బైడెన్-పుతిన్ సమావేశం: అణ్వాయుధ నియంత్రణపై చర్చలకు అంగీకారం

ఫొటో సోర్స్, Reuters
అమెరికా రష్యా అధ్యక్షుల మధ్య బుధవారం జెనీవాలో చోటు చేసుకున్న సమావేశం ముగిసింది. అయితే, ఈ చర్చల సారాంశాన్ని ఇరు దేశాల నేతలు ప్రశంసించినప్పటికీ, వీటి నుంచి చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు మాత్రం కనిపించటం లేదు.
2018 నుంచి ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య చర్చలు చోటు చేసుకోలేదు.
మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య నెలకొన్న బేధాభిప్రాయాలు గురించి చర్చకు వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. రష్యా మరో ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవటం లేదని కూడా చెప్పారు.
బైడెన్ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడని పుతిన్ ప్రశంసించారు. ఇద్దరు నాయకులూ ఒకే రకమైన భావాలను వ్యక్తపరిచారు.
రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయని బైడెన్ అన్నారు.
బైడెన్ పుతిన్‌కు ప్రత్యేకంగా తయారు చేసిన ఏవియేటర్ సన్ గ్లాసెస్, గాజుతో చేసిన ఎద్దు శిల్పాన్ని బహుకరించారు. పుతిన్ బైడెన్‌కు బహుమతి ఇచ్చారో లేదోననే విషయంపై స్పష్టత లేదు.
2018లో మాత్రం ఫిన్‌లాండ్‌లోని హెల్సింకీలో జరిగిన సమావేశం తర్వాత అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌కు సాకర్ బంతిని బహుకరించారు.

ఫొటో సోర్స్, Reuters
ఇరుపక్షాలు అణ్వాయుధ నియంత్రణ పై చర్చలు మొదలుపెట్టేందుకు అంగీకరించాయి.
అమెరికాలో జరిగిన 2020 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనే ఆరోపణలతో ఇరు దేశాల రాయబారులను ఆయా దేశాల నుంచి ఉపసంహరించారు. అయితే, రాయబారులను తిరిగి ఆయా దేశ రాజధానులకు పంపేందుకు ఈ సమావేశంలో అంగీకారం కుదిరింది.
కానీ, సైబర్ సెక్యూరిటీ, యుక్రెయిన్, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ గురించి మాత్రం ఇరు దేశాల మధ్య ఎటువంటి అంగీకారం కుదరలేదు. ఆయన పీనల్ కాలనీలో రెండున్నరేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు.
ఇటీవల 24 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన నవల్నీ గురించి అమెరికా వ్యక్తం చేసిన విచారాన్ని మాత్రం పుతిన్ తిప్పికొట్టారు.
నావల్నీ పై విష ప్రయోగం జరిగిందనే విషయాన్ని కూడా పుతిన్ ఖండించారు.
ఇరుదేశాల్లో జైళ్లలో ఉన్న ఖైదీల బదిలీ విషయంలో ఒప్పందం కుదరవచ్చని పుతిన్ సూచించారు.

ఫొటో సోర్స్, SPUTNIK VIA REUTERS
అయితే, అమెరికాలో జరిగిన సైబర్ దాడుల్లో రష్యా పాత్రను కొట్టి పడేస్తూ, రష్యాలో జరిగిన చాలా సైబర్ దాడులు అమెరికాలో పుట్టినవే అని పుతిన్ వ్యాఖ్యానించారు.
నీరు, ఇంధనం లాంటి వాటి కీలకమైన మౌలిక సదుపాయాలు పై హ్యాకింగ్ కానీ, ఇతర దాడులు గానీ జరగకూడదని పుతిన్ కు సూచించినట్లు బైడెన్ చెప్పారు.
"మీ చమురు బావుల పైపు లైనుల పై ర్యాన్సమ్‌వేర్ దాడి జరిగితే మీకెలా ఉంటుంది అని సూటిగా అడిగాను. బాగుండదనే సమాధానాన్ని ఇచ్చారు. రష్యా ఇలాంటి ప్రాధమిక నిబంధనలను ఉల్లంఘిస్తే, అమెరికా వాటిని తిప్పికొడుతుంది" అని పుతిన్‌కు చెప్పినట్లు బైడెన్ తెలిపారు.
అయితే, మానవహక్కులు, నిరసించే హక్కు విషయంలో మాత్రం ఇరు పక్షాలూ విబేధించాయి.
మానవహక్కులు, బ్లాక్ లైవ్స్ పై పుతిన్ చేసిన వ్యాఖ్యలను కూడా బైడెన్ తిప్పికొట్టారు.
రష్యా అమెరికాతో ఎందుకు సహకరించాలనే ప్రశ్నకు సమాధానంగా, "ప్రస్తుతం రష్యా చైనా చేతిలో నలుగుతోంది. చైనా ప్రధాన శక్తిగా నిలవాలని అనుకుంటోంది" అని జెనీవా నుంచి వెళ్లే ముందు బైడెన్ అన్నారు.
రష్యా ఆర్ధికంగా అమెరికా కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ, రష్యాను ఒక న్యూక్లియర్ శక్తిగా అమెరికా గుర్తించడం వల్లే తనతో బైడెన్ చర్చలు జరపడానికి వచ్చారని పుతిన్ చెప్పినట్లు బీబీసీ మాస్కో ప్రతినిధి సారా రెన్స్‌ఫోర్డ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జోన్ సోపెల్, ఉత్తర అమెరికా ప్రతినిధి
అమెరికా రష్యా ల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న కొన్ని సంక్లిష్ట విషయాల పై చర్చ చోటు చేసుకోవడాన్ని బైడెన్ విజయంగా పరిగణిస్తారు.
అలాగే, అమెరికా ప్రజలకు ఆయన డోనల్డ్ ట్రంప్‌లా వ్యవహరించనని కూడా నిరూపించుకోవాలని చూడవచ్చు.
"సైబర్ సెక్యూరిటీ, మానవ హక్కుల విషయంలో అమెరికాకు అనుగుణంగా రష్యా ప్రవర్తించని పక్షంలో మేము స్పందిస్తాం" అని బైడెన్ చెప్పారు.
బైడెన్ ఎలా ప్రతిస్పందిస్తారనే విషయం పై మాత్రం స్పష్టత లేదు.
సరే! బైడెన్ ఏమి చేస్తారోనని పుతిన్ కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆయన గతంలో పశ్చిమ దేశాల నాయకులకు అంతగా గౌరవం ఇవ్వలేదు. బైడెన్ గురించి విభిన్నంగా ఆలోచించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా: గాల్వాన్ లోయలో ఘర్షణలు ఎలా మొదలయ్యాయి.. ఆ తర్వాత ఏం జరిగింది?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- టోక్యో ఒలింపిక్స్ వచ్చే నెలలో మొదలవుతాయా... ఈ క్రీడా వేడుకకు కోవిడ్ ఎమర్జెన్సీ అడ్డంకి అవుతుందా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- ఫ్రెంచ్ ఓపెన్ 2021: తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకున్న బార్బోరా క్రెచికోవా
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








