిష్ చౌధరి (75 కేజీలు) అవుట్ అయ్యారు.
టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో పతకం సాధించిన ఎకైక భారత బ్యాక్సర్‌గా లవ్లీనా బోర్గోహైన్ రికార్డు సృష్టించబోతున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె ప్రపంచ ఛాంపియన్ నియెన్ చెన్‌ను ఓడించి సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
పీవీ సింధు మ్యాచ్ నేడే
వరసగా రెండో ఒలింపిక్ మెడల్ సాధించేందుకు పీవీ సింధు ఆదివారం సాయంత్రం 5 గంటలకు కీలకమైన మ్యాచ్ ఆడబోతున్నారు. కాంస్య పతకం కోసం జరిగే ఈ పోటీలో సింధు గెలిస్తే భారత్ ఖాతాలోకి మరో పతకం వచ్చి చేరుతుంది.
అలాగే, భారత పురుషుల హాకీ జట్టు కూడా ఈరోజు సెమీ ఫైనల్స్‌లో స్థానం కోసం కీలక మ్యాచ్ ఆడబోతోంది. గత నాలుగు దశాబ్దాలలో సెమీస్‌లోకి అడుగుపెట్టాలనే భారత పురుషుల హాకీ టీమ్ కల నెరవేరలేదు. ప్రస్తుత జట్టు చరిత్రను తిరగరాస్తుందేమో చూడాలి.
Please wait...
ఇవి కూడా చదవండి:
- మాన్యువల్ స్కావెంజింగ్: మురుగునీరు శుభ్రం చేస్తూ ఎవరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెబుతోంది?
- స్పైవేర్లు ఎలా మొదలయ్యాయి, మనిషి జీవితాన్ని శాసించేంతగా ఎలా విస్తరిస్తున్నాయి? -డిజిహబ్
- పెట్రోల్ మీద ఎక్కువ టాక్స్ వసూలు చేస్తోంది కేంద్రమా, రాష్ట్రమా? - BBC FactCheck
- పెగాసస్: గూఢచర్య ఆరోపణలపై చర్చలను మోదీ ప్రభుత్వం ఎందుకు దాటవేస్తోంది?
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








