టోక్యో ఒలింపిక్స్: సెమీ ఫైనల్స్‌లో పీవీ సింధు ఓటమి, క్వార్టర్ పైనల్ చేరిన మహిళల హాకీ జట్టు

ఫొటో సోర్స్, Getty Images
శనివారం టోక్యో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు, చైనీస్ తైపీ క్రీడాకారిణి టై జు యింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
సింధుపై వరుసగా రెండు సెట్లు గెలుచుకున్న టై జు యింగ్ ఫైనల్‌కు చేరారు.
హోరాహోరీగా జరిగిన మొదటి సెట్‌ను 21-18 తేడాతో గెలిచిన టై జు యింగ్, రెండో సెట్‌ను 21-12 తేడాతో సొంతం చేసుకుని ఫైనల్‌కు చేరుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ మ్యాచ్ ప్రారంభంలో సింధు ముందంజలో నిలిచారు. మ్యాచ్ సమయంలో సింధు దూకుడుగా కనిపించారు.
కానీ మ్యాచ్ సాగే కొద్దీ జూ యింగ్ మ్యాచ్‌పై పట్టు సాధించారు. సింధు చేతి నుంచి మ్యాచ్ చేజారిపోతున్నట్టు కనిపించింది.
జూ యింగ్ ఆటను ఎప్పుడూ చూసేవారు ఆమె ఆట తీరు అర్థం చేసుకోలేమని చెబుతారు. ఎందుకంటే చాలాసార్లు ఆమె ఎలా ఎదురుదాడి చేయబోతోందో ప్రత్యర్థులకు అర్థం కాదు.
ఈ మ్యాచ్‌లో మొదటి నుంచీ సింధుకు గట్టిపోటీ ఇస్తూ వచ్చిన జూ యింగ్ మెల్లమెల్లగా ఆధిక్యం సాధించారు. సింధుకు రిలాక్స్ అయ్యే అవకాశమే ఇవ్వలేదు.
మరోవైపు, జూ యింగ్ మాత్రం మ్యాచ్‌లో ప్రతి షాట్‌నూ ఎంతో ఈజ్‌తో, కాన్ఫిడెన్స్‌తో ఆడుతున్నట్టు కనిపించారు.
తర్వాత మొదలైన రెండో సెట్ మొదటి నుంచీ జూ యింగ్ మొదటి సింధుకు కుదురుకునే అవకాశం ఇవ్వలేదు.
ఈ మ్యాచ్‌లో ఓటమితో ఒలింపిక్స్ స్వర్ణం గెలవాలనుకున్న సిందు ఆశలు నెరవేరలేదు.
సింధు ఇప్పుడు కాంస్యం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం జరగనుంది.

ఫొటో సోర్స్, Getty Images
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
పూల్ ఏలో ఐర్లాండ్‌పై 2-0 తేడాతో విజయం సాధిండం భారత్‌కు కలిసొచ్చింది.
ఐర్లాండ్ ఓటమితో పూల్ ఏలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది.
దక్షిణాఫ్రికాపై విజయం
విమెన్స్ హాకీలో పూల్ ఏలో నిర్వహించిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 4-3 తేడాతో భారత మహిళల హాకీ జట్టు విజయం సాధించింది.
వందన కటారియా వరుసగా మూడు గోల్స్ కొట్టగా, నేహా మరో గోల్ కొట్టి భారత్‌కు విజయం తెచ్చిపెట్టారు.
మహిళల మిడిల్ వెయిట్ బాక్సింగ్‌లో పూజా కుమారి ఓటమి
మహిళల బాక్సింగ్ మిడిల్ వెయిట్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ పూజా కుమారి చైనా బాక్సర్ లీ క్వియాన్ చేతిలో ఓడిపోయారు.
నాలుగో క్వార్టర్ ఫైనల్లో లీ క్వియాన్ 5-0తో పూజా కుమారిపై విజయం సాధించారు.

ఫొటో సోర్స్, REUTERS/Dylan Martinez
మరోవైపు భారత్‌కు కమల్‌ప్రీత్ కౌర్ శుభవార్త తెచ్చారు. డిస్కస్ త్రోలో అద్భుతమైన ప్రదర్శనతో శనివారం ఆమె ఫైనల్స్‌లో చోటు సంపాదించారు.
ఆగస్టు 2న ఈ ఫైనల్స్ జరగబోతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
క్వాలిఫైంగ్ రౌండ్‌లో 64 మీటర్ల దూరానికి ఆమె డిస్కస్‌ను విసిరారు. ఒలింపిక్స్‌కు ముందు కూడా అంతర్జాతీయ వేదికలపై కమల్‌ప్రీత్ మంచి ప్రదర్శన ఇస్తూ వచ్చారు.
65 మీటర్ల కంటే ఎక్కువ దూరం డిస్కస్‌ను విసిరిన తొలి భారతీయ మహిళ కమల్‌ప్రీత్.
ఫైనల్స్‌లో చోటు సంపాదించడం ద్వారా భారతీయుల్లో మరో పతకంపై ఆమె ఆశలు చిగురింపజేశారు.
అమిత్ పంఘాల్ ఔట్
ఇక, భారత్‌కు పతకం తీసుకువస్తారని భావించిన ప్రపంచ నంబర్ 1 బ్యాక్సర్ అమిత్ పంఘాల్ ఒలింపిక్స్ నుంచి వెనుతిరిగారు.
52 కేజీల కేటగిరీలో కొలంబియాకు చెందిన యుబ్రజెన్ మార్టినేజ్ చేతిలో 1-4 తేడాతో అమిత్ ఓడిపోయారు.2016 రియో ఒలింపిక్స్‌లో యుబ్రజెన్ రజత పతకాన్ని గెలిచారు.
Please wait...
ఇవి కూడా చదవండి:
- గుజరాత్: 'నా భర్త వీర్యం సేకరించేందుకు అనుమతి ఇవ్వండి'
- పెట్రోల్ మీద ఎక్కువ టాక్స్ వసూలు చేస్తోంది కేంద్రమా, రాష్ట్రమా? - BBC FactCheck
- పెగాసస్: గూఢచర్య ఆరోపణలపై చర్చలను మోదీ ప్రభుత్వం ఎందుకు దాటవేస్తోంది?
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








